Remedies

ఏ స్తోత్రం చదివితే ఎలాంటి ఫలితం ఉంటుంది.

* ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ?

నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి, మరణ అనంతరం పుణ్య లోకాలు పొందుతాము. Soma Sekhar

💠 #గణనాయకాష్టకం – అన్ని విజయాలకు !!
💠 #శివాష్టకం – శివ అనుగ్రహం !!
💠 #ఆదిత్యహృదయం – ఆరోగ్యం, ఉద్యోగం !!
💠 #శ్రీరాజరాజేశ్వరి_అష్టకం – సర్వ వాంచసిద్ది !!
💠 #అన్నపూర్ణ_అష్టకం – ఆకలి దప్పులకి !!
💠 #కాలభైరవ_అష్టకం – ఆధ్యాత్మిక జ్ఞానం, అద్భుత జీవనం !!
💠 #దుర్గష్టోత్తర_శతనామం – భయహరం !!
💠 #విశ్వనాథ_అష్టకం – విద్య విజయం !!
💠 #సుబ్రహ్మణ్యం_అష్టకం – సర్పదోష నాశనం, పాప నాశనం !!
💠 #హనుమాన్_చాలీసా – శని బాధలు, పిశాచపీడ !!
💠 #విష్ణు_శతనామస్తోత్రం – పాప నాశనం, వైకుంఠ ప్రాప్తి !!
💠 #శివ_అష్టకం – సత్కళత్ర, సత్పురుష ప్రాప్తి !!
💠 #భ్రమరాంబిక_అష్టకం – సర్వ శుభప్రాప్తి !!
💠 #శివషడక్షరి_స్తోత్రం – చేయకూడని పాప నాశనం !!
💠 #లక్ష్మీనరసింహ_స్తోత్రం – ఆపదలో సహాయం, పీడ నాశనం !!
💠 #కృష్ణ_అష్టకం – కోటి జన్మపాప నాశనం !!
💠 #ఉమామహేశ్వర స్తోత్రం – భార్యాభర్తల అన్యోన్యత !!
💠 #శ్రీరామరక్ష_స్తోత్రం – హనుమాన్ కటాక్షం !!
💠 #లలిత_పంచరత్నం – స్త్రీ కీర్తి !!
💠 #శ్యామాల_దండకం – వాక్శుద్ధి !!
💠 #త్రిపుర_సుందరిస్తోత్రం – సర్వజ్ఞాన ప్రాప్తి !!
💠 #శివ_తాండవస్తోత్రం – రథ గజ తురంగ ప్రాప్తి !!
💠 #శని_స్తోత్రం – శని పీడ నివారణ !!
💠 #మహిషాసుర_మర్ధిని_స్తోత్రం – శత్రు నాశనం !!
💠 #అంగారక_ఋణ_విమోచనస్తోత్రం – ఋణ బాధకి !!
💠 #కార్యవీర్యార్జున_స్తోత్రం – నష్ట ద్రవ్యలాభం !!
💠 #కనకధార_స్తోత్రం – కనకధారయే !!
💠 #శ్రీసూక్తం – ధన లాభం !!
💠 #సూర్య_కవచం – సామ్రాజ్యంపు సిద్ది !!
💠 #సుదర్శన_మంత్రం – శత్రు నాశనం !!
💠 #విష్ణు_సహస్రనామస్తోత్రం – ఆశ్వమేధయాగ ఫలం !!
💠 #రుద్రకవచం – అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!
💠 #దక్షిణ_కాళీ – శని బాధలు, ఈతిబాధలు !!
💠 #భువనేశ్వరి_కవచం – మనశ్శాంతి, మానసిక బాధలకు !!
💠 #వారాహిస్తోత్రం – పిశాచ పీడ నివారణకు !!
💠 #దత్తస్తోత్రం – పిశాచ పీడ నివారణకు !!
💠 #లాలిత_సహస్రనామం – సర్వార్థ సిద్దికి !!

⭐ పంచరత్నం – 5 శ్లోకాలతో కూడినది !!
⭐ అష్టకం – 8 శ్లోకాలతో కూడినది !!
⭐ నవకం – 9 శ్లోకాలతో కూడినది !!
⭐ స్తోత్రం – బహు శ్లోకాలతో కూడినది !!
⭐ శత నామ స్తోత్రం – 100 నామాలతో స్తోత్రం !!
⭐ సహస్రనామ స్తోత్రం – 1000 నామాలతో స్తోత్రం !!

* 💠పంచపునీతాలు

⭐ వాక్ శుద్ధి
⭐ దేహ శుద్ధి
⭐ భాండ శుద్ధి
⭐ కర్మ శుద్ధి
⭐ మనశ్శుద్ధి

💠 వాక్ శుద్ధి :

వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు.. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు… పగ, కసి, ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు… మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి… అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి…

💠 దేహ శుద్ధి :
మన శరీరం దేవుని ఆలయం వంటిది.. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, రెండు పూటలా స్నానం చెయ్యాలి.. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.

💠 భాండ శుద్ధి :
శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం… అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి… స్నానం చేసి, పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది…

💠 కర్మ శుద్ధి :
అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు… అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు… తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు…

💠 మనశ్శుద్ధి :
మనస్సును ఎల్లప్పుడు ధర్మ, న్యాయాల వైపు మళ్ళించాలి… మనస్సు చంచలమైనది… ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది.. దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి… దీని వల్ల దుఃఖం చేకూరుతుంది.. కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి.

ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!
ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!
నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !!
యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!
సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !!
గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!
సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!
పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది !!
భక్తి ప్రవేశిస్తే మనిషి మనీషి అవుతాడు !! Soma Sekhar

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *