Pandugalu

శని త్రయోదశి నాడు ఏమి చేస్తే దేవుడు సంతృప్తి చెందుతాడు ?

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి , న్యాయం , ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.

శని త్రయోదశి అంటే

శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో , నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు.

అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి , ఎలా చేయాలి ?

శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.

కుటుంబ , ఉద్యోగ , వ్యాపార , ఆరోగ్య , కోర్టు కేసులు , శత్రువులు , రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు , పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని , వస్త్ర , ధన , వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.
పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తరువాత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం . దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు , పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి.

త్రయోదశి వ్రతం :-

శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం. సోదరుడు యమధర్మరాజు , సోదరి యమున , స్నేహితులు హనుమాన్ , కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త , పింగళ , కృషాణు , శౌరి , బభ్రు , మంద , పిప్పలా , రౌద్రాంతక , సూర్యపుత్ర అని పిలవబడుతాడు.
నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు.
ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి. ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి.

శని త్రయోదశి రోజున పాటించవలసిన నియమాలు

🌹 ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి.

🌹 ఆ రోజు మద్య , మాంసాలు ముట్టరాదు.

🌹 వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.

🌹 శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు
నీలాంజన సమభాసం
రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరం.

అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది.

🌹 వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి.

🌹 అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి.

🌹 ఎవరితోను వాదనలకు దిగరాదు.

🌹 ఆరోజు ఆకలితో ఉన్న వారికి , పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.

🌹 ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

🌹 మూగ జీవులకు ఆహార గ్రాసలను , నీటిని ఏర్పాటు చేయాలి.

🌹 కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి.

🌹 అనాధలకు , అవిటి వారికి , పేద వితంతువులకు , పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి.

🌹 జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి.

🌹 ప్రతి రోజు తల్లి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి.

🌹 అత్త మామలను , వంట చేసి వడ్డించిన వారిని , మన మేలు కోరేవారిని , ఉద్యోగం ఇప్పించిన వారిని , ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు.

🌹 ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను , భవ బంధాలను మరువరాదు.

ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడని పురాణ వచనం.

దశరథుని రాజ్యానికి శనైశ్చర గ్రహబలం లేనందున కష్టాలు వస్తే , శనైశ్చరుని స్తుతించి దశరథుడు ఈ స్తోత్రాన్ని చేస్తాడు. ఈ స్తోత్రం పారాయణము చేసినవారికి శీఘ్రముగా నవగ్రహ అనుగ్రహం కలిగి ఏలినాటి శని , అర్ధాష్టమ శని దోషాలు తొలగి సంపదలు , ఐశ్వర్యాన్ని ఇస్తారని ఫలశ్రుతి. నిత్యం లేదా తప్పక శని వారం శనిత్రయోదశి వంటి పర్వదినాలలో పారాయణము చేయడం మంచిదని గురువుగారు పద్మపురాణ ప్రవచనంలో చెప్పారు.

దశరథకృత శ్రీ శని స్తోత్రం*

ఓం నమః కృష్ణాయ నీలాయ – శితికంఠనిభాయ చ
నమః కాలాగ్ని రూపాయ – కృతాంతాయ చ వై నమః

నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రుజటాయచ
నమో విశాల నేత్రాయ – స్థూలరోమ్ణే చ వై పునః

నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే
నమోస్తు కోటరాక్షాయ – దుర్నిరీక్షాయ వై నమః

నమో నీలమధూకాయ – నీలోత్పలనియభాయ చ
నమో ఘోరాయ రౌద్రాయ – భీషణాయ కరాళినే

నమస్తే సర్వభక్షాయ – బలీముఖ నమోస్తుతే
సూర్యపుత్ర నమస్తేస్తు భాస్కరాభయదాయ చ

అథో దృష్టే నమస్తేస్తు – సంవర్తక నమోస్తుతే
నమో మందగతే తుభ్యం నిస్త్రింశాయ నమోస్తుతే

తపసా దగ్ధదేహాయ- నిత్యం యోగరతాయ చ
నమో నిత్యం క్షుధార్తాయ – అతృప్తాయ చ వై నమః

జ్ఞాన చక్షు ర్నమస్తేస్తు- కశ్యపాత్మజసూనవే
తుష్ఠోదదాసి నై రాజ్యం – రుష్ఠో హరసి తత్తణాత్

దేవాసురమనుష్యా శ్చ సిద్ధ విద్యాధరోరగాః
త్వయా విలోకితా స్సర్వే – నాశం యాంతి సమూలతః

ఓం నమస్తే కోణసంస్థాయ – పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రురూపాయ – కృష్ణాయ చ నమోస్తుతే

నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ
నమస్తే యమసంజ్ఞాయ- నమస్తే సౌరయే విభో

నమస్తే మందరూపాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం కుర మే దేవ వరార్థో హ ముపాగతః

ప్రసాదం కురు దేవేశ – దీనస్య ప్రణతస్య చ

ఇతి శనిస్తోత్రమ్ |

👏👏

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *