News

SAP ఇంటింట పారాయణ కార్యక్రమము

ఓం నమో భగవతే వాసుదేవాయ

SAP ఇంటింట పారాయణ కార్యక్రమము 1600

శ్రీమత్ భగవద్గీత – శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము – హనుమాన్ చాలీస

శ్రీనామ రామాయణము – గోవింద నామావళి – కృష్ణాష్టకము

ప్రతి ఆదివారము ఒక భక్తుడి ఇంట్లో సా||గం|| 5-30 ని||ల నుండి సా॥గం॥ 6-30 ని॥ల వరకు

పారాయణమునకు ఆహ్వానించండి- భగవంతుని అనుగ్రహముతో ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యముతో వర్ధిల్లండి…

ధర్మశాస్త్రాలు ఏమిచెబుతున్నాయంటే…

“ధర్మో రక్షతి – రక్షిత ” మనం ధర్మాన్ని ఆచరిస్తే, ఆ ధర్మమే మనలను కాపాడుతుంది. మన ధర్మమేమిటి అంటే- క్రిమి, కీటక పశు, పక్ష్యాది మొదలగు అనేక జన్మల కన్న ఉత్తమ జన్మ మానవ జన్మ అటువంటి మానవ జన్మ రావడం చాలా దుర్లభం. అందుచేత భగవంతుడు ఇచ్చిన జన్మలలోకెల్ల ఉత్తమ జన్మ అయిన ఇట్టి మానవజన్మను వృధా కాకుండ, నీచమైన జన్మలకు వెళ్లకుండ ఏ విధంగా జీవించాలి. ఏ విధంగా చావాలి అని తెలిపే “భగవద్గీత”ను మనకు శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుని నిమిత్తముగా చేసుకొని ప్రసాదించాడు. అన్ని వేదముల సారము, అన్ని ఉపనిషత్తుల సారములను రంగరించి, మానవులకు నిత్యజీవితంలో ఉపయోగపడే అన్ని విషయాలను భగవద్గీత రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించాడు. అందుకే హిందువులందరికి ముఖ్య గ్రంథమైనది భగవద్గీత. మన దేశంలోని ప్రభుత్వ న్యాయస్థానాలు కూడ భగవద్గీతకు ప్రాధాన్యతనిచ్చి గుర్తించింది.

పూర్వం కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలలో మానవుల ఆయు ప్రమాణము కొన్ని వేల సంవత్సరాలు. అంచేత ఆ కాలంలో భగవంతుని కొరకు వందల సంవత్సరాలు తపస్సు చేసేవారు. కాని కళయుగంలో మానవుని ఆయు ప్రమాణము వంద సంవత్సరాలు మాత్రమే. అందుచేత కళియుగంలో కష్టతరమైన తపస్సుతో నిమిత్తం లేకుండా, సులభతరమైన సంపూర్ణమైన భక్తితో భగవన్నామ స్మరణ, భజనలు, కీర్తనల చేతనే భగవంతుని అనుగ్రహం పొందవచ్చునని మహాత్ములు, మహర్షులు తెలిపారు.

కాబట్టి, ప్రతి మానవుడికి నిత్య జీవితంలో సంసారిక విషయములతోపాటు, ఆధ్యాత్మిక విషయాలు కూడా ఒక భాగమే. అంచేత హిందూ సమాజానికి ముఖ్య గ్రంథమైన శ్రీమత్ భగవద్గీత విష్ణుసహస్ర నామస్తోత్రం, హనుమాన్ చాలీస, నామరామాయణం, గోవింద నామావళి, శ్రీకృష్ణాష్టకం ప్రతి ఆదివారం ఒకరి ఇంట్లో పారాయణం చేయుటకు నిర్ణయించనైనది. ఈ విధంగా మనం ధర్మాన్ని ఆచరిస్తే, ఆ ధర్మమే మనలను రక్షిస్తుంది.

కావున, “ఇంటింటి పారాయణం” ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంట్లో పారాయణం చేయాలని దృఢ సంకల్పంతో నిర్ణయించనైనది. ఇట్టి ప్రోగ్రాంకు ఎటువంటి ఖర్చులు లేవు. ఒక గంట సమయం వెచ్చిస్తే చాలు, భగవంతుని అనుగ్రహం తప్పక ఉంటుంది. ఈ “ఇంటింటి పారాయణం” ప్రోగ్రాం నిర్వహించుట కొరకు ఆహ్వానించువారు ఈ క్రింద చూపిన వారని సంప్రదించి, తమ పేరు నమోదు చేసుకోగలరు.

1) నూకల లక్ష్మీనారాయణ (ప్రోగ్రాం పర్యవేక్షకులు), సెల్ 9247256921

4) సుబ్బారావు (ప్రోగ్రాం సేవకులు), సెల్ 9440411066

2) జొన్నల ప్రసాద్ (ప్రోగ్రాం సంయుక్త సేవకులు), సెల్ 99480 14592

5) జి. జనార్ధన్ (ప్రోగ్రాం సేవకులు), సెల్ 94416 31242

3) పెద్ది సతీష్ (ప్రోగ్రాం లావాదేవీల సేవకులు), సెల్ 91334 19429

పారాయణం నిర్వహించబడిన ఇంటి యజమానికి, ప్రతి నిత్యం పారాయణం చేయుట కొరకు “నిత్య పారాయణ గ్రంథం(245 పేజీలు) ” ఉచితంగా ఇవ్వబడును.

హిందులోకానికి విజ్ఞప్తి…!

మన శ్రీ కృష్ణ గీతా మందిరము, గీతామార్గ్, శివాజీ నగర్, ఇందూరు నందు ప్రతిరోజు ఉ॥గం॥ 8-15 ని||ల నుండి ఉ॥గం|| 9-15ని॥ల వరకు శ్రీమద్భగవద్గీత ఉపనిషత్తు, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం సామూహికముగా భక్తులతో నిర్వహించబడును. ప్రతి ఆదివారము మరియు ప్రతి ఏకాదశి రోజులలో సాయంత్రం 7-00 గం॥ల నుండి 8-00 గం॥ల వరకు భక్తులతో సామూహిక భజన కార్యక్రమము, మహాహారతి, శ్రీ కృష్ణునిపవళింపు సేవ, ఇట్టి కార్యక్రమములో భగవత్ సేవకులందరూ పాల్గొని శ్రీకృష్ణ భగవంతుని అనుగ్రహం

పొందలగరని కోరనైనది.

నిర్వాహకులు…

భగవత్ సేవక బృందం

శ్రీ కృష్ణ గీతామందిరం, గీతామార్గ్, శివాజీ నగర్, ఇందూరు. (మరియు)

శ్రీ చక్రం గుడి, బ్రహ్మపురి, ఇందూరు వారి సంయుక్త నిర్వహణ.

భుక్తికి, ముక్తికి మార్గం భగనవద్గీత

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *