Dasha maha vidyalu Poojalu

శ్యామల నవరాత్రులు, గుప్త నవరాత్రి

*శ్యామల నవరాత్రులు, గుప్త నవరాత్రి*

శ్యామల దేవిని ఇలా తమలపాకులతో మూలమంత్రాలతో అర్చన చేస్తుంటాను, ఆ తల్లికి చేసే ఎన్నో పూజల్లో ఇదో కైంకర్యం , అభిషేకం చేశాక తల్లికి ఇలా తమలపాకులతో అలంకారం చేసి తమలపాకులతోనే అర్చన చేస్తాను శ్యామల నవరాత్రులు వస్తున్నాయి కదా, శ్యామల మూల మంత్రాన్ని జపిస్తూ ఇలా అర్చన చేయవచ్చు, మూలమంత్రం ఉపదేశం లేని వారు అమ్మవారి అష్టోత్తరం తో అర్చన చేయవచ్చు, పూజ విధానం ఇది వరకే ఇచ్చాను మళ్ళీ ఇంకోసారి పోస్ట్ చేస్తాను.. ఇది ఒక సూచన మాత్రమే ఇలానే చేయాలి అని కాదు మీ శక్తి కొద్దీ భక్తితో తల్లిని పూజించుకోండి పిల్లలతో శ్యామల దండకం చదివించండి, శ్యామల దండకం కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ శబ్ద ధ్వని తరచూ ఉచ్చరించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.. వయసు పెరిగే కొద్దీ పెద్దలకు మతిమరుపు మొదలు అవుతుంది తినే మందులు వల్ల కాబట్టి చిన్నా పెద్దా అందరికీ శ్యామల దండకం జ్ఞాపకశక్తి ని పెంచే మంత్రం, అలాగే పాలల్లో దాల్చిన చెక్క పొడి, ఏలకులు పొడి వేసి కాచిన పాలను రోజు నివేదన చేయాలి అది ప్రసాదంగా అందరూ తీసుకోవాలి, వేరే ప్రసాదాలు మీ సౌకర్యం.. ఉదయం శ్యామల పూజ విధానంలో పూజ చేసి , సాయంత్రం లలితా సహస్రనామ పారాయణతో అర్చన చేయండి..

ఆ 9 రోజులు 9 రకాలుగా అర్చన చేసుకుంటాను ఒక రోజు ఇలా తమలపాకులు, ఒకరోజు గుండు వక్కలు, ఒకరోజు పసుపు కొమ్ములు, ఒకరోజు గురువింద గింజలు, ఒకరోజు దానిమ్మ గింజలు, ఒకరో తులసి, ఒకరోజు బిల్వం, ఒకరోజు వివిధ రకాల పువ్వులు, ఒకరోజు పసుపుకుంకుమా గాజులు ఇలా వివిధ రకాలుగా అభిషేకం తర్వాత అర్చన , నివేదన జపం ధ్యానం, ఒక రోజు తర్పణం చివరిగా హోమం ఇలా యధాశక్తిని పూజించుకుంటాను..

రాజ శ్యామల (మాతంగి)పూజా విధానం

ప్రతి దేవుని (దేవత) పూజకు ముందుగా గణపతి పూజ చేసి అనంతరం మీరు ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని పూజించవలెను.

🌷వినాయకుని శ్లోకం🌷

శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే

వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః
👉{అని నమఃస్కారం చేసుకోవాలి}

శ్లో|| గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః

గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

★పవిత్రము

శ్లో|| అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాం గతోపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం | సభాహ్యా అభ్యంతర శుచిః ||
పుండరీకాక్ష | పుండరీకాక్ష | పుండరీకాక్షాయ నమః ||

👉{ పంచపాత్రలోని నీటిని ఉద్దరిణితో తీసుకుని బొటన వేలితో 3సార్లు తలపై చల్లుకోవాలి }

👉అనంతరం ఏకాహారతి వెలిగించాలి

{ ఏకాహారతి వెలిగించి దానికి గంధం, పసుపు, కుంకుమ అలంకరించాలి }

★దీపారాధన
{యీ క్రింది మంత్రమును చెప్పుతూ దీపమును ఏకాహారతి తోటి వెలిగించాలి}

శ్లో|| దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః |
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే ||
ఇతి దీపదేవతాభ్యో నమః

{దీపానికి గంధం, పసుపు, కుంకుమ, పువ్వులు అలంకరించాలి. ఒక్క దీపం అయితే 3వత్తులు, రెండు దీపపు కుందులు పెడితే 2వత్తులు వెలిగించాలి}

[ ఓ దీప దైవమా! నీవు బ్రహ్మస్వరూపమై ఉన్నావు. మాకు సకల సౌభాగ్యాలను, సుపుత్రులను ఇచ్చి, మా కోర్కెలన్నింటినీ తీర్చుమా అని అర్ధం ]

(దీపం వెలిగించి గంటను వాయిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను)
ఘంటా నాదము

శ్లో || ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్ |
కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ ||

[అంటే దేవతలు ఉండే చోట రాక్షసులు ఉండరు కదా. ఈ పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో దుష్టశక్తులు ఉండకూడదు కాబట్టి మీరు ఇక్కడనుండి వెళ్ళిపొండి అని గంట కొట్టి దేవతలను లాంఛనంగా ఆహ్వానించడానికి గంటానాదం చేయడం జరుగుతుంది]

★ఆచమనం
👉( స్త్రీలైతే స్వాహా అనరాదు నమః అనాలి)

ఓం కేశవాయస్వాహా — {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం నారాయనాయస్వాహా — {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం మాధవాయస్వాహా — {అని తీర్ధం తీసుకోవాలి}
{ చెయ్యి కడుగుకోవాలి}
ఓం గోవిందాయనమః — {అనుచూ నీళ్ళను క్రిందకు వదలవలెను.}
{తదుపరి నమఃస్కారం చేయుచు యీ మంత్రములను పఠించవలెను}
కేశవనామాలు
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః — ( అని కొంచెం నీళ్ళు పళ్ళెములో విడువవలెను)

👉భూశుద్ధి
{ఆచమానంతరం – భూశుద్ధి కై భూతోచ్చాటన మంత్రము చదువుతూ కొన్ని అక్షతలు వాసన చూసి వెనుకకు వేసుకోవలెను}

శ్లో|| ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతేభూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||

👉ప్రాణాయామం
శ్లో|| ఓం భూ: | ఓం భువః | ఓం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ||
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||
{ అను మంత్రమును చదువుతూ 3సార్లు ప్రాణాయామము చేయవలెను }

🌺సంకల్పం
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ శ్యామల ముద్దిశ్య శ్రీ శ్యామల ప్రీత్యర్ధం
(కులదైవాన్ని తలుచుకుంటూ)
శుభే శోభనే ముహూర్తే
ప్రవర్తమానస్య – అద్యబ్రహ్మణః
(ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు)
ద్వితియ పరార్ధే – శ్వేత వరాహకల్పే
వైవస్వత మన్వంతరే – కలియుగే
ప్రథమపాదే – జంబూద్వీపే
భరతవర్షే – భరతఖండే
(India లో వుంటే “భరతఖండే” అని చదవాలి, U.S లో వుంటే “యూరప్ఖండే” చదవాలి)
మేరోః దక్షిణ దిగ్భాగే
శ్రీశైలస్య_ (ఈశాన్య/వాయువ్య/… ) ప్రదేశే (కృష్ణా / గంగా / గోదావర్యోః) మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) (ఏ నది కి దగ్గర వుంటే ఆ నది సమీపే అని చదవాలి) నదీసమీపే నివాసిత గృహే (సొంత ఇల్లు అయితే “సొంత గృహే”అని చదవాలి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీనామ సంవత్సరే ఉత్తరాయనే / దక్షిణాయనే ఋతవే ( ‘గ్రీష్మ’ – ఎండాకాలం / ‘వర్ష’ – వర్షాకాలం / ‘వసంత’ – చలికాలం) మాసే (తెలుగు నెలలు చైత్రం, వైశాఖం…) పక్షే (శుక్ల పక్షం — చంద్రుడు పెరుగుతుంటే / కృష్ణ పక్షం — చంద్రుడు తరుగుతుంటే) తిధౌ (ఉదయం ఏ తిథి ప్రారంభం అయితే ఆ తిథే చదువుకోవాలి. పాడ్యమి, విదియ… ) _ వాసరే (ఏ వారం అయితే ఆ వారం చదువుకోవాలి. ఆది, సోమ…)
శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే,
ఏవం గుణవిశేషణ విశిష్టాయాం
శుభ తిథౌ శ్రీమాన్ _ గోత్రః (గోత్రం) అహం నామ ధేయస్య (పేరు)
ధర్మ పత్ని _
నామ ధేవతి (పేరు)
సఃకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం,
ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం, అభీష్ట సిద్ధ్యర్ధం, సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం, సత్సంతాన సిద్ధ్యర్ధం, శ్రీ రాజశ్యామలా దేవతా ముద్దిశ్య,
కల్పోక్త విధానేన యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే
{అని చదివి అక్షంతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను}

నిర్విఘ్నేన పూజా పరిసమాప్త్యర్ధం మహా గణాధి పతయే నమః

శ్రీ గురుభ్యో నమః

★కలశారాధన
తదంగ కలశారాధనం కరిష్యే
{మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసు గాని ,చెంబు గాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను. కలశమునకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి, కలశంలో ఒక పువ్వు, కొద్దిగా అక్షంతలు వేసి, కుడి చేతితో కలశంను మూసి పెట్టి, ఈ క్రింది మంత్రాలను చెప్పవలెను}

శ్లో|| కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితోబ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋద్వేదో థ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః ||

గంగేచ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి |
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ||

ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః

కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి)

ఆత్మానాం సంప్రోక్ష్య (మన పైన)

పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యాల పైన చల్లాలి)
🌷

👉సూచన

  • అర్ఘ్యం, పాద్యం, ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు దేవికి చూపించి వేరొక పాత్ర లో వదలవలెను. అరివేణం (పంచ పాత్రకు క్రింద నంచు పళ్ళెము) లో వదలరాదు.
  • మధుపర్కం సమర్పయామి అనగా అమ్మవారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చుచున్నామని అర్ధం. ఈ మధుపర్కంను తల్లి ప్రతిమకు కానీ ఫోటోకి గాని అద్దవలెను. (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్న దాన్ని మధుపర్కం అంటారు)

★ధ్యానము :

మూలమంత్రము ఉపదేశంఉన్న వారు ఆ మంత్రం చెప్పిన ధ్యానము చేయాలి. ఉపదేశం లేని వారు అమ్మవారిని తలుచుకుని పూజ మొదలు పెట్టాలి..

★ఆవాహనము :

  • బ్రహ్మ స్వరూపాం పరమాం సర్వ విద్యా ప్రదాయినీం సుకవీంద్ర స్తుతం దేవీం వాణీ మావాహయామ్యహం|| ఐం హ్రీం క్లీం రాజ శ్యామలాయై నమః ఆవాహయామి।

★ఆసనము :

శ్లో॥ దారుసార వికారం చ హేమాది నిర్మి చ దేవాధారం పుణ్యదం చ మయా తుభ్యం నివేదిత ఐం హ్రీం శ్రీం శ్యామలాయై నమః ఆసనం సమర్పయామి।।

★పాద్యము:

శ్లో॥ తీర్థేదకం చ పాద్యం చ పుణ్యదం ప్రీతిదం మహత్ పూజాంగ భూతం శుద్ధం చ మయా భక్త్యా నివేదితం! ఐం హ్రీం శ్రీం శ్యామలాయై నమః-పాద్యం సమర్పయామి॥

★అర్ఘ్యము :

శ్లో॥ పవిత్రరూప మర్ద్యం చ దూర్వా పుష్పాక్షతాన్వితం పుణ్యదం శంఖతోయాక్తం మయా తుభ్యం నివేదితం| ఐం హ్రీం శ్రీం శ్యామలాయై నమః అర్ఘ్యం సమర్పయామి॥

★ఆచమనము:

॥ శుద్ధం శుద్ధిప్రదం చైవ శుద్ధానాం ప్రీతిదం మహత్ రమ్య మాచమనీయం చ మయా దత్తం ప్రగృహ్యతాం
ఐం హ్రీం శ్రీo శ్యామలాయై నమః ఆచామనీయం సమర్పయామి ॥

★స్నానము:

సుగంధి ధాత్రీ తైలాంచ దేహ సౌందర్యకారణం మయా నివేదితం భక్త్యాస్నానీయం ప్రతిగృహ్యతాం॥ ఐం హ్రీం శ్రీం శ్యామలాయై నమః-స్నానం సమర్పయామి।।

★వస్త్రము:

శ్లో॥ దేహశోభా స్వరూపం చ సభా శోభా వివర్ధనం కార్పాసజం చ కృమిజం వసనం ప్రతిగృహ్యతాం॥ ఐం హ్రీం శ్రీం శ్యామలాయై నమః-వస్త్రం సమర్పయామి।।

★యజ్ఞోపవీతము:

శ్లో॥ విశుద్ధగ్రంథి సంయుక్తం పుణ్యసూత్ర వినిర్మితం పవిత్రం వేదమంత్రేణ యజ్ఞ సూత్రం చ గృహ్యతాం॥ ఐం హ్రీం శ్రీం శ్యామలాయై నమః-యజ్ఞోపవీతం సమర్పయామి।।

★అనులేపనము:

మలయాచల సంభూతం దేహశోభా వివర్ధనం సుగంధ యుక్తం సుఖదం మయా తుభ్యం నివేదిం ఐం హ్రీం శ్రీం శ్యామలాయై నమః – అనులేపనం సమర్పయామి॥

★ఆభరణము:

కాంచనాది వినిర్మాణం శ్రీయుక్తం శ్రీకరం సదా
సుఖదం పుణ్యదం చైవ భూషణం ప్రతిగృహ్యతాం॥
ఐం హ్రీం శ్రీం శ్యామలాయై నమః – ఆభరణం సమర్పయామి।।

★చందనము:

శ్లో॥ సర్వమంగళ రూపశ్చ సర్వమంగళదో వరః
పుణ్య ప్రదశ్చ గంధాధ్యో గంధశ్చ ప్రతిగృహ్యతాం॥ ఐం హ్రీం శ్రీo శ్యామలాయై నమః – చందనం సమర్పయామి॥

★సింధూరము:

శ్లో॥ సింధూరం చ వరం రమ్యం బాలశోభా వివర్ధనం పూరణం భూషణానాం చ సింధూరం ప్రతిగృహ్యతాం॥
ఐం హ్రీం శ్రీం శ్యామలాయైనమః సింధూరం సమర్పయామి॥

★అథాంగ పూజ
మూల మంత్రం ఉపదేశం ఉన్న వారు మూల మంత్రం తో మంత్రం లేని వారు శ్యామలా యై నమః అంటూ ఇక్కడ పూజ చేయాలి

మూల మంత్రం – పాదౌ పూజయామి
మూల మంత్రం– జంఘే పూజయామి (పిక్కలు)
మూల మంత్రం – జానునీ పూజయామి (మోకాళ్ళు)
మూల మంత్రం – ఊరుం పూజయామి (తొడలు)
మూలమంత్రం– గుహ్యం పూజయామి
మూల మంత్రం – కటిం పూజయామి(నడుము
మూల మంత్రం– నాభిం పూజయామి
మూల మంత్రం – ఉదరం పూజయామి
మూల మంత్రం– హృదయం పూజయామి
మూల మంత్రం– హస్తౌ పూజయామి
మూల మంత్రం– భుజౌ పూజయామి
మూల మంత్రం – కంఠం పూజయామి
మూల మంత్రం– ముఖం పూజయామి
మూల మంత్రం– నేత్రాణి పూజయామి
మూల మంత్రం– లలాటం పూజయామి
మూల మంత్రం– శిరః పూజయామి
మూల మంత్రం– మౌళీం పూజయామి
మూల మంత్రం– సర్వాణ్యంగాని పూజయామి

★పుష్పమాలలు:

నానా పుష్ప వినిర్మాణం బహు శోభా సమన్వితం ప్రీతిదం పుణ్యదం చైవ మాల్యం చ ప్రతిగృహ్యతాం! ఐం హ్రీం శ్రీం శ్యామలాయై నమః పుష్పమాలాం సమర్పయామి॥
👉పుష్పాణి పూజయామి (అష్టోత్తర శతనామాదులతో పూజించాలి)..శ్లోకాలు )

★ధూపము:

శ్లో॥ గంధ ద్రవ్యోద్భవం పుణ్యం ప్రీతిదో దివ్యగంధదం మయా నివేదితో భక్త్యా ధూపోయం ప్రతిగృహ్యతాం ఐం హ్రీం శ్రీం శ్యామలాయై నమః ధూపం సమర్పయామి॥

★దీపము:

జగతాం దర్శనీయం చ దర్శనం దీప్తికారణం అంధకార ధ్వంస బీజంమయా తుభ్యం నివేదితం! ఐం హ్రీం శ్రీం శ్యామలాయై నమః దీపం దర్శయామి॥

★నైవేద్యము:

శ్లో॥ తుష్టిదం పుష్టిదం చైవ ప్రీతిదం క్షుద్వినాశనం పుణ్యదం స్వరూపం చ నైవేద్యం ప్రతిగృహ్యతాం॥ ఐం హ్రీం శ్రీం శ్యామలాయై నమః-నైవేద్యం సమర్పయామి॥

★తాంబూలం :

తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం తుష్టిదం పుష్టిందం చైవ తాంబూలం ప్రతిగృహ్యతాం॥
ఐం హ్రీం శ్రీం శ్యామలాయై నమః – తాంబులం సమర్పయామి

★నీరాజనం:

కదళీగర్భ సంభూతం కర్పూరం తు ప్రదీపితం
ఆరార్తిక మహం కుర్వే ప్రసీద జగదీశ్వరి||
ఐం హ్రీం శ్రీం శ్యామలాయై నమః-నీరాజనం దర్శయామి।।

★ప్రదక్షిణ :

యాని కాని చ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే॥
ఐం హ్రీం శ్రీం శ్యామలాయై నమః – ఆత్మప్రదక్షిణం సమర్పయామి॥

★నమస్కారము:

శ్లో॥ వేదాః శాస్త్రాణి సర్వాణి నృత్య గీతాదికం చ యత్
న విహీనం త్వయా దేవి తధా మే సంతు సిద్ధయః॥
లక్ష్మీర్మేధా ధరాపుష్టిః గౌరీతుష్టిః ప్రభామతిః
ఏతాభిః పాహి అష్టాభిః తనుభిః మాం సరస్వతీ
యధా న దేవీ భగవాన్ బ్రహ్మలోకే పితామహ:
త్వా పరిత్యజ్య సంతిష్టేత్ తథా భవ వరప్రదా॥
ఇట్లు శ్యామల ని పూజించి పిదప మూల మంత్రమును జపించాలి. ( మూల మంత్రం ఉపదేశం లేని వారు ఉపదేశం తీసుకోండి, )

శ్రీవిద్య క్రమంలో యంత్ర పూజ నేర్చుకున్న వారు యంత్ర పూజ శ్యామల నవరాత్రులలో ప్రతి రోజు చేయాలి.. యంత్ర పూజ రాణి వారు శ్యామల దండకం , కవచం ఇదివరకు ఇచ్చిన వివిధ స్త్రోత్రలు చదివి పూజ పూర్తి చేయవచ్చు

★క్షమాప్రార్థన

ఆ తరవాత మళ్లీ కూర్చుని, కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. కొంచెం నీటిని అక్షతలు తలపై వేసుకుని ఈ శ్లోకం చెప్పుకోవాలి)

శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి
యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే

అనయా ధ్యానావాహనాది షోడషోపచార పూజయాచ అష్టోత్తర నామార్చనాయచ మహా నివేదనాయచ శ్యామల సర్వాత్మకః సర్వం శ్రీ రాజ శ్యామల దేవతార్పణమస్తు

శ్రీ శ్యామల దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు
ఏతత్ఫలం శ్యామలార్పణమస్తు
(అంటూ అక్షతలనూ నీటినీ పళ్ళెంలో వదలాలి)

శ్లో|| ఉపచారాపదేశేన కృతాన్ అహర్ అహర్మయా |
అపచారానిమాన్ సర్వాన్ క్షమస్వ పరమేశ్వరి ||

ఓం శ్యామలాయై – అపరాధ నమస్కారాన్ సమర్పయామి

శ్రీ శ్యామల మాతంగి ప్రసాదం శిరసా గృహ్ణామి
(పూజాక్షతలు శిరసున ధరించాలి)

★విశేషోపచారములు

ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ యామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజో పచార, భక్త్యోపచార పూజాం సమర్పయామి
(నమస్కరించి అక్షతలు వేయాలి)

★తీర్ధం

శ్లో|| అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణమ్ |
సమస్త పాపక్షయకరం శ్రీ శ్యామల పాదోదకం పావనం శుభమ్ ||

(తీర్ధమును చేతిలో వేసుకొని మూడుమార్లు నోటి లోనికి తీసుకొనవలెను. ప్రసాదం స్వీకరించాలి)

★ఉద్వాసన

ఓం శ్యామలాయై నమః ఉద్వాసయామి యథాస్థానం ప్రవేశయామి
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయచ

(అక్షతలు వేసి నమస్కారం చేయాలి. ప్రతి రోజు ఇంట్లో చేసుకునే నిత్య పూజకు ఉద్వాసన చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడో ఒకసారి వ్రతం లాగా చేసే వారు చెప్పుకోవాలి)

👉ఈ పూజ బుక్స్ లో ఉండదు ప్రింట్ తీసుకోండి సేవ్ చేసుకోండి

🌷శ్రీ రాజ శ్యామల అనుగ్రహ సిద్దిరస్తు 🌷

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *