Uncategorized

మహాలక్ష్మీ అమ్మ పాట

🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రావణ వరలక్ష్మీకి స్వాగతం
🌹🌹🌹🌹🌹🌹🌹
పాట నెం :
పాట : మహాలక్ష్మీ అమ్మ పాట
స్వరకర్త : పొట్టి వెంకట మమత
ఊరు : శ్రీకాళహస్తి
టైపింగ్ : మమత
ఊరు : శ్రీకాళహస్తి
🌹🌹🌹🌹🌹🌹🌹
ఆది మహాలక్ష్మీ-ఆనందదాయిని
అతివలగతివి-అనురాగవతివి
అనుక్షణము నీ-రక్షణవుండిన
క్షణక్షణమూ-మా క్షేమమేయుండును
మోక్షప్రదాయినీ-లక్ష్మీనారాయణీ -2
అందాలవల్లి-అందరితల్లి -2
“ఆది మహాలక్ష్మీ”

సిరులు సంపద-స్థిరముకావని
నీ చరణములే-శరణని నమ్మితి
ఆశ్రితదాయిని-అభయప్రదాయిని
అందాల బొమ్మా-అపరంజికొమ్మా
లాలింపుమమ్మా-పరిపాలింపుమమ్మా -2
అందాలవల్లి-అందరితల్లి -2
“ఆది మహాలక్ష్మీ”

నయనానందము-నీ దివ్యరూపము
నిత్యనూతనము-నీ సౌభాగ్యము
శ్రీహరిదేవేరి-శ్రితజనమందారి
కరుణించుమమ్మా-కాపాడుమ్మా
రంగారు బంగారు-రతనాల రాణి -2
అందాలవల్లి-అందరితల్లి -2

🌹🌹🌹🌹🌹🌹🌹

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *