Remedies

ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా

ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినా, భార్యా భర్తల మధ్య మనశ్శాంతి కరువయినా ఒకేఒక మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి. ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా? అదే కార్తవీర్యార్జున మంత్రం. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. అది డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెపుతున్నారు మన పండితులు. ఆ మంత్రం ఈ విధంగా ఉంటుంది.

ఓం కార్తవీర్యార్జునో నమః రాజ బాహు సహస్రవాన్
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే

ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకుని రోజూ పూజ చేసేటప్పుడు స్మరిస్తే పోయినవన్ని తిరిగి మనకు దక్కుతాయి. ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ. తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించ గలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో అది గ్రహించిన స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు. కాని భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి వెయ్యి చేతులు కలవాడిగా మారతాడు. అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు. అంతేకాదు తనకి కేవలం శ్రీ హరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు. ఇతను ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకుని పోయి తరువాత పులస్త్య మహర్షి అభ్యర్ధన విని అతనిని వదిలేస్తాడు.

ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మాహిష్మతిపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి. ఒకసారి కార్తవీర్యుడు వేట కోసమై అడవికి వెళ్తాడు. అక్కడ అలసిపోయి దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన కార్తవీర్యునికి స్వాగతం పలికి జమదగ్ని విశేషమైన విందు పెడతాడు. అంత రుచికరమైన ఆహారపదార్థాలు కామదేనువు సంతతి అయిన గోమాత ద్వారా లభించాయన్న నిజం తెలుసుకుని దానిని తనకి ఇచ్చేయ్యమని అడుగుతాడు, అందుకు జమదగ్ని నిరాకరించటంతో మహర్షి తలను ఖండించి ఆ గోమాతను తీసుకెళ్ళిపోతాడు. ఆశ్రమానికి తిరిగివచ్చిన జమదగ్ని కొడుకు పరాశరుడు విషయం తెలుసుకుని కార్తవీర్యునితో పాటు 21 మంది క్షత్రియులని చంపుతానని శపథం పూనుతాడు. అన్న మాట ప్రకారమే కార్తవీర్యుడిని సంహరిస్తాడు. పరసురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్లీ శ్రీహరి చేతిలో సుదర్శునుడిగా మారి, గర్వం విడిచిపెట్టి తన జన్మ సార్ధకం చేసుకుంటాడు.

అలా అతి బలపరాక్రముడు అయిన కార్తవీర్యుడు తనకు లేని చేతులని తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్లీ అతని కుడి చేతిలోనే సుదర్శన చక్రమై ఆ జన్మాంతం నిలిచి ఉంటాడు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *