Poojalu

వివాహం కోసం..

వివాహం కోసం..

సరైన సమయంలో వివాహం జరగాలని అందరూ కోరుకుంటారు. కాని కొన్ని అవాంతరాల వల్ల కొందరికి పెళ్లి ఆలస్యం అవుతుంటుంది. అటువంటి వారు తమ వివాహం వెంటనే జరిగిపోవాలని దేవుళ్లను మొక్కుతుండడం చూస్తూనే ఉంటాం.. త్వరగా పెళ్లి కోసం కింద చెప్పిన విధంగా పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంతకూ ఏం చేయాలంటే.



1.వివాహ ఆలస్యానికి సూచించదగిన కాత్యాయని మంత్రం (ఈ మంత్రం ఆడవాళ్లు ,మగవాళ్లు, వారి కోసం ఎవరైనా సంకల్పం చెప్పి కూడా ఈ శ్లోకాన్ని 108 సార్లు రోజూ జపం చేయాలి)

మంత్రం:

“హే గౌరీ శంకర అర్థాంగి యథా త్వాం శంకర ప్రియా !
తథా మమ్ కురు కళ్యాణి కంటకం సుదుర్లభం !!”

2.ఏ మంత్రం పెళ్లి కాని ఆడవాళ్లు రోజు కొద్దిగా పసుపు నీటిలో వేసి స్నానం చేసుకోవాలి దేవిడి దగ్గర దీపం పెట్టి పసుపు కొమ్ములతో 108 సార్లు ఇదే మంత్రం చెప్తూ ఒక్కో కొమ్ము సమర్పించాలి… ఏ అమ్మవారి ఫోటో ఇంట్లో ఉన్న ఆ ఫోటో కి అర్చన ఈ మంత్రం చెప్తూ కొమ్ములతో అర్చన చేయండి
అరటి చెట్టు కానీ ఎక్కడైనా దగ్గరలో ఉంటే అక్కడ దీపం పెట్టండి..
(పెళ్లి అయిన ఆడవాళ్లు ఈ శ్లోకం చదివితే, భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు..)పెళ్లి అయిన వారు అయితే పసుపుకొమ్ములతో చేయవల్సిన పని లేదు 108 సార్లు చదువు కుంటే చాలు

మంత్రం:
“కాళి పస్యస్వ వదనం భర్తుహు: శశిధర ప్రబం సమదృష్టి: భూత్వ కురుశ్వాగ్ని ప్రదక్షిణం”

3.వివాహము ఆలస్యం అవుతున్న మగవాళ్ల కోసం

ఈ పరిహారం… ప్రతి రోజూ నీటిలో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇది ఎన్నో రకాల దోషము దిష్టి తొలగించి శుభాన్ని కలిగిస్తుంది… అలా చేసి సూర్యుడికి నమస్కారం చేసుకుని…దేవిడి దగ్గర కానీ లేదా ఎక్కడ అయినా శుభ్రంగా ఉన్న ప్రదేశంలో కూర్చుని
” ఓం కామేశ్వరాయ నమః”
అని 108 సార్లు జపం చేసుకోవాలి..రోజంతా కూడా ఈ నామాన్ని మనసులో తలచుకోవడం మంచిది, వారి చేత్తో ఎక్కడైనా అవుకి గడ్డి కానీ, బియ్యం గాని, అరటి పండ్లు గాని గురువారం రోజు మీరు సంతోషం గా తినిపించాలి…అవులో ముక్కోటి దేవతలు ఉంటారు వారికి స్వయంగా తినిపించి నట్టు..గురువారం లక్ష్మీ వారం కనుక బృహస్పతి అనుగ్రహం కూడా లభించి మంచి అమ్మాయితో వివాహం జరుగుతుంది..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *