Pandugalu

శ్రీరామనవమి Sri Rama Navami

శ్రీరామనవమి’ హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.

ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.
శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం.. దుష్టశిక్షణ కోసం శ్రీహరి మానవరూపంలో ధరణిపై అవతరించి, ధర్మ సంస్థాపన చేశారు. శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్నాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజును హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకల అంగరంగా వైభవంగా సాగుతాయి. వీధులలో చలువ పందిళ్లు వేసి, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.


అయోధ్యను పాలించే రఘవంశ రాజు దశరథుడికి సంతానం లేకపోవడంతో రాజ గురువు వశిష్ఠ మహర్షి సూచనతో పుత్రకామేష్ఠి యాగం నిర్వహించారు. యాగానికి ప్రశన్నమైన దేవతలు ఓ పాయసపాత్రను దశరథునికి ప్రసాదించారు. పాత్రలోని పాయసాన్ని మూడు భాగాలు చేసిన దశరథుడు తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు అందజేశాడు. ఓ శుభముహూర్తాన ముగ్గురు రాణులూ గర్బం దాల్చగా ఛైత్ర శుద్ధ నవమినాడు శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నలకు వారు జన్మనిచ్చారు. పుత్ర కామేష్టియాగ ఫలితంగా పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం. శ్రీరామ జనన సమయానికి రావణుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు.

పద్నాలుగేళ్ల అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకే చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి ఏటా చైత్ర శుద్ధ నవమిని శ్రీరామ నవమిగా వేడుకలు, శ్రీసీతారామ కళ్యాణం జరుపుతారు.


పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య ప్రేమ కోసం పరతపించిపోయిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా ఇలా సకల గుణాభి రాముడిలో 16 ఉత్తమ లక్షణాలున్నాయి. క్రమశిక్షణ కలిగనవాడు..వీరుడు, సాహసికుడు.. వేద వేదాంతాలను తెలిసివాడు. చేసిన మేలును మరవనివాడు. సత్యవాక్కు పరిపాలకుడు, గుణవంతుడు, స్వయం నిర్ణయాలు తీసుకునే విజ్ఞాన వంతుడు. సర్వ జీవుల పట్ల దయకలిగినవాడు.. శకల శాస్త్రాల్లోనూ పండితుడు. సమస్త కార్యాలలోను సమర్ధుడు.. సులక్షణమైన రూపసి (అందగాడు), అత్యంత ధైరశాలి, క్రోధాన్ని జయించివాడు, సమస్తలోకల్లోనూ తెలివైనవాడు, ఈర్ష్య అసూయ లేని వాడు, దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి శ్రీరాముడు.


రామరాజ్యంలో ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభా యాత్ర. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు.
రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖలలో దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముణ్ని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *