ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చెయ్యాలి. వీణవాయిస్తున్న హనుమంతుని చిత్రమైతే మంచిది.

 ఈ పరిహారాల్లో దేన్నైనా… ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేయాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చు.

1. అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు అవనూనెతో దీపారాధన – ఆరోగ్యం

2. ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం – ఈ ఐదింటిని పిండి చేసి, దీపప్రమిదగా చేసి, అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

3. వివాహం కావడానికి బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

4. శని వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

5. కోరికలు నెరవేరేందుకు బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్ళలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి.

6. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి.

7. దృష్టి దోషాలు పోయి, శత్రువుల మీద విజయం సాధించడానికి పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి.

8. వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి, దాంతో దీపారాధన చేయాలి.

తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుంటే….!! తరచూ గృహంలో స్పర్థలు వస్తుంటే, సమస్యలు ఉత్పన్నం అవుతుంటే, రామభజన చేస్తున్న ఆంజనేయస్వామి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచి, యథాశక్తి శ్రీరామనామ జపం చేయాలి.

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *