tula rasitula rasi

ఉగాది పంచాంగం శ్రీ శార్వరి నామ సంవత్సర 2020 తులా రాశి : చిత్త 3,4 పాదాలు, స్వాతి నాలుగుపాదాలు, విశాఖ 1,2,3 పాదాల వారు ఈరాశి కిందికి వస్తారు.

ఆదాయం:14, వ్యయం-11
రాజపూజ్యం:7, అవమానం-7

ఈరాశివారికి సాహసోపేతమైన, నేర్చుకోవటం, ప్రయాణమును సూచిస్తుంది. ఆరోగ్యము పట్ల శ్రద్ద అవసరము మరియు ప్రయాణములకు ప్రణాళిక అవసరము. కావున, రెండిటిని సరిచూసుకోండి. 2020ప్రారంభములో శని, 3వ ఇంట సంచరిస్తాడు. కానీ 24 జనవరి తరువాత 4వ ఇంట సంచరిస్తాడు. గురుడు కూడా, 3వ ఇంట సంచరిస్తాడు. మార్చి 30 తరువాత 4వ ఇంట సంచరిస్తాడు. గురుడు తిరిగి జూన్‌ 30వ తారీఖున 3వ ఇంట ప్రవేశిస్తాడు. రాహువు స్థితి 9వ ఇంట తిరుగుతుంది. అంతేకాకుండా మీరు ఈ ఇంటిలో దీనిని ఎటుచుసిన వదిలిపెట్టరు. తరువాత మితముగా ఆహారము తీసుకోవటం చెప్పదగిన సూచన. వాహనము నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు అవసరము. లేనిచో అనారోగ్యానికి గురిఅయ్యే ప్రమాదం ఉన్నది. వివాదాలకు దూరముగా ఉండుట చెప్పదగిన సూచన. మధ్యపానమునకు, మాంసాహారమునకు, పొగాకుకు దూరముగా ఉండుట చెప్పదగిన సూచన. లేనిచో మీరు అనేక అనారోగ్య సమస్యలకు గురిఅవుతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. తద్వారా ప్రయోజనాలను పొందుతారు. సమస్యలు మిమ్ములను తరచుగా ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి. కానీ మీరు వాటిని సులభముగా పరిష్కరిస్తారు. కొన్ని కొత్తసమస్యలు ఏర్పడే అవకాశము ఉన్నది. వాటి నుండి మీరు కొత్తవిషయాలను నేర్చుకుంటారు. స్వేచ్ఛ కావాలని భావిస్తారు. దానికొరకు మీరు మీకొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు. కొన్నిసార్లు అనుభవజ్ఞుల సలహాలు అవసరము మరియు మిములను మీరు తెలుసుకోవటం చాలా మంచిది. ధ్యానము చేయుటవలన మీరు ఆత్మసంతృప్తి కాకుండా మీ సామర్ధ్యాన్ని పెంచుతుంది. తులారాశి వారికి విదేశీప్రయాణాలు చేయాలన్న కోరిక ఈ సంవత్సరంలో నిజమవుతుంది. ఏప్రిల్‌ నెలలో మీ కష్టానికి తగిన ప్రతిఫలము లభిస్తుంది. కొందరు పూర్వీకుల ఆస్తులను పొందుతారు. మీతల్లిగారి ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి మరియు తండ్రిగారికి వయస్సు రీత్యా వారిపట్ల కూడా శ్రద్దవహించాలి.

తులా రాశి వృత్తిజీవితము

తులా రాశి వారు ఈ సంవత్సరము గొప్ప విజయాలను అందుకుంటారు. శని 4వ ఇంట సంచరిస్తాడు, 6వఇంటిని,10వ ఇంటిని ప్రభావితము చేస్తాడు. మీరు మీ ఆశయాలను నెరవేర్చుకోడానికి మరింతగా కష్టపడ వలసి ఉంటుంది. ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలల్లో గురుడు 4వ ఇంట సంచరిస్తాడు. తద్వారా మీరు నిర్ణయాలను తీసుకొనుటలో మరింత తెలివిగా వ్యవహరిస్తారు, తద్వారా గౌరవమర్యాదలు పొందుతారు. డిసెంబర్‌ నెలలో,మీరు ప్రమోషన్లు పొందగలరు. మీరు ఒకవేళ ఉద్యోగ మార్పు, స్థానచలనం, కోరుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ మరియు నవంబర్‌ నెలలో మీరువాటిని పొందుతారు. మీ వృత్తిపరమైన జీవితములో ఉన్నత స్థితికి చేరుకుంటారు. శని మీరు కష్టపడి పనిచేసినా ఫలితాలను ఆలస్యము చేస్తాడు. మంచి పనుల మీద చికాకు తెచ్చుకోకుండా ఎల్లపుడు మంచి పనులను చేస్తూనే ఉండండి. పరీక్షలు, సమస్యలు మిమ్ములను మరింతగా దృఢపరుస్తాయి. అదృష్టము తప్పక కలసివస్తుంది. ఈ సంవత్సరము కొత్తవ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండుట చెప్పదగిన సూచన. విజయాలను సాధించటానికి కష్టపడవలసి ఉంటుంది.మీరు కొత్తపనులను నిలిపుదల చేయటము సాధ్యముకాకపోతే, అనుభవము ఉన్నవారిని సంప్రదించి ఏ నిర్ణయము ఐన తీసుకొండి. ఎప్పటి నుండో వ్యాపారాలు చేస్తున్నవారు ఆందోళన చెందవలసిన అవసరంలేదు. మీ వ్యాపారము వృద్ధిచెందుతుంది. ఉద్యోగము లేదా వ్యాపారము, కృషి ఉంటేనే విజయాలను పొందగలరు. ఆందోళనలు దరి చేరనీయకండి. సంవత్సరము మధ్యలో స్థానచలనము లేదా నూతన ఉద్యోగము సంభవించే సూచనలు ఉన్నవి. ఎవరైతే మిల్లు, పరిశ్రమ, బొగ్గుగనులు, ఖనిజ నిక్షేపాల్లో, అధ్యయన, సీఏ, లాయర్‌ వృత్తుల్లో ఉంటారో వారు వృద్ధిలోకి వస్తారు.

తులా రాశి ఆర్ధికం

ఆర్ధికపరమైన విషయానికివస్తే తులా రాశి ఫలాలు 2020 ప్రకారము, మీ ఆర్జికపరిస్థితి మీ వ్యక్తిగత జీవితాన్నే కాకుండా మీ వృత్తిపరమైన జీవితాన్ని కూడా ప్రభావితము చేస్తుంది. మీరు తక్కువ పొందుతున్నట్టు అయితే, మీ పనిపట్ల ఆనందముగా ఉండరు. ఇది ఫలితాలపై ప్రభావాన్ని చూపెడుతుంది. తద్వారా కుటుంబములో ఆర్ధిక పరిస్థితి బాగుండదు. ధనానికి కొనలేదు. కానీ, కొన్ని సౌకర్యవంతమైన వస్తువులు కొనుట ద్వారా కొంత ఉపశమనం పొందుతారు. జనవరి నుండి ఏప్రిల్‌ వరకు మరియు జులై నుండి నవంబర్‌ వరకు మీ ఆర్ధికపరిస్థితి మరింత అనుకూలముగా ఉంటుంది. మీరు పెద్దమొత్తములో ధనాన్ని సంపాదించి దానిని పొదుపుచేస్తారు. ఒకటి కన్నా ఎక్కువ మార్గాల ద్వారా మీకు రాబడి లభిస్తుంది. ఇతరనెలలు మాత్రము కొంతపరీక్షాకాలంగా చెప్పవచ్చు. లావాదేవీల విషయములో ఆచితూచి వ్యవహరించుట మంచిది. పాత అప్పులను తీర్చివేసే అవకాశములు అధికముగా ఉన్నవి. రాబడికి మాత్రము ఎటువంటి అడ్డంకి ఉండదు. ఇంటిలో శుభప్రదమైన కార్యక్రమాన్ని చేపడతారు. ఏప్రిల్‌ నుండి జూలై మధ్యలో మీరు స్థిరాస్తిని, ఇంటిని లేదా వాహనమును కొనుగోలు చేస్తారు. మీరు ఈసమయములో మీయొక్క ఆర్ధికస్థితిపట్ల జాగురూపకతతో వ్యవహరిస్తారు. మీ రాబడికి మరియు ఖర్చుల మధ్య చిన్న తేడాలు గమనిస్తారు. దీనిని సరిచేయడానికి, ప్రారంభము నుండి జాగ్రతగా వ్యవహరించండి. 2వ అర్ధభాగములో దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు కలిసివస్తాయి.అదృష్టము మీకుతోడుగా ఉంటుంది మరియు ఈయొక్క పెట్టుబడి మీకు లాభాలను తెచ్చిపెడుతుంది.

తులా రాశి విద్య

అదృష్టం లేదంటే దురదృష్టము వెంటాడుతూ ఉంటుంది. బద్దకం విజయానికి శత్రువులాంటిది. మీ శక్తిని కొత్త విషయాలు నేర్చుకొనుటలో ఉపయోగించండి. మీ ఆశయాలపై దృష్టిపెట్టండి. మీరు సృష్టించుకున్న సమస్యల నుండి మిమ్ములను ఏవి కాపాడలేవు. ఆశయాలపై దృష్టి పెట్టండి. కష్టము తరువాత విజయము రుచిని చవిచూస్తారు. జూన్‌ 30 నుండి 20వ సెప్టెంబర్‌ వరకు మీరు విదేశీ సంస్థల్లో మీ ఉన్నత చదువుల కోసము మీరు అడ్మిషన్లను పొందుతారు. చదువులో మీరు 100% మీరు మంచిగా ప్రయత్నించాలి. లేనిచో ఫలితాలు మీకు అనుకూలముగా ఉండవు.

కుటుంబం

తలారాశి ఫలాలు ప్రకారము, ఈసంవత్సరము కుటుంబ జీవితము మృదువుగా సాగుతుంది. మీరు ఒకవేళ మ్కీ పని నిమ్మితము కుటుంబానికి దూరముగా ఉన్నట్టయితే, తిరిగి ఇంటికి చేరుకునే అవకాశములు ఎక్కువగా ఉన్నవి. మీ ప్రియమైనవారితో మీరు అధికసమయాన్ని గడుపుతారు.ఒకవేళ మీరు మీకుటుంబముతో మీరు కలిసి ఉంటున్నట్టు అయితే, కుటుంబానికి దూరముగా వెళ్ళవలసి ఉంటుంది. కుటుంబములోని మీ తోబుట్టువులతో మీ సంబంధాలు అంతగా బాగుండవు . ఇతరులతో మీ ఆలోచనలు వేరేవిధముగా ఉంటాయి. కానీ, ఏప్రిల్‌ నుండి జూలై వరకు, కుటుంబ జీవితము అనుకూలముగా ఉంటుంది. మార్చి తరువాత, మీ గౌరవమర్యాదలు వృద్ధిచెందుతాయి. కుటుంబ వాతావరణము కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. పనులు మీకు అనుకూలముగా మారటానికి మీ ప్రయత్నాల్లో నిర్లక్ష్యము ప్రదర్శించవద్దు. సాధారణ వ్యక్తిత్వము వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశము ఉన్నది. సంబంధాలకు మరియు వృత్తికి సరైన సమయాన్నీ కేటాయించండి. వాటి నుండి పారిపోకండి. ధనము మరియు న్యాయ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చును. మీరు దీనికి ఆందోళన చెందవలసిన అవసరంలేదు. సహనంతో ఉండి సరైన నిర్ణయాలు తీసుకొనుట ద్వారా మీరు ఈ సమస్యల నుండి బయటపడవచ్చును.

వివాహము- సంతానము

2020 ప్రారంభ నెలల్లో భాగస్వామి ఆరోగ్యము క్షీణించటం, నిలకడగా ఆలోచించ లేకపోవటం, కొన్ని బాధాకర పరిస్థితులు ఏర్పడతాయి. కానీ, ఫిబ్రవరి తరువాత పరిస్థితులు అనుకూలముగా మారతాయి. ఒకవేళ మీ భాగస్వామి ఉద్యోగము చేస్తున్నట్టు అయితే వారిని విజయాలు వరిస్తాయి. వారి ఎదుగుదల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలకు కారణము కాకూడదు. వారికి ఆశయాలు ఉంటాయి అని అర్ధంచేసుకోండి. ఒక అవకాశము మీ తలుపు తట్టినప్పుడు, వెనుతిరగటము మంచి ఆలోచనలు కావు. జూన్‌ 30 నుండి 20 నవంబర్‌ వరకు, మీ వైవాహిక జీవితములో కొన్నిసమస్యలు తలెత్తుతాయి. ఈ సమయమును జాగ్రత్తగా గడపటం చెప్పదగిన సూచన.

ఆరోగ్యము

2020 ప్రకారము ముఖ్యముగా మొదటి అర్ధభాగములో వీరు అనారోగ్యానికి మరియు నీరసానికి గురి అవుతారు.సాధారణముగా మీ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాధులను ఎదురుకుంటుంది. కాబట్టి మీకు అంతపెద్ద సమస్యలు ఎదురుకావు.అయినప్పటికీ , మీరు మీ ఆరోగ్యముపై అశ్రద్దను చూపించకూడదు. గ్యాస్ట్రిక్‌ సమస్యలు, అజీర్తి, కీళ్ల నొప్పులు,తలనొప్పి, ఆట్లమ్మ, దద్దుర్లు మొదలగునవి సంభవిస్తాయి. చిన్నచిన్న సమస్యలను నిర్లక్ష్యము చేయకంది . లేనిచో అవే పెద్ద సమస్యలుగా మారతాయి. సమయానికి డాక్టరును సంప్రదించుట మరియు అవసరమైన మందులు వాడుట చెప్పదగిన సూచన. 2020 రెండొవ అర్ధ భాగములో మీ ఆరోగ్యము నిలకడగా ఉంటుంది .

పరిహారాలు

– పేదవారికి సహాయము చేయండి.
– ప్రతిశనివారము, శనిదేవుడిగుడికివెళ్ళి సెనగలు దానముచేయండి,
– మీ సహుద్యోగులతో మంచిగా ప్రవర్తించండి.
– చీమలకు ఆహారాన్నిపెట్టండి.
– రుద్రాక్షమాల ధారణ, జపం, ధ్యానం, యోగా తద్వారా శాశ్వత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనము పొందండి. శ్వాసనాల రుగ్మతల నుండి మీకు ఉపసమానమును కలిగిస్తుంది.

నోట్‌- ఈఫలితాలు చంద్రుని సంచారము ఆధారముగా గణించబడినది.

Services
   AuspiciousMuhurthas                                                                               

  KundaliMatching                                                                                       

Horoscope Reading


By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *