పిలిస్తే పలికే దైవం శివుడు. భోలాశంకరుడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారట. అదీ అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివునికి అభిషేకం చేయించడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును.
శివరాత్రి రోజున శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు – పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు – ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగ గలవు.
ఓం నమః శివాయ