కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఆదాయం: 11 వ్యయం: 8 రాజ్యపూజ్యం : 5 అవమానం: 4
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆలోచనలు ఫలిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ప్రత్యర్థుల కదలికలపై దృష్టి పెట్టండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆస్తి వివాదాలు జఠిలమవుతాయి. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. సంతానానికి నిదానం ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులుంటాయి. పెట్టుబడులకు అనుకూలించవు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. జూదాలు, బెట్టింగ్‌లకు దూరంగా వుండాలి. పునర్వసు నక్షత్రం వారు కనకపుష్యరాగం, పుష్యమి నక్షత్రం వారు పుష్యనీలం, ఆశ్లేష నక్షత్రం వారు గరుడ పచ్చ ధరించిన శుభం కలుగుతుంది. ఈ రాశివారు ఈశ్వరుని ఆరాధించడం వల్ల, నారాయణ స్తోత్రం చదవడం వల్ల సమస్యలు తొలగిపోయి శుభం కలుగుతుంది.
Services
Auspicious Muhurthas Kundali Matching
Horoscope Reading