kanya rasikanya rasi

ఉగాది పంచాంగం శ్రీ శార్వరి నామ సంవత్సర 2020 కన్యా రాశి : ఉత్తర 2,3,4 పాదాలు, హస్తా నాలుగుపాదాలు, చిత్త 1,2 పాదాలవారు ఈరాశి కిందికి వస్తారు.

ఆదాయం:2, వ్యయం-11
రాజపూజ్యం:4, అవమానం-7

కన్యా రాశి వారికి ఈసంవత్సరములో మీ జీవితములో అనేక మార్పులను చూస్తారు. దీనికి కారణము ముఖ్య గ్రహాలు ప్రభావము. జనవరి 24న శని మీ 5వ ఇంట ప్రవేశిస్తాడు. గురుడు మార్చి 30వ తారీఖున అదే ఇంటిలోకి ప్రవేశిస్తాడు తరువాత జూన్‌ 30న తిరిగి 4వ ఇంట ప్రవేశిస్తాడు. నవంబర్‌ 20 వరకు అదే ఇంట సంచరిస్తాడు. 5వ ఇంట ప్రవేశించినప్పుడు, రాహువు సెప్టెంబర్‌ మధ్యవరకు 10వ ఇంట తరువాత 9వ ఇంట సంచరిస్తారు. ఈసంవత్సరము విదేశీ ప్రయాణములు చేసే అవకాశము ఎక్కువగా ఉన్నది. చదువు మరియు ఉద్యోగానికి మీరు ప్రయత్నిస్తున్నట్టు అయితే, మీకు ఈసంవత్సరము విదేశాలు వెళ్ళడానికి అవకాశములు పుష్కలముగా ఉన్నవి. మీరు ఉగ్యోగములో బదిలీ కోసము ఎదురుచూస్తుంటే ఈసమయము అనుకూలముగా ఉంటుంది. ఒకేవేళ ఇంటికి దూరముగా పనిచేస్తున్నట్లయితే మీ ఇంటికి దగ్గరలోకి మారతారు. వ్యాపార రంగములో ఉన్నవారు మీ వ్యాపారాభివృద్ధికి అనేక ప్రదేశములు తిరగవలసి ఉంటుంది. ఎవరైతే సృజనాత్మకతవైపు పనిచేస్తున్నారో వారికి ఈసంవత్సరము గ్రహాలు అనుకూలిస్తాయి. జీవితములో చిన్నచిన్న సమస్యలు సాధారణము. ఈ సంవత్సరము కూడా మీరు కొన్ని పరీక్షలను ఎదురుకొనవలసి ఉంటుంది. మీరు మంచి శక్తిమంతులు, దృఢమైనవారు, ధైర్యము కలవారు. కానీ అతిగా వ్యవహరించకండి. సహనము చాలా అవసరము. మీ పనులను మీరు తేలికగా పూర్తిచేస్తారు. మీ జీవితభాగస్వామి దానికి అవసరమైన సలహాలు అందిస్తారు.ఈసంవత్సరం చాలా పనులను పూర్తిచేస్తారు. మీ రుణాలను కట్టివేస్తారు. తద్వారా మనశాంతిని పొందుతారు. మీ తోబుట్టువులతో మీ సంబంధాలు బాగుంటాయి. వారు మ్కీ నిర్ణయాలను మరియు మిమ్ములను నమ్ముతారు. మీ సంబంధాల్లో దెబ్బతినే ఎటువంటి వివాదాల్లోనూ తలదూర్చకండి. మీస్నేహితులు మీ చుట్టూ ఒక సహృదయకర వాతావరణాన్ని ఏర్పరుస్తారు. మీరు సరైన మార్గమువైపు నడిచేటట్టు మిమ్ములను ప్రోత్సహాహిస్తారు.

కన్యా రాశి వృత్తి

కన్యా రాశి ఫలాలు 2020 ప్రకారము వృద్ధి, విజయం,అవకాశములు మనము తెలివితేటల ద్వారా మరియు కష్టం ద్వారా సంపాదించుకోవాలి. 2020లో మీ వృత్తిపరమైన జీవితములో ఎదుగుదలను చూస్తారు. మీరు మీ స్థానాన్ని లేదా పనిచేసే చోటుని మార్చుకునే అవకాశములు ఉన్నది. ఉద్యోగాల్లో స్థానచలనము లేదా వ్యాపారాల్లో ప్రయాణాలు తప్పానిసరిగా ఉంటాయి. ప్రారంభ సమయము మీకు అనుకూలముగా ఉంటుంది. మీ ఉన్నతాధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. నూటికి నూరుశాతము మీ పనికి మీరు న్యాయము చేస్తారు. మీరు ఒకవేళ బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్నవారు అయితే మీయొక్క పనిని గుర్తిస్తారు. మీ ఎదుగుదల గణనీయముగా ఉంటుంది. వృత్తిపరమైన జీవితములో మీరు ఈసంవత్సరము నెమ్మదిగా మరియు నిలకడగా ఎదుగుతారు.ఈ సంవత్సరము మీకు చాలా అద్భుతముగా ఉంటుంది.

కన్యా రాశి ఆర్ధికం

మీ రాబడి నిలకడగా ఉంటుంది. తద్వారా మీ ఆర్ధికస్థితి ఈ సంవత్సరము దృఢముగా ఉంటుంది. మీ ధనము ఎందులోనైనా ఇరుక్కుపోతే, అది బయటకు వస్తుంది. మీరు కొత్త ఇంటిని లేదా వాహనమును కొనుగోలు చేస్తారు. వ్యాపారములో పెట్టుబడులు పెట్టడము కలసివస్తాయి. వీటితోపాటుగా మీకు ఊహించని దారుల్లో రాబడిని పొందుతారు. ఏప్రిల్‌ నుండి జూలై వరకు షేర్‌ మార్కెట్‌, గ్యాంబ్లింగ్‌, లాటరి ద్వారా లాభాన్ని ఆర్జిస్తారు. ఇవి ఆమోదయోగ్యమైనవి కావు. ఆర్థిక పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు కలసి వస్తాయి. విజయావకాశములను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టండి. మీ కార్యాలయ ప్రతినిధుల నుండి మీరు మన్ననలు పొందుతారు. దేవుని దయ వల్ల మీరు ఆర్ధికంగా దృఢముగా ఉంటారు. మీ రాబడిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఖర్చులపై నియంత్రణ అవసరము, పరిస్థితులను పూర్తిగా అర్ధంచేసుకున్నాకే లావాదేవీలు జరపండి.

విద్య

ఈరాశి విద్యార్థులు అన్నింటా విజయాలను అందుకుంటారు. స్వతంత్రముగా ఎదుగుతారు. ఎవరైతే చదువులను పూర్తిచేస్తారో వారికి ఉద్యోగ అవకాశము లభిస్తుంది. సెప్టెంబర్‌ నెలలో, ఉన్నత చదువుల కోసము విదేశాలకు వెళ్లే అవకాశము లభిస్తుంది. మీ పనితీరు అద్భుతముగా ఉంటుంది. మీరు కష్టపడి పని చేయుట వల్ల మీ సమస్యల నుండి సులభముగా బయటపడతారు. ఏప్రిల్‌ నుండి జూలై వరకు కొంతమంది మీ భవిష్యత్తు కొరకు సహకరిస్తారు. నేర్చుకోవటంలో ఎల్లపుడు మీరు ఆసక్తిని కనపరుస్తారు. మీరు మీ ఆశయాలను నెరవేర్చుకుంటారు. ఎవరైతే పోటీపరీక్షలకి చదువుతున్నారో వారు విజయాలను అందుకునే అవకాశము ఉన్నది. మీ కఠోరశ్రమ మరియు అంకిత భావము మీ విజయానికి ముఖ్యకారణం అవుతాయి. కుటుంబ జీవితము అనుకూలముగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు దృఢముగా ఉంటాయి మరియు వారి నుండి గౌరవ మర్యాదలను అందుకుంటారు. 2020 ప్రారంభములో ఆనందముగా గడపటానికి అడుగులువేస్తారు. మీరు మీ ప్రతిబాధ్యతను చిరునవ్వుతో స్వీకరిస్తారు. ప్రశాంత మరియు ఆనందకర వాతావరణము చోటుచేసుకుంటుంది. చాలాకాలము నుండి మిమ్ములను ఇబ్బంది పెడుతున్న సమస్య ఈసంవత్సరములో తీరిపోతుంది. కుటుంబసభ్యులకు తగిన సమయము కేటాయించుటద్వారా వారికి ప్రాముఖ్యతను ఇవ్వండి. వారిని అర్ధంచేసుకోండి మరియు వారి పరిస్థితులను తెలుసుకోండి. మీరు మీకుటుంబానికి కాపలాదారునిగా మరియు సలహాదారునిగా వ్యవహరిస్తారు. మీరు కనుక ఒత్తిడికి లోనవుతే కుటుంబములోని అందరూ కూడా ఒత్తిడికి లోనవుతారు. వారితో తెలివిగా వ్యవహరించండి. కుటుంబ జీవితములో మరియు వ్యక్తిగత జీవితములో ఇతరుల జోక్యం లేకుండా చూసుకోండి.

వివాహము- సంతానము

ఈ సంవత్సరం వైవాహిక జీవితము వారు సుఖముగా మరియు ఆనందముగా జీవిస్తారు. మీ భాగస్వామి సంపాదిస్తున్నవారు అయితే, వారు అనుకున్నది సాధించి, తద్వారా ఆర్ధికలాభాలను అందుకుంటారు. మే నుండి సెప్టెంబర్లో స్దానచలనానికి అవకాశము ఉన్నది. ఫలితముగా కొంతకాలము విడిగా ఉండవలసి ఉంటుంది. కొన్నిసార్లు దూరముగా ఉండటం బంధాలను మరింత దృఢపరుస్థాయి. మీ విషయములో కూడా అది నిజమవుతుంది. మే15 నుండి సెప్టెంబర్‌15 వరకు ఇద్దరికీ కొన్ని ఆందోళనలు తలెత్తుతాయి. ఒకరినొకరు సహకరించుకొని ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించుకోండి. తరువాత డిసెంబర్‌ 15వరకు పరిస్థితులు మీ నియంత్రణలోనే ఉంటాయి. 2020లోని చివరి 15రోజులు కొన్నిమార్పులను తీసుకువస్తుంది. కానీ మీ వైవాహికజీవితము మాత్రము అందముగా ఉంటుంది. మీ సంతానము అతిసాధారణముగా వ్యవహరిస్తారు. తరువాత, రోజులు గడుస్తున్నకొద్దీ అంటే ఏప్రిల్‌ నుండి వారి చదువుల్లో పనితీరు మెరుగుపడుతుంది. వీరి స్వభావము కూడా మారుతుంది. మీసంతానము ఆరోగ్యవిషయములో మే నుండి సెప్టెంబర్‌ వరకు జాగ్రత్త వహించండి. చాలాకాలము నుండి పిల్లల కొరకు ప్రయత్నిస్తుంటే ఈసంవత్సరము మీ కోరిక నెరవేరే సూచనలు ఉన్నవి. వివాహము కానీ వారికి వివాహము అయ్యే సూచనలు ఉన్నవి.

ఆరోగ్యము

ఆరోగ్యమే మహాభాగ్యము అనేది ఎంత నిజమో తెలుస్తుంది. ఆరోగ్యముగా ఉంటేనే మీరు మీ జీవితాన్ని ఆనందముగా గడపగలరు. కన్యారాశివారికి ఆరోగ్యపరముగా ఈ2020వ సంవత్సరము అత్యంత అనుకూలముగా ఉంటుంది. మీరు చురుకైన వారీగా వ్యవహరిస్తారు. మీరు ఏ పని చేసిన మీకొరకు చేసుకుంటారు. ఫలితముగా మీ వ్యక్తిగతజీవితము మరియు వృత్తిపరమైన జీవితము ఆనందముగా ప్రకాశిస్తుంది. మీ జీవనవిధానము అన్నివిధాల బాగుంటుంది. ఇది మీ జీవితంలో ఇతర విషయాలపై ప్రభావాన్ని చూపెడుతుంది. అతిగా పనిచేయవద్దు. తరచుగా విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. నిర్లక్ష్యము మంచిదికాదు.ముఖ్యముగా ఆరోగ్యవిషయములో అసలు మంచిదికాదు. మీ నాడీమండల వ్యవస్థ లేదా జీర్ణాశయ వ్యవస్థ కొన్ని సమస్యలను ఎదురుకుంటారు. కావున, జాగ్రత్త అవసరము. వ్యాయామము చేసుకుని ఎల్లపుడు దృఢముగా ఉండండి.

పరిహారాలు

మీరు నీలసహిత శని స్తోత్రమును ప్రతీ నిత్యము పఠించాలి.
విష్ణుసహస్రనామాన్ని కూడా పఠించవలసి ఉంటుంది.
ఆవుకు ఆకుకూరలను ఆహారముగా ఇవ్వండి మరియు ఆవు వెనుకభాగములో 3సార్లు నీమరండి.
బుధుడి స్తోత్ర పఠనం చేయండి. అజీర్తి,రక్తపోటు, కడుపులోపుండ్లు,మొదలగునవి తగ్గీస్తుంది మరియు శరీరదృఢత్వాన్ని పెంచుతుంది.

Services
   AuspiciousMuhurthas                                                                               

  KundaliMatching                                                                                       

Horoscope Reading

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *