ఐశ్వర్య దీపంఐశ్వర్య దీపం

ఐశ్వర్యా దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం.. ఇది ఎందుకు పెడతారు ఎలా పెడతారో తెలుసుకుందాము..
సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుంటుంది, అప్పులు తీరకుండా వడ్డీ పెరిగి పోతూ ఉంటుంది, వ్యాపారం లో లాభాలు లేకుండా ఇబంధులు ఉన్నవారికి, అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి, బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దిష్టివళ్ళ సరిగ్గా జరగకుండా ఉన్నవారికి, కోత్తగా ఎదైనా వ్యాపారం మొదలు పెట్టిన వారికి అభివృద్ధి కి, అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం ” ఉప్పు దీపం ” మంచిపరిహారం…
ఎలా పెట్టాలి :-
ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకొని పసుపుకుంకుమా రాసి నెలపైన బియ్యం పిండి పసుపు కుంకుమ తో ముగ్గు వేసి దానిపైన ప్రమిధలు ఒకదాని పైన ఒకటి ఒక్కటిగా పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు పైనపసుపు కుంకుమ చల్లాలి ఒక చిన్న ప్రమిధలు ఒకదాని పైన ఒకటి పెట్టి పసుపుకుంకుమా పూలు పెట్టి ప్రమిధలో నూనె కానీ నైయి కానీ పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి..దీపం శ్లోకం చదువుకోవాలి…
పళ్ళు కానీ, పాలు పటికబెల్లం, కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి , లక్ష్మీ, వేంకటేశ్వరస్వామి స్త్రోత్రం చదువుకోవాలి…
కనకధార స్త్రోత్రం కూడా చదివితే మంచిది…
శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిధలు లో ని ఉప్పు మటుకు తీసి నీటిలో కలిపి ఇంటి బయట తొక్కని జాగాలో పోయాలి అవకాశం ఉన్నవాళ్లు నదిలో కలపవచ్చు, ప్రమిధలు మార్చాల్సిన పని లేదు ప్రతి వారం అవి వాడుకోవచ్చు ,ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి…అలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారం కానీ 21 కానీ 41 శుక్రవారాలు కానీ అనుకోని ఇంట్లో చేయాలి ఈ ఉప్పు దీపం ఈశాన్యం మూల పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది..41 శుక్రవారం ఈ ఉప్పు దీపం పెట్టే వారికి శాశ్వతంగా ధనము యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి.. కొందరు ఇది రాక్ సాల్ట్ పైన పెడతారు కానీ రాళ్ళ ఉప్పు పైన పెట్టడమే సంప్రదాయం…(ఈ తీసేసిన ఉప్పుని ఇంటి బయట ఉన్న షిన్క్ లో కూడా నీటిలో కలిపి పోయవచ్చు సౌకర్యం లేని వారికి).. ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు.

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *