విద్యుత్ ను గురించి.. అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలు ఇప్పుడు లభిస్తున్నాయి. వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి.
“సంస్థాప్య మృణ్మయే పాత్రే తామ్రపత్రం సుసంస్మృతమ్I
ఛాదయే ఛ్ఛిఖిగ్రీవేన చార్థ్రాభిః కాష్ఠపాంసుభిఃII
దస్తాలోప్టో నిథాతవ్యః పారదాఛ్ఛాది దస్తతఃI
సంయోగా జ్ఞాయతే తేజో మిత్రావరుణ సజ్ఞ్గితమ్II”
దీని భావం – ఒక మట్టి కుండను తీసుకుని దానిలో రాగి పలక పెట్టాలి. తరువాత దానిలో మైలు తుత్తం వేయాలి. తర్వాత మద్యలో తడిసిన ఱంపపు పొట్టువేయాలి. పైన పాదరసము మరియు యశదము (జింక్) వేయాలి తర్వాత తీగలను కలపాలి అప్పుడు దాని నుండి మిత్రావరుణ శక్తి ఉద్భవిస్తుంది.
మరో శ్లోకం చూడండి
“అనేన జలభంగోస్తి ప్రాణోదానేషు వాయుషుI
ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతఃII
వాయు బంధక వస్త్రేణ నిబద్దో యానమస్తకేI
ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్II”
దీని భావం – ఒక వంద కుండల యెక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే, నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు, ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
- తడిత్ – పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
- సౌదామిని – రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
- విద్యుత్ – మేఘముల ద్వారా పుట్టునది.
- శతకుంభి – వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
- హృదని – స్టోర్ చేయబడిన విద్యుత్తు.
- అశని – కర్రల రాపిడి నుండి పుట్టునది.
ఇంత వివరంగా ఇచ్చిన సమాచారం ఉంటే కొందరు ఆంగ్లమానస పుత్రులు అన్నీ మన శాస్త్రాలలో ఉన్నాయిష అని వ్యంగ్యంగా అంటూఉంటారు. వీరి కళ్ళకున్న ఇంగ్లీషు కళ్ళజోడు, ఎర్ర కళ్ళద్దాలు తొలిగిస్తే కనబడతాయి. ఆంగ్లేయులు వ్రాసిన చరిత్ర చదువుతారు.
భారత దేశం మీద ప్రేమ ఎక్కువ ఉంటే అంటూ సలహాఇస్తారు. సంస్కృతం రాదు. చదవడానికి, వెదకడానికి వీరికి సమయం దొరకదు, ఎవరో చేప్పిన ఎంగిలి మాటలు నాలుగు పట్టుకుని మనని, మన శాస్త్రాలను విమర్శిస్తు తిరుగుతుంటారు. వారు అభ్యుదయభావాలు కల వారిగా ఊహాలోకాల్లో ఉంటారు. అటువంటి వారికి మనం చెప్పేదేమీ లేదు. కనీసం దేశంమీద ప్రేమ ఉన్న వారు ఇది చదవండి. నిజాన్ని గుర్తించండి.