Sri Kirata Varahi Stotram , Varahi Vratam Varahi Ashtotara, సర్వ కార్యసిద్ది వారాహి వ్రతం పూజ విధానం, Varahi Matha SongsVarahi

Varahi Matha Songs

వారాహిమాత రావమ్మా…. వరములనుమాకు ఈవమ్మా….(Varahi Matha)

జైవాసవి జైజై వాసవి
వారహి దేవి గాన నీ రాజనం
బంగారు బొమ్మ రావేమే రాగం
రచన, గానం, టైపింగ్. పొట్టి.రెడ్డి జయలక్ష్మి, శ్రీకాళహస్తి


వారాహిమాత రావమ్మా…. వరములనుమాకు ఈవమ్మా….
వారాహి…..
ఆ…. ఆ….
భూమాత నిజము నీవమ్మా….
భూజనుల కావరావమ్మా…..

వారాహి….
ఆషాడ పాడ్యమందూ…..నిను నిలిపాము పీఠమ0దూ…..
అందాల అమ్మనే తీర్చినిను కొలిచేము కోమలులు కలసీ…. ఈ… ఈ…
మాపుజ లందరావమ్మా
మమ్మేల దరికి రావమ్మా
మాపుజ…..
వారాహి…..

మాలోని కలుషమంతా
నీ కృపతోనే కూల్చవమ్మా….
కనికరమునుచూపవమ్మా
కరుణాక్షి కావవమ్మా…..
మాలోని…..
జగములనే ఏలు జగదాంబా… ఆ… ఆ
జగతికే వెలుగు నీవేగా… ఆ… ఆ….
జగము……

వారాహి……

మరువమమ్మా…. వదలమమ్మా……(Varahi Matha)

జైవాసవి జైజైవాసవి
వారాహీ దేవి గాన నీ రాజనం
పిలువకురా అలుగకురా రాగం
🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
రచన, గానం, టైపింగ్. పొట్టి. రెడ్డి జయలక్ష్మి, శ్రీకాళహస్తి
🕸️🐍🐘🕸️🐍🐘🕸️🐍🐘
మరువమమ్మా….
వదలమమ్మా……
వారాహీ….మాత నీవమ్మా….
వారణాశినే….పాలించా
మరువ…..
మరువ……
పూజకు కుసుమం ఎంతో వే…చే….. ఆ… ఆ..
నైవేద్యములే..సిద్ధముకాగా….
పూజ…..
వేచితి నీకై సరగునరావా…2
జాగు అదేలమ్మా వడివడిగా రావా
జాగు……
మరువ…..
మదినిను స్థిరముగా నిలపితి మమ్మా…..ఆ….. ఆ….
మము ఎడబాయక బ్రోవగరమ్మా…
మది…..
మరిమరి పిలచితి పలుకవదేమ్మా….
మరి…..
జాగు అదేలమ్మ
మరు……

అష్టబుజముల తల్లి వారాహిమాతా…… (Varahi Matha)

జైవాసవి జైజైవాసవి
వారాహిదేవి గాన నీ రాజనం
ముత్యమంతా పసుపు రాగం
రచన, గానం, టైపింగ్. పొట్టి. రెడ్డిజయలక్ష్మి,శ్రీకాళహస్తి


అష్టబుజముల తల్లి వారాహిమాతా……
అపరంజి అమ్మవే వారాహిమాతా…. ఆ…. ఆ…
అష్ట……
అమ్మరో పలికేము నీ నామ స్మరణనే
ఆదరించుము మమ్ము వారాహిమాతా
అష్ట…..ఆ…. ఆ…. ఆ…..
గృహమందు గోమయము కళ్లాపి చల్లి రంగవల్లులు తీర్చి
తోరణములే కట్టి
గృహమందు….
ఎదురు చూచెదమమ్మ నీ రాక కొరకూ…..
ఎదురు……
మంగళా వాద్యమ్ముల స్వాగతమ్ములు గా….
అష్ట…..ఆ…. ఆ…, ఆ
ముదిత లందరుచేరి ముదముతో కొలవంగ
సౌభాగ్య వరమిమ్మ వారాహి మాతా…
ముదిత……
పసుపు, కుంకుమ పూజ లందుకోవమ్మా……
పసుపు…..
ముతై దు భాగ్యలు మాకీయవమ్మాఆ….. ఆ..,.
అష్ట……

లలితా0బ రూపమూ నీవేగ అమ్మ
భూమాత రూపమూ నీవేగఅమ్మ
లలితాంబ……

ఏరూపు తలచినా, కొలచినా మమ్ము
ఏరూపు….

ఆరూపు కావగా అవతరించితివమ్మా
అష్ట…..

అమ్మవురావా వారాహిగా పంచమి ఘడియలు వచ్చాయిగా….(Varahi Matha)

జైవాసవి జైజై వాసవి
వారహి దేవి గాన నీ రాజనం
వాడినపులే వికసించేనే రాగం
రచన, గానం. పొట్టి. రెడ్డిజయలక్ష్మి శ్రీకాళహస్తి
అమ్మవురావా వారాహిగా పంచమి ఘడియలు వచ్చాయిగా….
అమ్మవురావా…..

పూజకు తరుణం ఏ తెంచెగా
మన మదిలో సంద డి మొదలాయేగా.,..
పూజ….
ఎదురు చూచెను నయనాలు నీకై
హృదయ తలుపులు తెరిచాము నీకై
దేహమే మా ఉద్యానవనమై
నిలిచి ఉండుము మా అంతరంగము….
అమ్మవురావా…..
పంచమి…..
పలురకమ్ముల పుష్పాలు ఇవిగో
పలురకమ్ముల నైవేద్య మిదిగో
పలు…..
పలు..
మురిసిపోదుము నీ మోము చూసి
తెలియాడెను మాహృదయసీమ
అమ్మవు….
పంచమి..,.
వస్య వారహి మాపుజ ల0దే
నిలిచికాచెను మావాడలందే
వసంత మీనాడే మాజీవితానా
శరణు శరణమ్మ దయనుంచుతల్లి
అమ్మవు…..
పూజకు…..

కన్నతల్లి వారాహీ మాతవే ఓ యమ్మా

జైవాసవి జైజై వాసవి
శ్రీవారాహీ దేవి గాన నీ రాజనం
సుందరాంగ నిను మరువగలేను రాగం
రచన, గానం. పొట్టి. రెడ్డీజయలక్ష్మి, శ్రీకాళహస్తి


కన్నతల్లి వారాహీ మాతవే ఓ యమ్మా
మా పూజలందగా భూలక్ష్మి నీవేగా రావమ్మ
కన్నతల్లి…..
జగములనేలే లలితాంబ అంశయే నీవమ్మా…….
జగముల…..
ఈ జనులను కావ0గా
వేళ ఇదెగా జాగు ఇక ఏలమ్మా
ఈ జనులను…..
కన్నతల్లి…

వైకుంఠ నాదుడూ ధరణిని కావగ ఆనాడు
అవతరించెగ వరాహ రూపమున ఆనాడూ
వైకుంఠ…..
స్వామిచెంతయే వారాహీ మాతగా నిలిచావూ……
స్వామి…..
శ్రీలక్ష్మి వి నీవమ్మా అభయమిమ్మా
ముదముతో మొక్కేమూ
శ్రీలక్ష్మి……
కన్నతల్లి….

హృదయమునందు పదిలము చేసి స్తుతి ఇంతూ
పాదము విడువక ప్రార్థన చేసి స్మరి ఇంతు
హృదయ…..
హాయిని గొలిపే మారుతమేఅయి కాపాడూ…..
హాయి…..
చల్లని నీ నీడ నిలువనిమ్మ దయను నువు గనవమ్మా
చల్లని…..
కన్నతల్లి…..

వారాహీ రావమ్మా….. వాత్సల్యము చూపమ్మా..

జైవాసవి జైజై వాసవి
శ్రీ వారహీ దేవి గాన నీ రాజనం
వినిపించని రాగాలే రాగం
రచన, గానం, టైపింగ్. పొట్టి రెడ్డిజయలక్ష్మి, శ్రీకాళహస్తి

వారాహీ రావమ్మా….. వాత్సల్యము చూపమ్మా..
మదిలో,నిలిపీ,కొలచే ….చేలులా మొరలే వినుమా…..
వారాహీ…..
ప్రతి మనసు నిను తలచే
ప్రతి కరమూనిను కొలచే
ప్రతిమనసు……
ప్రతి సంధ్యా నీ పూజే….
ప్రతి పదమూ నీ స్మరణే….
మదినే నిలకడ చేసీ
వారాహీ….

నవరాత్రులు నిలిపామూ….
నవ విధులా కొలిచేమూ….
నరాత్రులు…..
నవరూపము చూపావూ
నళి నాక్షి వి నీ వమ్మా
నాగలినే ధరి ఇంచీ
వారాహీ,…

నీ రాకతో ప్రకృతియే వికశిం..చె ముదమారా….
నీ రాకతో….
నీ చల్లని కాంతులతో మెరిసింది తనివారా…
సస్య దేవీ మాతా
వారాహీ….


ఓ దేవి రావా… పిలుపూ వినవా

జైవాసవి జైజైవాసవి
శ్రీవారాహీ దేవి గాననీరాజనం
ఓ నెలరాజా వెన్నెలరాజా రాగం
రచన, గానం. పొట్టి.రెడ్డి జయలక్ష్మి, శ్రీకాళహస్తి

ఓ దేవి రావా… పిలుపూ వినవా
నా కంటిపాప ఐనాది నీ రూపం
నా వాక్కు నందు నిలిచింది నీ నామం……..
ఓ దేవి…..
మల్లెపూల మాలలూ….మందారా ల సొగసులూ…..మాతా…..ఆఆ..

మల్లెపూల…..
నిలిచినాయి వారాహి చెంత చేరగా…..
ఆ భాగ్యమేదో మా కంత లేదుగా ఆ…ఆ…..
ఓ ఓ….. దేవి రావా
ఆ….. ఆ….ఆ….. ఆఆఆ
గులాబీల గుత్తులూ, చామంతుల పూబంతులూ….మాతా….. ఆ…. ఆ….
గులాబీ……
మురిసినాయి వారాహిని చేరగా…..
ఆ భాగ్యమేదో మా కంత లేదుగా ఆ….. ఆ…..
ఓ ఓ దేవిరావా…..

గన్నేరులు, సంపంగులు, పలురకాల పూబోణులూ…..
వారాహి చెంత ముక్తి పొందెగా…..ఆ… ఆ….
ఆ భాగ్యమేదో మాకిమ్మ తల్లిగా
వారాహి చెంత ముక్తి……
ఆబాగ్యమేదో……
ఆ….. ఆ…..
ఓ ఓ దేవిరావా …..

లాలిలాలీ లాలి లాలెమ్మ లాలి

జైవాసవి జైజైవాసవి
శ్రీవారాహిదేవి లాలి గాననీరాజనం
లాలి లాలీ లాలి రాగం
రచన, గానం, టైపింగ్. పొట్టి.రెడ్డి జయలక్ష్మి, శ్రీకాళహస్తి

లాలిలాలీ లాలి లాలెమ్మ లాలి
లాలిలాలీ లాలి లాలెమ్మ లాలి…2
లాలివారాహిజోజో బంగారు లాలి…..2
లాలి లాలీ….2
పాల సంద్రముపైన పవళించే లక్ష్మి కీ…ఈ……ఈ
లాలెమ్మ లాలి
పాలసంద్రము…..
వారాహి రూపుకు
పణిరాణి లాలి…
పాలసంద్ర.,…
సప్త మాతృకుల తల్లి పంచమీ కోలముఖి మెత్తనీ మణి పరుపుతో లాలి
సప్త…….
లాలెమ్మ లాలి
లాలెమ్మ లాలి…. ఊ….. ఊ….

లాలిలాలీ లాలి లాలెమ్మ….2

చెలుల0త నిను కొలువ
చెంగల్వ పూలతో……

లాలెమ్మ లాలి..
చెలులంత నినుకొలువ చెంగల్వ పూలతో
అలసిన అరవింద నేత్రికి లాలి
చెలుల0త…..
సేనాది నాయకై అసురులా దునుమాడ సొలసి సూక రముఖి
మలయ మారుతము లాలి
సేనాని…..
ఊ.,. ఊ…

లాలిలాలీ…..2

ముని,జనులు ముదముతో పాడేరువార్తాళీ …….
లాలెమ్మ లాలి
ముని జనులు……
నీవంచునాతల్లినిదురించు రవిచంద్ర నేత్రి
మునిజనులు…….
గుప్త నవరాత్రుల వరాహ ముఖి కివమ్మ లాలింతు జయకిక సెలవీయ లా… లీ
గుప్త.,…..

లాలి లాలీ…..2
లాలి…….4ఊ… ఊ….4

వారాహి హారతిదిగో వరహాల హారతిదిగో

జైవాసవి జైజై వాసవి
శ్రీవారాహిదేవి హారతి గాననీరాజనం
చిరునవ్వులోని హాయి రాగం
రచన, గానం. పొట్టి. రెడ్డిజయలక్ష్మి, శ్రీకాళహస్తి


వారాహి హారతిదిగో వరహాల హారతిదిగో
నవరాత్రి దేవి ఇదిగో…….. నవరత్నహారతిదిగో
వారాహిహారతి……
ముత్యాల పీఠ వే….సీ ముత్యాల హారతిచ్చి
ముత్యాల పీఠ…..
పగడాల మాల ధరియించెఅమ్మ పగడాల హారతీస్తు
పగడాల……
వారాహిహారతి…..
మణిద్వీప వాసి నీవే…..నీ మహిమతెలిసికొంటీ
మణిద్వీప….
మణులందు నిలిపి హారతులు ఇస్తు
మహినేలు జనని రావా
మణులందు నిలిపి…..
వారాహిహారతి……

నీ లాల హారతిదిగో…..నీ నయనాల వెలుగు చూ….ప
నీలాల హారతి..,..
పచ్చాల హారతందేవు నీవు
పచ్చంగ మమ్ము చూడు
పచ్చాల……
వారాహి హారతి….

పుష్య రాగ హారతిదిగో పుష్పా లతోటి నీకు
ఇంపైన తల్లి కెంపులా హార్తి వారాహి అమ్మకేగా
ఇంపైన……
వారాహిహారతి…..
గోమెధిక హారతిదిగో గోనివాసి లక్ష్మీ దేవీ
గోమేధిక……
వజ్రాలతోడ వైడూర్య ముంచి హారతులు ఇస్తునమ్మా
వజ్రాల……
వారాహిహారతి……

తలుపులు చరచి పిలిచి0దే అమ్మా

జై వాసవి జై జై వాసవి
వారాహి మాత గాన నీరాజనం
ఎక్కడి దొంగలు అక్కడ నే గప్చుప్ రాగం
టైపింగ్ ,రచన, గానం పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి

తలుపులు చరచి పిలిచి0దే అమ్మా
మాతానీవే ఔనా వారాహి మాతా నీవేఔనా…..
మాతా….

రేయి లో నిశిరాత్రి లో నాగృహము కే ఏతెంచేగా
పాడ్యమీ శుక్రవారమే పాదమే మోపింది లే
పాడ్యమి……
పరవశమే చెందెను నా మదియే
తలుపులు….

ద్వాదశ నామాలతో కొలవనా నిను తలవనా
మార్గమే తోచిందిలే ఇక సాగులే నీ సేవలే
మార్గమే…..
నీ సన్నిధి వీడను ఎన్నటికీ
తలుపులు….

హృదయ మే దీపకాంతులే చిందెనే అర్పించెద
చూడుమా వే0చేయగా ఇటు చూడుమా ….
నీ చరణములే ఇక శరణము లే
తలుపులు…….

సకల రీతుల పూజలంది పోయి మరలా రావమ్మ – వారాహి శెలవు గాన నీరాజనం

జై వాసవి జై జై వాసవి
వారాహి శెలవు గాన నీరాజనం
వేయి శుభములు కలుగు నీకు రాగం

టైపింగ్ రచన గానం పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి

సకల రీతుల పూజలంది పోయి మరలా రావమ్మ
భక్తి మీరగ కొలుచుకొ0టిమి విడు వలేక శెలవ వంటినీ
సకల…..

వరాహ దేవుని సతీమణివే స్వామి చెంతనే చేరగ
వరాహ….
కుశలమాడి, సేదతీరి మరల బిడ్డల చేరుమా
సకల రీతు …..

లలితా0బ ఇష్ట సఖివి నీవే దండ నాధా ,పోత్రిణి
లలితా…..
నవరాత్రి పూజలు అందగా తిరిగి వస్తువు గానిలే
సకల…..

వేయి కన్నుల ఎదురు చూతుము
వార్తాళిగా నిను కొలువగా
దేవగానా దుందుభులస్వాగతా మంగళాలతో
సకల రీతు….

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *