Smashana NarayanSmashana Narayan

స్మశాన నారాయణుడు

మహిమాన్వితమైన క్షేత్రం స్మశాన నారాయణుని దర్శనం మనకు లభిస్తున్న అద్భుత వరం, మనందరం తప్పకుండా దర్శించవలసిన దివ్యక్షేత్రం….!!

🌹పితృ దోషము నుండి బయటపడే  సులువైన పరిష్కారం

🌹 మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో …

అలాగే… తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.

🌹మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.

అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసికావచ్చు, తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు..

🌹 మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే.

అదే పితృదోషం..

🌹 పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.

ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.

వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.

🌹 పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని ……

🌹 చిన్న వారు అకాలమరణం పొందడం

 🌹శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.

🌹 అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం.

🌹 మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం.

🌹 మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం

🌹ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం.

దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం…”స్మశాన నారాయణుడిని” ప్రసన్నం చేసుకోవడమే …

🌹 అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.

🌹1. కాశీ

🌹2. పాపనాశి 

( అలంపురం ‘జోగుళాంబ గద్వాల జిల్లా)

🌹అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.

🌹 విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .

అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.

🌹 స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే….

పాలు అన్నముతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నేయి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి !

ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని  స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు .

🌹 స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.

ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారిచే చేయించ వచ్చును )

🌹 అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్లను దర్శనం చేసుకున్న తరువాత ఈ  స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.

🌹 ఈ ఆలయ ప్రాముఖ్యము  తంత్ర గురు “వేణు మాధవ నంబూద్రి ” ద్వారా  దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !

🌹 ఇంకొక ముఖ్య విషయం :

స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ‘ 7వ శతాబ్దం నాటి అతి పురాతన ‘ అతిపెద్ద మరకత లింగం ‘ దక్షిణ కాశి అంటారు .

ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి!

చేరుకొనే విధానం:

అలంపూర్ “హరిత హోటల్ ”  ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది .

ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం “స్మశాన నారాయణుని ఆలయం “.

వాసవి.నెట్: ఒక సంపూర్ణ ఆర్యవైశ్య వెబ్సైట్

Smashana Narayan
Smashana Narayan

Smashana Narayan: The Sacred Abode for Ancestral Blessings

Introduction to Smashana Narayan

The revered shrine of Smashana Narayan offers devotees a unique opportunity to seek blessings and liberation from ancestral doshas. Visiting this divine temple is considered an extraordinary blessing, crucial for spiritual seekers and those affected by ancestral karma.

The Power of Ancestral Karma

Ancestral karma profoundly influences our lives. Just as we inherit property from our ancestors, we also inherit their karmic deeds. If our forefathers committed righteous acts, their descendants enjoy prosperity and happiness. Conversely, if they committed sins, knowingly or unknowingly, the resultant negative karma affects the family lineage, manifesting as suffering and obstacles.

Understanding Pitr Dosha

Pitr Dosha arises when ancestors’ unfulfilled desires or negative deeds impact their descendants. Even if one leads a virtuous life, Pitr Dosha can cause severe hardships, such as:

  • Untimely deaths of young family members
  • Chronic health issues and organ failures
  • Accumulation of debts and financial instability
  • Involvement in unexpected accidents and mishaps
  • Children falling into bad habits and ruining the family’s reputation

Seeking Refuge in Smashana Narayan

The sole remedy for Pitr Dosha is to seek the blessings of Smashana Narayan. This divine intervention can mitigate the adverse effects of ancestral karma, ensuring peace and prosperity.

The Two Sacred Shrines of Smashana Narayan

India houses only two temples dedicated to Smashana Narayan:

  1. Kashi (Varanasi)
  2. Papanashi (Alampur, Jogulamba Gadwal District)

The Hidden Gem of Alampur

Interestingly, the existence of the Smashana Narayan temple in Alampur is not widely known. The Kerala Tantric scriptures highlight its significance, making it a crucial pilgrimage site for those seeking liberation from Pitr Dosha.

Rituals to Please Smashana Narayan

To please Smashana Narayan, devotees should offer specific rituals:

  • Prepare a naivedya of milk, rice pudding, plain rice, lentil soup, ghee, and fritters.
  • Only family members bearing the family name should partake in the naivedya; it should not be given to outsiders.
  • Adorn the deity with a white scarf.
  • Prepare the offerings yourself or arrange for the local priest to do so if personal travel is not possible.

Visiting Alampur’s Sacred Shrines

Devotees should visit Alampur early in the morning, bathe in the Tungabhadra River, and then offer prayers to the deities. After worshiping Smashana Narayan, return home without visiting any other places.

The Teachings of Venu Madhav Namboodri

The importance of this temple is documented in Kerala Tantric texts by the Tantric Guru Venu Madhav Namboodri, emphasizing its profound spiritual significance.

The Main Deity: Sri Papanaseswara

Within the temple complex, the principal deity is Sri Papanaseswara, revered as the Southern Kashi. This ancient Marakata Linga, dating back to the 7th century, is believed to annihilate all sins upon darshan.

Directions to the Temple

To reach the Smashana Narayan temple:

  • Navigate to “Haritha Hotel” in Alampur.
  • From the hotel, take the small road on the left and travel 1.2 kilometers to the Papanaseswara temple complex.
  • Within this complex lies the sacred shrine of Smashana Narayan.

Conclusion

Visiting Smashana Narayan temple is a profound spiritual journey, offering liberation from ancestral doshas and bringing peace and prosperity to the family. By performing the prescribed rituals and seeking the deity’s blessings, devotees can alleviate the suffering caused by Pitr Dosha and lead a harmonious life.

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *