Shyamala devi mangala haratulu (శ్యామలా దేవి మంగళ హారతులు)
Shyamala devi mangala haratulu ఓ…..రాజ శ్యామల, రాజ శ్యామల
జై వాసవి జై జై వాసవి
రాజ శ్యామల దేవి గాన నీరాజనం
ఓ నెల రాజా రాగం
రచన, గానం పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి
ఓ…..రాజ శ్యామల, రాజ శ్యామల
నా పిలుపు నీవు వినవమ్మ శ్యామల
నిను కోరి చేరి పిలిచి0ది నేనే గా….
ఓ…..
చల్లని నీ చూపులా నీడ నాకు ఈవ మ్మ …..2
ఓ……
చల్లని…..
జాగు ఇంక ఏలమ్మ శ్యామలా….
నీ దాసులను బ్రోవవమ్మ శ్యామల
ఆ ఆ ఆ
ఓ….రాజ
ఆ ఆ ఆ….
తెల్ల నీ…..కలువలా చిరునవ్వులు నీకి వే
ఓ…..
కలువల ….
వలిచి నిన్ను కొలిచినాయి శ్యామల
నీ పాద చెంత నిలిచాయి శ్యామల
ఆ ఆ ఆ
ఓ….
లేత లేత నీ చూపుల కిరణాల హాయితోనే
ఈ జగమే నిండి పోయే శ్యామల
మా అభివాదం నీకిదే శ్యామల
ఈ జగ మే….
ఆ ఆ ఆ
ఓ…..
Shyamala devi mangala haratulu – మధురము శ్యామల నామము
జై వాసవి జై జై వాసవి
రాజ శ్యామల దేవి హారతి గాన నీరాజనం
కిలకిల నవ్వులు చిలికిన రాగం
టైపింగ్, రచన, గానం, పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి
మధురము శ్యామల నామము
మధురము శ్యామల ఆనంద గీతము
కలిగెను నాలో భావన
కలిగెను మదిలో శ్యామల తపన
మధురము…..
రమ్మనే రాజ శ్యామల మాత పిలుపె….2
పులకించ గా మై మరచి0ది తనువు
మాతంగి మాతా మమత ల కోవెల చేరెద నేడే శుభ తరుణమాయే
మధురము…..
నా తల్లి నిలిచే నా అధరముపైన..2
నా పలుకు తానై నడిపిం చేను కాదా
వీణా వాణి,మల్లెల మాల కంఠ భరణము చేసేను నేనే
కలిగేను…..
ఓ బ్రహ్మరాణి హంసవాహిని నీవే …2
ఓ జ్ఞాన మాతా మా హారతి గనవే
శ్యామల గానే నిలిపే నిన్ను కొలచ న నవరాత్రి మాతంగ మాత
మధురము……
Shyamala devi mangala haratulu – మాతంగీ నిను స్వాగతింతు కోరీ…….
జై వాసవి జై జై వాసవి
శ్రీ శ్యామల దేవి గాన నీరాజనం
నా హృదయం లో నిదురించె చెలి రాగం
టైపింగ్ రచన గానం పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి
మాతంగీ నిను స్వాగతింతు కోరీ…….
హృదయం లో పీట వేసినాను….
కలహంసవై నడిచి రావ నీవే నన్ను గావ రావ
మాతంగి…….
నా కన్నులలోనే…. నిలిచెనులే చల్లని రూపం
కన్నుల…..
సదామయి నిన్ను గాంచి మేను మరచినానే నీ దాస గాచ రావే
మాతం గి….
వాక్ దేవతవేనీవూ వా0చించితి
శ్యామలా దేవీ …..
సంధ్యహారతీ……. అందుకోవే వాణి
నీ చల్లని వెలుగు ప్రసరించెనులే
వెన్నెలలహిరీ …..
చల్లని….
మణిదీప వాసి మంత్రిణివై మహిని నిలువ రావే
నివాళులు లందు కోవె
మాతంగి…….
జై వాసవి జై జై వాసవి
శ్రీ శ్యామల దేవి జోల గాన నీరాజనం
పాడుతా తీయగా చల్లగా రాగం
టైపింగ్ రచన గానం పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి
శ్యామలా జోలలే పా..డన………2
చిన్నారి వని ఊయల లే ఊచన
మురిసి.. పోదునా ….ఆ ఆ
శ్యామలా ……ఆ ఆ
సంగీత వాణి అలసినావు సేదతీ రుమా
సేదతీరి సేవకులను ఆదరించు మా
సంగీత…..
తరించెనమ్మ నాదుజన్మ నీదు సేవలో
తరించె……
ఓ వైణికై నమో నమః నిదురించు హాయిగా …..
శ్యామల…….
గుండె లోన గుడికట్టి కొలిచేరు ,తలచేరు శ్యామలా నవరాత్రులు జరి,పేరు
గుండె……
షోడశ నామావళినే పఠియించేరు..2
బుద్ధి, జ్ఞానములనే కోరుకోనేరు
శ్యామల…..
మాతా….
ముద్దులొలుకు శారదా0బ సుందరి రూపం
పాపగానే తలచినేను అమ్మ నౌదునా
ముద్దు…..
అల్లారుముద్దు…మురిపాలను అందుము తల్లీ……2
జోలల్లు పాడనా,నా ప్రతి జన్మనా…ఆ ఆ
శ్యామల…..
జై వాసవి జై జై వాసవి
శ్రీ శ్యామల దేవి హారతి గాన నీరాజనం
ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి రాగం
🌼🪕🌼🪕🌼🪕🌼🪕🌼🪕
రచన గానం పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి
🕸🐍🐘🕸🐍🐘🕸🐍🐘
ఆలయాన నెలకొన్న మంత్రిణి నీవే
షోడశ నామాలతో వెలు గొందితి వే
ఆలయా…..
షోడశ…..
రాగాలుపలికినది విరించి నీకే
ప్రకృతి యే కురిపించే పువ్వుల వానా
మాతా మాతంగి, మంజులభాషిణి వే
వాణి శ్యామల సంగీత సామ్రాఙీ
మాతా మాతంగి……
మధురవాణి హారతి గొను జ్ఞాన మోస గుమా
ఆలయాన …..
శ్రీ లలిత పరమేశ్వరి ప్రతి నిధి నీవై
రాజ్యమునే ఏలేటి రాజశ్యామలా
శ్రీ లలిత…..
చెడు దుర్మార్గమూ రక్షణ చేయగా
తల్లీ ఉపాసనే మంచి మార్గమాయే గా
చెడు…..
శ్రీ శారదా, శ్రీ వాణి, శర్వాణి గా
ఆలయాల…..
జై వాసవి జై జై వాసవి
శ్రీ శ్యామల దేవి గాన నీరాజనం
నేడు శ్రీ వారికి మే మంటే పరాకా రాగం
🪕🌼🪕🌼🪕🌼🪕🌼🪕🌼
రచన, గానం పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి
🕸️🐍🐘🕸️🐍🐘🕸️🐍🐘
నేడు శ్రీశ్యామల వే0చేసే మాకై…. ఆహా ఏమి భాగమో….
మాకూ…. తరగని ఘనే ఆమేగా ……ఆ ఆ
నేడు శ్రీ శ్యామల…..
మొదట వేచాను శ్రీ మాతా రాక కోసం
ఎదురు చూశాను ఎంతో ఆర్తిగా
ఆ..స్వాగత తోరణమే పలికేను శ్రీ రాగమే
నాద దుందుభులు ఆలాపన చేయ గా
శ్యామ ….కను పించగా,మదియె పుల కించగా
శ్యామ….
నీ..రాజనమే ఇచ్చేముఆనంద డోలల
నేడు శ్రీ శ్యామల…..
పసుపు,కుంకుమ ల పూజి0చగ ఓ దేవి
కుశాగ్రబుద్ధి నే మాకొసగగా రా దేవి
ఆ ఆ ….మా నిలయ మే నీ సుందర మందిర మమ్మ
మా మదిలోనే నీసుందర రూ…ప మమ్మ
కోరి కొలిచితి నిన్నే,చేరి కావుము మమ్ము ,
కోరి……
మాగృహ మాయే ఈనాడే పావనము
నేడు నీపప్రియ నీభక్తుల గాంచ వే శరణ0, నీ చరణం….
ఆ ఆ…స్మరణ0 నీ నామం
ఆ ఆ…స్మరణము నీరూపం
జై వాసవి జై జై వాసవి
శ్రీ శ్యామల దేవి స్వాగతగాన నీరాజనం
జోరుగా హుషారుగా షికారు పోదామా రాగం
🪕🌼🪕🌼🪕🌼🪕🌼🪕🌼
టైపింగ్ రచన గానం పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి
🕸️🐍🐘🕸️🐍🐘🕸️🐍🐘
శారదా శాంభవి నీకు అంజలీ
మాఘ శుద్ధ పాడ్యమే నీకు ప్రశస్తీ
శారదా………
ఓ …..శ్యామల నినుగని సరగునొస్థినే
సుగంధ పరిమళాలనే నీకు తెస్థినే
ఓ శ్యామల….
దరికిజేరితీ దరికిజేరితి
ఓ …..శారదా శాంభవి……
నీ వన్నెలొలుకు మోము చూచి తరించి పోతినే
మోహనమౌ రూపు గాంచి మైమరచి పోతినే
నీ వన్నెలొలుకు
మరువ జాలనే మరువ జాలనే
ఓ…..శారద, శాంభవి…..
నాకనులలోన నీకళలను నింపు కొంటినే
కదంబవాసి కనికరి0చి కదలిరావదే
నా కనుల లోన…..
స్వాగతం బిందె స్వాగతం బిందె
ఓ…..
శాంభవి శారదా…..
జై వాసవి జై జై వాసవి
శ్రీ శ్యామల దేవి గాన నీరాజనం
నిన్నే నిన్నే చెలి నిలు నిలుమా రాగం
🌼🪕🌼🪕🌼🪕🌼🪕🌼🪕
రచన గానం, పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి
🕸️🐍🐘🕸️🐍🐘🕸️🐍🐘
నిన్నే నిన్నే శ్యామ దయ గనుమా
నినుగని మరువగ లేను సుమా
నిన్నే నిన్నే శ్యామ…..
ననుగనుమా అంబ దయగనుమ
నను గనుమా……
నమస్తే శ్రీ శర్వాణి, ఓం పాహిమా0
ననుగనుమా,అంబ దయగనుమా
విడువకుమా నను మరువకు మా
చెలికో..రీ…….దరిచేర పరిహాసమా
విడువకు…..
పలుకవే వాక్ దేవతా,
శ్రీ శుక శ్యామల, అష్టతిధిదేవి కనుపాపైకాపాడవే
నను గను మా, శ్యామ దయగను మా…….
తాపసినీ నేను కాను గదా ఏ తప,జప మెరుగని అబలనుగా
తాపసినీ…..
ఓ.. చతుర్భుజి ,శ్రీ కమలాసిని….
శ్రీ ముద్రిణై,మంత్రిణై,వీణావతీ
నను గను మా, శ్యామ దయ గను మా
విజయము నీయవే శ్రీశక్తివే
సర్వరూ…పిణివే ,విశ్వరూ…పిణివే
విజయము…
సకల వేదానివే,సకల దేవీనీవే
బ్రహ్మ విద్యా ప్రదాయినిగ దర్శింతు నే
దయ గనుమా, అంబ నను గనుమా….2
జై వాసవి జై జై వాసవి
శ్రీ శ్యామల దేవి గుప్త నవరా త్రుల మంగళ హారతి గాన నీరాజనం
🪔🪔🪔🪔🦜🦜🦜🪔🪔🪔🪔
టైపింగ్ రచన స్వరకల్పన గానం పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి
🕸️🔔🐘🕸️🐍🐘🕸️🐍🐘
మంగళ హారతులు అందుకో నవరా…త్రి శ్యామల
మంగళ…..
గుప్త నవరాత్రుల హారతులు అందుకో
గుప్త….
మతంగముని కుమా….రి హారతులు అందుకో
మతంగ….
మంగళ…..
శ్రీ సంగీత యోగిని మంగళం జయమంగళం..2
శ్రీ శ్యామ మంగళ0 జయమంగళం…2
శ్రీ శ్యామలా…యై మంగళం జయ మంగళం ….2
శ్రీ మంత్రనా…యికాయైమంగళం జయ మంగళం …..2
శ్రీ మంత్రిణియై మంగళం జయ మంగళం…..2
శ్రీ సచివేశానై మంగళం జయ మంగళం….2
శ్రీ ప్రదానేశియే మంగళం జయ మంగళం….2
శ్రీ శుక ప్రియాయై మంగళ0జయ మంగళం…2
శ్రీ వీణావతియే మంగళం జయ మంగళం….2
శ్రీ వైణికై మంగళం జయ మంగళం..2
శ్రీ ముద్రిణై మంగళం జయ మంగళం….2
శ్రీ ప్రియక ప్రియాయై మంగళం జయ మంగళం…2
శ్రీ నీప ప్రియాయై మంగళం జయ మంగళం….2
శ్రీ కదంబేసినై మంగళం జయ మంగళం….2
శ్రీ కదంబవాసినై మంగళం జయ మంగళం….2
శ్రీ సదామదాయై మంగళం జయ మంగళం….2
జయ మంగళం నిత్య శుభమంగళం….2