Subramanya Naga, Shanmukhuni SongsSubramanya

Shanmukhuni Songs

ఉయ్యాల లుగవ షణ్ముఖ ఉయ్యాల లుగవా

జై వాసవి జై జై వాసవి
షణ్ముఖునికి ఊయల గాన నీరాజనం
రచన,గానం. పొట్టి.రెడ్డి జయలక్ష్మి
శ్రీకాళహస్తి

ఉయ్యాల లుగవ షణ్ముఖ ఉయ్యాల లుగవా
బంగారు గొలుసుల బంగారు తొట్టెలో ఉయ్యాల లుగవా
ఉయ్యాలలూగవా……
లాలీ లాలీ లాలీ లాలీ జో…2
పార్వతిమాత పారవశ్యముతో
హాయిగ పాడెను ఉయ్యాల…
పార్వతి……
నా భాగ్యమె పండి గానము చేసితి హాయిగ వూగుము ఉయ్యాల..
నా భాగ్యమె…..
ఆ నింగి నేలగా ఉయ్యాల
ఈ నాల్గు దిక్కులుగ ఉయ్యాల
ఆనింగి…..
ఉయ్యాల లుగవాషణ్ముఖ…..
లాలి లాలి లాలి లాలి జో…2
గణపతి సోదర,సేనా ధ్యక్షుడ
అలసి,సొలసి,సేదతిరు ఈ
ఉయ్యాల….
గణపతి సోదర…..
వల్లీదేవసేనలతో కొలువు తీరి,ఏ కాంతసేవ ఈ ఉయ్యాల
వల్లీదేవసేనలతో…..
జగమంత వూచెను ఉయ్యాల
శ్రీశంకరుడూపెను ఉయ్యాల
జగమంత…..
లాలి లాలి…..జో…2
ఉయ్యాలలుగుమా….

హరోంహర ఉయ్యాలో హరోంహర ఉయ్యాలో

Shanmukhuni Songs

జై వాసవి జై జై వాసవి
షణ్ముఖ ఊయల గాన నీరాజనం
రచన,గానం. పొట్టి.రెడ్డి.జయలక్ష్మి
శ్రీకాళహస్తి
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
హరోంహర ఉయ్యాలో హరోంహర ఉయ్యాలో
హరో0హారావుయ్యాలో…..
త్రినేత్ర తనయుడే ఉయ్యాలో
పార్వతి తనయుడే ఉయ్యాలో
మార్గశిర మాసమున ఉయ్యాలో
శుద్ధ షష్ఠి నే ఉయ్యాలో
హరో0హర…..
సుబ్రహ్మణ్య షష్ఠి అని ఉయ్యాలో
మనము తలతూ మందరము ఉయ్యాలో
ఈశ్వర తేజమే ఉయ్యాలో
తారకాసుర మరణమే ఉయ్యాలో
హరో0హర…..
కృత్తికల పెంపకమే ఉయ్యాలో
ఆరు ముఖముల రూపమే ఉయ్యాలో
గాంగేయుడితడెనే ఉయ్యాలో
సుబ్రహ్మణ్యడితడెనే ఉయ్యాలో
హరోంహర…..
షణ్ముఖుడ0ట ఉయ్యాలో
కుమారస్వామంట ఉయ్యాలో
పార్వతి, పరమేశ్వర్లు ఉయ్యాలో
సైన్యాదక్షుని చేసిరి ఉయ్యాలో
హరో0హర….
ఈశుడు అంతట ఉయ్యాలో
శుల ఆయుధమే ఇచ్చెను ఉయ్యాలో
పార్వతి అంతట ఉయ్యాలో
శక్తి ని ఇచ్చెనే ఉయ్యాలో
హరో0……
సర్పరూప మితడే ఉయ్యాలో
నెమలి వాహనమే ఉయ్యాలో
ఇద్దరు సతులంట ఉయ్యాలో
వల్లీదేవసేనాల0ట ఉయ్యాలో
హరో0…..
కావడిమొక్కునే ఉయ్యాలో
భక్తుల0దరు తీర్చేరు ఉయ్యాలో
శరవణ అంటూ ఉయ్యాలో
పలుమారులు కొలిచేరు ఉయ్యాలో
హరో0…..
షష్ఠి కవచమే ఉయ్యాలో
మనలందరిని కాచునే ఉయ్యాలో
పులా పండ్లతోనే ఉయ్యాలో
పూజచేతుమే ఉయ్యాలో
హరోహర……
అభిషేకాలు అంట ఉయ్యాలో
అర్చనలు అంట ఉయ్యాలో
ఆనందనిరాజనాలు ఉయ్యాలో
మనమందరము చుతూము ఉయ్యాలో
హరో0హర…..
ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల
ఉయ్యాలో జంపాల…..
జంపాలో ఉయ్యాల
ఉయ్యాలో…..
జంపాలో…..

గిరిజా కుమారనీకు

Shanmukhuni Songs

జైవాసవి జై జై వాసవి
స్క0దునికిగాన నీరాజనం
రచన,గానం. పొట్టి రెడ్డి జయలక్ష్మి
శ్రీకాళహస్తి
గిరిజా కుమారనీకు కావిడిలే ఎత్తేము శివసుతుడా కదలిరావయా..ఓ..శ్రీమురుగా
ఈ పిలుపు నీకు అందుకోవయా
గిరిజా….
వేలాయుదా ధరుడా వేవేగమే రావయ్యా..దేవేరులు వేంచేయగా
ఓ..శ్రీమురుగా…ఈ.. పిలుపు…
గిరిజా….
అందాల భువిపైనా అందమైన రంగవల్లి స్వాగత మే పలికేనయ్యా.. ఓ…శ్రీమురుగా….ఈ… పిలుపు..
గిరిజా…..
కార్తికేయ కావవయ్య రకరకాల మ్రొక్కెరూ కడగళ్లను బాపవేమయా…ఓ…శ్రీమురుగా…ఈ….పిలుపు
గిరిజా….
మనసున్న నాతండ్రినిన్నే పూజింతున్నయ్య రకరకాల పుష్పాలతో..ఓ..శ్రీమురుగా…ఈ.. పిలుపు
గిరిజా
ధూప దీప నైవేద్యం నీకే అర్పింతున్నయ్య స్తోత్రాలే చేసేమురా.. ఓ….శ్రీమురుగా…ఈ… పిలుపు
గి రిజా….
హరో0హర అనియంటూ పలుమార్లు పలికేము షణ్ముఖుడ నినువేడెనూ….ఓ…శ్రీమురుగా
స్కందు డంటే నీవేనురా….
గిరిజా…..

గిరిజా కుమారనీకు నీరాజనమిదిగొనుమ

జైవాసవి జై జై వాసవి
స్క0దునికిగాన నీరాజనం
రచన,గానం. పొట్టి రెడ్డి జయలక్ష్మి
శ్రీకాళహస్తి
గిరిజా కుమారనీకు నీరాజనమిదిగొనుమ శివసుతుడా కదలిరావయా..ఓ..శ్రీమురుగా
ఈ పిలుపు నీకు అందుకోవయా
గిరిజా….
వేలాయుదా ధరుడా వేవేగమే రావయ్యా..దేవేరులు వేంచేయగా
ఓ..శ్రీమురుగా…ఈ.. పిలుపు…
గిరిజా….
అందాల భువిపైనా అందమైన రంగవల్లి స్వాగత మే పలికేనయ్యా.. ఓ…శ్రీమురుగా….ఈ… పిలుపు..
గిరిజా…..
కావడులే ఎత్తేరూ రకరకాల మ్రొక్కెరూ కడగళ్లను బాపవేమయా…ఓ…శ్రీమురుగా…ఈ….పిలుపు
గిరిజా….
మనసున్న నాతండ్రినిన్నే పూజింతున్నయ్య రకరకాల పుష్పాలతో..ఓ..శ్రీమురుగా…ఈ.. పిలుపు
గిరిజా
ధూప దీప నైవేద్యం నీకే అర్పింతున్నయ్య స్తోత్రాలే చేసేమురా.. ఓ….శ్రీమురుగా…ఈ… పిలుపు
గి రిజా….
హరో0హర అనియంటూ పలుమార్లు పలికేము షణ్ముఖుడ నినువేడేనూ….ఓ…శ్రీమురుగా
స్కందు డంటే నీవేనురా….
గిరిజా…..

చక్కని షణ్ముఖకి చిరునవ్వు లాలీ

ఓంశ్రీమాత్రేనమః
షణ్ముఖునికి లాలి గాన నీరాజనం
జైవాసవిజైజైవాసవి
చక్కని చంద్రుని కి చిరునవ్వు లాలి రాగం
రచన,గానం,టైపింగ్.పొట్టి.రెడ్డిజయలక్ష్మి, శ్రీకాళహస్తి

చక్కని షణ్ముఖకి చిరునవ్వు లాలీ
ముద్దుల బాలునికి మురిపాల లాలీ
చక్కని…..
చిన్నా..రి కార్తికేయకు చల్లని లాలీ…
చిన్నారి…..
చిరునవ్వు లాలీ, మురిపాల లాలీ
చక్కని……

నవ్వుతు ఉంటే నువ్వు నవ్వుతు ఉంటే
పార్వతమ్ము మురిసేను ఎంతె0 తో హాయితో
నవ్వుతు…..
నీ లా…లు వెలిగే నీ బో…..సి నవ్వుతో
నీ లాలు…..
శివయ్య మనసు నిండే నీ చిరునవ్వు తో
నీలాలు…..
చక్కని.,…
ముద్దుల…..

మల్లెల ఉయలలో పవళి0..చు మురుగా
మల్లెలరేకులకి క0దునోమే..ను మురుగా
మల్లెలఉయలలో……
ఏడవకు చిన్నారీ పార్వతీ పుత్రా
ఏడవకు…..
నీ కళ్ళ నీలాలు మే చూడలేము
నీకళ్ళ…..
చక్కని …..
ముద్దుల……

కృత్తిక నక్షత్రము తో ఉదయంచిన బింబం
ముద్దుమూటగట్టు మోమే..మో అందం
కృత్తిక….
గణపతి సోదరునితో ఆటలే నీకూ….
గణపతి………..
దీర్గా…యురస్తుఅని తల్లి తండ్రుల దీవెన
దీర్గా…..
చక్కని…..
ముద్దు…..
చక్కని….
ముద్దు….
చిన్నరి కార్తికేయ …..
చిరునవ్వు లాలి
మురిపాలలాలి
చిరునవ్వు….
మురి…..
చిరునవ్వు….
మురి…..

షణ్ముఖుడు వుందయించేనులే

జైవాసవి జైజై వాసవి
షణ్ముఖని గాన నీ రాజనం
అరుణో దయమరుదేంచినదే రాగం, (లలితగేయం)
రచన, గానం. పొట్టి.రెడ్డిజయలక్ష్మి, శ్రీకాళహస్తి


షణ్ముఖుడు వుందయించేనులే
ఆరుముఖముల ప్రకాశించె నులే…
షణ్ముఖ…..
ఆది దంపతులే ఆనందముగా
తాండవకేళి ఆడిరిలే…
ఆది…..
ఔనా.. ఔనా ఔనాఔనా అద్భుతమిదే ఔనా….

భూలోకమే ఉత్సాహముగా
ఉత్సవాలు జరిపించినదే
ముదముతో మురుగని హరోం హరా అని పిలచినదే
భూ లోకమే…..
హరోంహర…..
ఔనా..ఔనా ఔనాఔనాఅద్భుతమిదే ఔనా

విజ్ఞనాధుడే సోదరుడై
ఆటపాటలా అలరించెనులే
ప్రమదగణములకు సైన్యాధ్యక్షునిగా అధికారమునా నిలచెనులే
విజ్ఞనా…..
అధికార…..
ఔనా..ఔనా ఔనాఔనాఅద్భుతమిదే ఔనా

విజ్ఞానగిరిశ్రీకాళహస్తి లో
కుమారబాలుడు నిలిచెనులే
వల్లీ, దేవసేన కళ్యాణముతో
నగరమ0త తరి యించెనులే
విజ్ఞానగిరి….,.
నగర…..
ఔనా.. ఔనా… ఔనాఔనా అద్భుతమిదే ఔనా

ఇద్దరి సతుల షణ్ముఖుడ

జై వాసవి జై జై వాసవి
వల్లి, దేవసేనా,సుబ్రమణ్యం స్వామి వివాహ గాన నీరాజనం
ఇద్దరి మనసులు ఒకటాయే రాగం
🥁🎷🪘🎺🥁🎷🪘🎺🥁🎷🪘🎺
రచన గానం పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి
🕸️🐍🐘🕸️🐍🐘🕸️🐍🐘

ఇద్దరి సతుల షణ్ముఖుడ
సరిహద్దులు లేనిది నీ అందం

ముద్దుల మోమును చూడ0గ
మరి తన్మయ మైతిమి మా భాగ్యం
ఇద్దరి…..

కనులు రెండు రెప్ప వేయక
మనసు నిలిపి నిన్ను చూసి
కనులు….
ముగ్ధులయ్యెము

ఇద్దరి సతుల …..

దేవ సేనా,వల్లినాధా వధువరు లుగ గాంచగానే
దేవ……
లోకమే తరియించే…..
ఇద్దరి సతుల……

కల్యాణ ఘడియలు కదలి వచ్చే
కార్తికేయుడు కదలి వచ్చే
కల్యాణ…..
కనుల గా0చెదమా
ఇద్దరి….

వ్యతలు లేని శాంతి నిమ్మని
కలతలెరుగని చెలిమి నిమ్మని
హరో0 హర అందామా

హారతి చేద్దామా స్వామికి హారతి చేద్దామా

హారతి చేద్దామా స్వామికి హారతి చేద్దామా
వల్లీదేవాసుబ్రమన్యులకుహార్తిచేద్దాము మనము హారతి చేద్దాము
హారతి చేద్దామా…….
పుట్టకు పోదాము నాగన్నకు పాలు పోద్దాము……2
పాలను పోసి పూజలు చేసి వేడుకొందాము నాగన్నను వేడుకొందాము
పాలనుపోసి…..2
మనము హారత్తిలిద్దాము
అర్చన చేద్దాము షణ్ముఖ అర్చన చేద్దాము…..2
అర్చన చేసి ఆదిశేషుని వేడుకుండాము మనము హారటు లిద్దాము
అర్చనచేసి……..
మంగళవారం శుభ షష్టి రోజున…2
నాగులచవితి పంచమి రోజున పూజలు చేద్దాము మనము హారతి చేద్దాము…
నాగులచవితి……..
కావడి చేద్దాము కృత్తికా కావడి చేద్దాము….2
కావడి చేసి కుక్కుట ధ్వజుని వేడు కొందాము మనము హారతి చేద్దాము…..2
హారతులిద్దాము నాగన్నను హారతులిద్దాము
నాగమణి తోడి శిబిల్లు తండ్రికి హారతులిద్దాము మనము వేడుకుండాము
మనము వేడుకుండాము
హారతి…….

Nagula Chaviti Songs

Vaasavi.net A complete aryavysya website

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *