శ్రీ రాముని మంగళ హారతి (Mangala Harathi )
పాడరే మగువలార మంగళ హారతిని
ఇవ్వరే హారతిని రామభద్రునకు ||2||
మన రామభద్రునకు
సుందరాకారునికి దశరథతనయునకి
కల్యాణరామునకు కర్పూర హారతిని ||2|| పా||
పగడాల హారతిని పట్టాభిరామునకు
రతనాల హారతిని రామచంద్రునికి ||2||పా||
నీలాల హారతిని నీలిమేఘ శ్యామునకు
సీతా రాఘవునకి ముత్యాల హారతిని ||2|| పా||
రాజీవ నేత్రునకు శుభ మంగళం
రామయ్య తండ్రి కి జయ మంగళం
శుభ మంగళం నిత్య జయ మంగళం ||2||
Vaasavi.net A complete aryavysya website