ఆధ్యాత్మిక ‘సాధనా’ సర్వస్వం కృష్ణానందుల అవతారం
Krishnananda Saraswati Swamy: Sadhana Sarvasvam | Complete Life of Toguta’s Divine Yogi & Guru Madanananda Peetham Founder
ఆధ్యాత్మిక ‘సాధనా’ సర్వస్వం కృష్ణానందుల అవతారం
నిరతాన్నదానవ్రతులు, అనితర సాధ్యమైన గురుసేవా తత్పరులు ‘సాధనాత్ సాధ్యతే సర్వమ్’ అని లోకానికి చాటిన సత్వసాధనా సంపన్నులు, మహంత పద్మవిభూషణ, పరమహంస పరివ్రాజాకాచార్య శ్రీశ్రీశ్రీ కృష్ణానంద సరస్వతీ స్వామివారు.
ఎందరో మహాత్ములకు, యోగులకు, అవధూతలకు, భక్తులకు, సన్యాసులకు, విద్వాంసులకు, కవి పండితులకు, కళాకారులకు, వీరులకు జన్మనిచ్చిన కోటి రతనాల సీమ తెలంగాణలోని మెతుకు సీమ భవ్యమైనది, దివ్యమైనది, ధన్యమైనది. మెదక్ జిల్లా సిద్ధిపేట రెవెన్యూ డివిజన్ మండల కేంద్రం తొగుటలో వైదిక సదాచార సంపన్నమైన పార్నంది వంశంలో జన్మించి, ఆదర్శమూర్తిగా వెలుగొంది శ్రీ గురుమదనానంద సరస్వతీ పీఠాధీశ్వరులై వచ్చిన పని పూర్తి చేసుకుని బ్రహ్మీభూతులైన శ్రీ కృష్ణానంద సరస్వతీ స్వామివారు చిరస్మరణీయులు.
శ్రీ కృష్ణానంద సరస్వతీ స్వామివారి పూర్వాశ్రమ నామధేయం పార్నంది జానకిరామ శర్మగారు. శ్రీమతి శేషమ్మ, బ్రహ్మశ్రీ పార్నంది పట్టాభిరామయ్య దంపతులకు దత్తపుత్రునిగా వెళ్ళారు. చిన్ననాటి నుండి స్నేహ, సౌశీల్య స్వభావంతో కార్యకుశలత్వంతో కార్యసాధకులుగా పేరు పొందారు. జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను సమర్థవంతంగా, ధర్మబద్ధంగా, సానుకూలంగా మలచుకున్నారు. నిత్యం శ్రీవిద్యా సమర్చనంతో ఏకాదశ రుద్రాన్ని ప్రతి నెలకు ఒక పర్యాయం శతరుద్రీయాన్ని చేసేవారు. నిరంతరం దైవచింతనను చేసేవారు.
శ్రీ స్వామివారు ఆంగీరస నామ సంవత్సర భాద్రపద బహుళ పాడ్యమి రోజు జన్మించారు. వరంగల్ జిల్లాలోని చుంచనకోట గ్రామంలో ఉన్న బ్రహ్మశ్రీ విఠాల చంద్రమౌళిశాస్త్రిగారు వీరికి గురువు. గురువుగారి ద్వారా శ్రీవిద్యాదీక్షను పొంది శ్రీ భువనేశ్వరీ మాతను సేవించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందారు.
1978లో ప్రారంభించి ప్రతి నెలా ఒక శతరుద్ర యాగాన్ని, ప్రతి శుక్రవారం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కొనసాగిస్తూ 12 సంవత్సరాలు ఏకదీక్షగా అనుష్ఠించారు. ఓ మారు ప్రతినిత్యం నిరంతరాయంగా నలభై రోజులపాటు శతరుద్రాభిషేకాలు, హవనాలు అనుష్ఠించి సదాశివుని అనుగ్రహాన్ని సంపాదించిన దీక్షాతత్పరులు.
తమ స్వగ్రామమైన తొగుటలో గల శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేసి ఒక సుందరమైన ఆలయంగా తీర్చిదిద్దారు. 1958-1959లో వెంకట్రావుపేట గ్రామ వాస్తవ్యులైన నమిలె రామచంద్రమూర్తిగారి సంకల్పానుసారంగా తమ జన్మస్థలమైన తొగుట గ్రామంలో శ్రీ రామలింగేశ్వర సంస్కృత గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ఆ పాఠశాలకు వ్యూహకర్తగా వ్యవహరించి తమ దీక్షాదక్షతలతో దానిని స్థిరపరిచి హాస్టల్ వార్డెన్గా వ్యవహరిస్తూ ఎంతో గొప్ప సేవ చేశారు. ఆ పాఠశాలలో చదివిన ఎందరో విద్యార్థులు సంస్కృతాంధ్ర పండితులై ప్రభుత్వ విద్యా సంస్థలలో తెలుగు పండితులుగా ఉద్యోగాలలో స్థిరపడి గొప్పకీర్తిని పొందారు.
పూర్వాశ్రమంలో తెలుగు పండితులుగా వివిధ పాఠశాలలలో ఉద్యోగం చేసి ఎందరో విద్యార్థులకు విద్యాబోధన చేశారు. నేటికీ ఆ కాలం విద్యార్థులకు ‘శర్మ సార్’ అంటే హృదయం పులకరిస్తుంది వారి పాండితీ ప్రకర్ష బోధనా చమత్కృతి అంత బాగా విద్యార్థులను ఆకట్టుకునేది. ప్రస్తుత పీఠాధీశ్వరులు కూడా తమ పూర్వశ్రమంలో శ్రీవారి శిష్యులే.
పార్నంది జానకిరామశర్మగారికి జగదేవపూర్ గ్రామానికి చెందిన వర్ధనమ్మతో వివాహం జరిగింది. కానీ దురదృష్టవశాత్తూ ఆమెకు అకాల మరణం సంభవించగా, అనంతరం సిద్ధిపేట వాస్తవ్యులు సరస్వతీబాయిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు జన్మించారు.
జీవితంలో అనునిత్యం ఇతరుల కోసమే శర్మగారు శ్రమించారు. తమ చేత బాగుపడ్డవారే చెడు చేయడం ఎన్నోమార్లు వీరి అనుభవంలోకి వచ్చింది. ఈ విషయంలో వీరు వీరి గురువుగారి వలెనే ఎంతో ధైర్యంగా తమ దృష్టిని ధర్మపథం నుండి విడిపోనీయకుండా కష్టాలను ఎదుర్కొన్నారు.
శ్రీముఖ నామ సంవత్సరంలో ధర్మపత్నీ వియోగంతో తమ బాధ్యతలను కుమారులకు అప్పగించి వైరాగ్యభావంతో నిరంతరం దైవధ్యానంలో లీన మయ్యారు. ఆ తరువాత అపరశివావతారులైన శ్రీ మదనానంద సరస్వతీ స్వామివారి నిరంతర పరిచర్య చేస్తూ, అంతేవాసులై భావి సన్యాసాశ్రమానికి కావలసిన సాధన సంపత్తిని సమకూర్చుకున్నారు. గురువుగారి అనుగ్రహాన్ని సంపాదించి వారి ఆజ్ఞానుసారంగా కొండపాక మండలంలోని తమ జన్మస్థానమైన తొగుట సమీపంలోగల రాంపురం గ్రామ శివారు ప్రాంతంలో శ్రీ గురుమదనానంద శారదాక్షేత్రానికి 1995లో శంకుస్థాపన చేశారు. అది మొదలు ఆలయ నిర్మాణం పూర్తిచేసే వరకు నిరంతరంగా శ్రమించారు.
1999 ఫిబ్రవరి 24వ తేదీ (బహుధాన్య మాఘ బహుళ దశమి) నాడు అత్యంత వైభవంగా దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. తమ గురువుగారైన మదనానంద సరస్వతీ స్వామివారితో కలిసి శ్రీ భవానీ రామలింగేశ్వర సేవా సమితి అనే సంస్థను స్థాపించి నాలుగు సంవత్సరాల పాటు ప్రతి నెలా ఒక గ్రామంలో సమావేశాన్ని శత రుద్రాభిషేక పూజల్ని నిర్వహించారు. శర్మగారి వ్యక్తిత్వాన్ని బాగా పరిశీలించి పరీక్షించిన గురువు మదనానందస్వామి సంతుష్టులై, కరుణించి 1997 సంవత్సరం జూన్ 30 (ఈశ్వర నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ ఏకాదశి) రోజున సన్యాసదీక్షను ప్రసాదించారు. ఆ శుభముహూర్తంలో మహావాక్యోపదేశం చేసి సర్వసంగ పరిత్యాగులైన శ్రీ శ్రీశర్మగారికి ‘శ్రీకృష్ణానంద సరస్వతీస్వామి’ అనే యోగపట్టాను ప్రదానం చేసి తురీయ స్థితిలో నిలిపారు.
తెలంగాణలోనే కాకుండా యావద్భారత దేశంలోనే పప్రథమంగా ఇక్కడ అధిదేవత, ప్రత్యధిదేవతా కర్మ సాద్గుణ్యమూర్తులతో కూడిన నవగ్రహ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. ఇంకా కోటిలింగాల ప్రతినిధిగా స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠించి శ్రీ భవానీ చంద్రమౌళీశ్వర యోగలింగేశ్వరస్వామిగా పేరుపెట్టారు. శారదాదేవి, పంచముఖ ఆంజనేయస్వామి, దత్తాత్రేయుడు, జగద్గురు శంకరాచార్యులకు వేర్వేరు ఆలయాలు నిర్మించారు. అంతేకాకుండా గణపతి, గాయత్రీ మాత, దక్షిణామూర్తి, శనైశ్చరుడు, సంతాన నాగేశ్వరుడు ఇలా ఒక్కరేమిటి సకల దేవతలు తమ తమ లోకాలను వీడివచ్చి శ్రీ గురుమదనానంద సరస్వతీ పీఠంలో కొలువై ఉన్నారంటే అతిశయోక్తి కాజాలదు. స్థానికులైన సాధువులు బ్రహ్మీభూత శ్రీనిర్వికల్పానంద సరస్వతీ స్వామివారి సహకారంతో, స్థానిక నాయకులు, భక్తులు, గ్రామ ప్రజల సహాయంతో క్షేత్ర నిర్మాణంలో, దేవతామూర్తుల నిర్మాణంలో ఏమాత్రం లోపం లేకుండా బాధ్యత వహించారు.
శ్రీకృష్ణానంద స్వామివారి సారథ్యంలో ఈ క్షేత్రంలో 2002లో రెండు వేల మంది బ్రాహ్మణోత్తములు, రెండు వేల మంది భక్తుల చేత శతకోటి గాయత్రీ, హరేరామ నామ మహామంత్రాల సంఖ్యను పూర్తిచేయించి ముగింపుగా 18 రోజులపాటు 400 మంది ఋత్విక్కులతో అపురూపమైన మహాయాగాన్ని నిర్వహించారు. నాచగిరి శ్రీ నరసింహస్వామి దేవస్థానంలో అన్నదానసత్రాన్ని నిర్మింపజేసి అక్కడ నిరంతరాయంగా అన్నదానం జరిగే ఏర్పాటు చేశారు. పల్లెపహాడ్లో పంచాయతన మూర్తులను, కొడవటూరులో శ్రీ దత్తాత్రేయ సదానంద సిద్ధమఠాన్ని, జగదేవ్పూర్లో శివ పంచాయతన మందిరాన్ని, సంగారెడ్డిలో శ్రీమదనానంద మఠాన్ని, శ్రీమదనానంద సరస్వతీ స్వామివారి శిష్యులతో ప్రారంభింపజేశారు.
లకుడారంలో హరిహర ఆలయాల జీర్ణోద్ధారాన్ని, అనేకానేక దేవాలయాల ప్రతిష్ఠలను, వైద్యశిబిరాలను, భక్త సంఘాల స్థాపనలను విరివిగా గావించారు. శ్రీ గురుమదనానంద సాంగ వేద విద్యాలయం, అన్నోజిగూడలోని శ్రీ గాయత్రీ పీఠం, శ్రీ గురుమదనానంద సరస్వతీ విద్యాలయం, ఆనంద సాధనమ్ అనే పత్రిక శ్రీ స్వామివారి ఆశీరనుగ్రహంతో విలసిల్లిన సంస్థలు, సేవలు. అనేకమార్లు సహస్ర సత్యనారాయణ వ్రతాలు, లక్ష బిల్వార్చనలు, శ్రీ హనుమద్యాగం, శ్రీ రుద్రయాగం, కోటి బిల్వార్చనం, శ్రీ కాశీ మహాక్షేత్రంలో 60 మంది బ్రాహ్మణులతో రెండు నెలల పాటు నిరంతర అన్నదాన సహిత మహారుద్రయాగం, శ్రీ విష్ణుయాగం, శ్రీ శతచండీ యాగం మొదలగు లోకోపకార కార్యాలను నిర్వహించారు.
స్వామివారు కాశీ నగరంలో చాతుర్మాస్య వ్రతాన్ని అనుష్ఠించి కనీవిని ఎరుగని రీతిలో రుద్రయాగాన్ని వైభవోపేతంగా జరిపించారు. కాశీవాసులెందరో శ్రీ స్వామివారిని దర్శించి ముగ్ధులై వారివద్ద ఉపదేశం పొందారు. ఈ సందర్భంగా గంగా ఘాట్లో స్వామివారిని పడవలో కూర్చుండబెట్టి కాశీవాసులు పూజించిన ఘట్టం మన తెలంగాణకు గర్వకారణం. ఎందుకంటే ఒక జగద్గురువులకు మాత్రమే దక్కే ఈ సన్మానం శ్రీ కృష్ణానంద స్వాములవారికి జరగడం విశేషం. ఇదే సందర్భంలో ఉత్తరాంచల్కి చెందిన శ్రీ గోవిందాశ్రమ స్వామీజీ తమ శిష్యగణంతో విచ్చేసి శ్రీ కృష్ణానంద స్వామివారికి ‘మహంత పద్మవిభూషణ’ అనే బిరుదు ఇచ్చి అభిషేకించి సన్మానించారు. ‘
త్యాగేనైకే అమృతత్వ మానశుః’ అని వేదమాత ఘోషిస్తున్నది. ఒక్క త్యాగం వల్లనే అమృతత్వం సిద్ధిస్తుందని తాత్పర్యం. అంటే ఎక్కడ త్యాగం ఉంటుందో అక్కడ యోగభోగాలు తాండవిస్తాయి. అమృతత్వాన్ని ప్రసాదిస్తాయి. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా శ్రీ కృష్ణానందస్వామి వారిని వారు స్థాపించిన గురుమదనానంద సరస్వతీ పీఠాన్ని పేర్కొనవచ్చు. శ్రీ స్వామివారు శ్రీరామశైలేశ్వర శర్మగారిని అనుగ్రహించి వారికి సన్యాసదీక్షను ప్రసాదించి ‘శ్రీ మాధవానంద సరస్వతీస్వామి’ అనే యోగపట్టాన్ని అనుగ్రహించి మనకు ఒక స్వామిని అందించారు. ‘
సాధనాత్ సాధ్యతే సర్వమ్’ అనే మహావాక్యాన్ని ఉపదేశిస్తూ తాను ఆచరించి, ఇతరులకు ఉపదేశించిన మహనీయ మూర్తులైన శ్రీశ్రీశ్రీ కృష్ణానంద సరస్వతీస్వామి వారు, చివరి ఘడియలలో తమ అంతిమ సమయాన్ని సూచించి మౌనంలోకి వెళ్లిపోయి అనుక్షణం ప్రణవనాదంతో పాటు ‘నారాయణ’ స్మరణ చేస్తూ తమ 76వ ఏట పార్థివ నామ సంవత్సర మార్గశిర బహుళ చతుర్దశి, (29.12.2005) మాసశివరాత్రి పర్వ సమయంలో బ్రహ్మీభూతులైనారు.
Krishnananda Saraswati Swamy: The Embodiment of Spiritual Sadhana – Sadhana Sadhyate Sarvam
Divine Incarnation of Sadhana Sarvasvam
Niratanannadana Vratas (lifelong food donors) and unparalleled Guru Seva experts who proclaimed to the world “Sadhana Sadhyate Sarvam” (Everything is achievable through Sadhana) – the Satva Sadhana Sampanna, Mahant Padma Vibhushan, Paramahamsa Parivrajaka Acharya Sri Sri Sri Krishnananda Saraswati Swamiji.
The sacred Metuku Seema of Telangana – birthplace of countless Mahatmas, Yogis, Avadhutas, Bhaktas, Sannyasis, scholars, poets, artists, and warriors – shines with divine glory. Born in the Vedic Sadachara-rich Parnandi Vansham in Toguta, Siddipet Revenue Division, Medak District, he manifested as Sri Guru Madanananda Saraswati Peethadheeshwara, completed his mission, and attained Brahmi Bhoota state as Sri Krishnananda Saraswati Swamiji – forever memorable.
Early Life & Pious Upbringing
Swamiji’s poorvashrama name was Parnandi Janakiram Sharma. Born as dattaputra (adopted son) to Smt. Sheshamma and Brahmasri Parnandi Pattabhiramayya couple. From childhood, he exhibited sneha (affection), saushilya (gentleness), and karyakushalata (efficiency), earning widespread acclaim.
He masterfully transformed life’s odiduduku (ups and downs) with dharmabadha and positive approach. Daily Sri Vidya Samarachana, monthly Ekadasha Rudra rotation, Shata Rudriya parayana, and constant Daiva Chintana defined his life.
Born on Angirasa Nama Samvatsara Bhadrapada Bahula Padyami, his Guru was Brahmasri Vithala Chandramoulishastri of Chunchankote, Warangal District. Through Guru, he received Sri Vidya Diksha and served Sri Bhuvaneswari Mata, attaining Her grace.
12-Year Ekadheeksha Sadhana
From 1978, conducted monthly Shata Rudra Yaga and weekly Sri Satyanarayana Vrata for 12 years in ekadheeksha (uninterrupted focus). Once performed 40-day continuous Shata Rudrabhisheka & Homa daily, earning Sadashiva Anugraha.
Renovated Sri Bhavani Ramalingeshwara Swamy Temple in native Toguta into a magnificent shrine. In 1958-59, per Namile Ramachandramurthy of Venkataravupeta’s sankalpa, established Sri Ramalingeshwara Sanskrit Gurukula Pathashala in Toguta. Served as strategist, hostel warden, stabilizing it through personal diksha-shakti. Countless students became Sanskrit-Andhra Pandits, securing government teaching positions with great fame.
Guru Bhakti & Sannyasa Deeksha
As Telugu Pandit, taught in various schools, captivating students with panditya prakasha teaching. Present Peethadheeshwarulu were also his poorvashrama shishyas – fondly remembered as “Sharma Saar”.
Married Vardhanamma from Jagadevpur (passed away untimely), then Saraswati Bayi from Siddipet. Three sons blessed this union. Lived selflessly for others, enduring betrayals with guru-like courage, never deviating from Dharma Patha.
In Shreemukha Nama Samvatsara, after wife’s demise, entrusted responsibilities to sons, immersed in vairagya and daiva dhyana. Served Aparashiva Avatara Sri Madanananda Saraswati Swamiji as antevasi, accumulating sannyasa sadhana sampatti.
Guru Madanananda Sharada Kshetra Foundation
Per Guru Agya, performed shankusthapana for Sri Guru Madanananda Sharada Kshetra in 1995 at Rampuram (Toguta vicinity, Kondapak Mandal). Tirelessly labored till temple completion.
On Feb 24, 1999 (Bahudhanaya Magha Bahula Dashami), grandly pratishthapana of Devata Moortulu. With Guru, established Sri Bhavani Ramalingeshwara Seva Samithi, conducting Shata Rudrabhisheka Pooja in one village monthly for 4 years.
Guru Madanananda, thoroughly testing, bestowed Sannyasa Deeksha on June 30, 1997 (Ishwara Nama Jyeshtha Bahula Ekadashi) with Mahavakya Upadesha, naming him Sri Sri Krishnananda Saraswati Swamy – establishing in Turiya State.
Unique Temple Complex Achievements
Telangana’s first – nay, Bharata’s first – Navagraha Devlayam with Adhidevata-Pratyadhidevata Karma Sadguna Moortulu. Installed Spatika Linga (Koti Linga pratinidhi) as Sri Bhavani Chandramoulishwara Yogalingeshwara Swamy.
Separate temples for Sharada Devi, Panchamukha Anjaneya, Dattatreya, Jagadguru Shankaracharyulu. Ganapati, Gayatri Mata, Dakshinamurthy, Shanishchara, Santan Nagaishwara – all devatas grace this sacred space. Local sadhus, Brahmi Bhoota Sri Nirvikalpananda Saraswati Swamiji, leaders, devotees, villagers perfected kshetra nirmanam flawlessly.
Mahayagas & Loka Kalyana
Under Swamiji’s leadership, 2002: 2000 Brahmana Uttamas + 2000 bhaktas completed Shata Koti Gayatri, Hare Rama Nama Mahamantra. Culminated in 18-day Mahayaga with 400 Ritvikkulu.
Established annadana satram at Nachigiri Sri Narasimha Swamy Devastanam for continuous feeding. Renovated Harihara temples in Lakudaram, Panchayatana Moortulu in Palepahad, Dattatreya Sadananda Siddhamatham in Kodavaturu, Shiva Panchayatana in Jagadevpur, Shrimadanananda Matham in Sangareddy with shishyas.
Vaidya shibirs, bhakta sanghas flourished everywhere. Sri Guru Madanananda Sangha Veda Vidyalayam, Gayatri Peetham Annojiguda, Anand Sadhanam magazine – all blossomed under Swamiji’s ashirvada anugraha.
Grand Yagas Across Bharat
Sahasra Satyanarayana Vratas, Laksh Bilvarchana, Hanumad Yagam, Rudra Yagam, Koti Bilvarchana. Kashi Mahakshetram: 60 Brahmanas, 2-month continuous annadana + Maharulra Yagam, Vishnu Yagam, Shata Chandi Yagam.
Performed Chaturmasya Vrata in Kashi with unprecedented Rudra Yagam. Kashi vasulu darshana, receiving upadesha. Ganga Ghat: Placed Swamiji in boat for pujan – Telangana’s eternal pride! Only Jagadgurus receive such honor.
Sri Govindashrama Swamiji (Uttaranchal) with shishyas conferred “Mahant Padma Vibhushan” title and abhishekam.
Sadhana Sadhyate Sarvam – Eternal Legacy
“Tyagenaike Amrutatva Manasu” – Vedamata declares: Renunciation alone grants immortality. Where tyaga exists, yoga-bhoga tandavam follows. Krishnananda Swamiji – living testament!
Blessed Shri Ramashaileshwara Sharma with sannyasa deeksha, naming Sri Madhavananda Saraswati Swamiji – gifting us a Swamiji.
Proclaimed “Sadhana Sadhyate Sarvam” mahavakya through achara-upadesha. In final moments, entered mauna, with Pranava Nada + Narayana Smarana, attained Videhamukti on 76th year, Parthiva Nama Margashira Bahula Chaturdashi (Dec 29, 2005) – Maha Shivaratri!