శ్రీ మాత్రే నమః..!!🙏
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి
అమ్మవారు దుర్గాదేవి.
ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
పగటి వేళలో సూర్య నేత్రంతోను ..
సంధ్యా సమయంలో అగ్ని నేత్రంతోను ..
రాత్రి సమయంలో చంద్ర నేత్రంతోను
ఆ తల్లి లోకాలను దర్శిస్తూ ఉంటుంది.
ఆ మహా శక్తి స్వరూపిణి అధీనంలోనే
ప్రకృతి శక్తులన్నీ నడుస్తుంటాయి.
సమస్త దేవతా స్వరూపమైన దుర్గాదేవిని దేవతలు .. మహర్షులు అనునిత్యం పూజిస్తుంటారు.
దుర్గాదేవి పాదాలను అత్యంత భక్తి శ్రద్ధలతో
ఎవరైతే ఆశ్రయిస్తారో,
అలాంటి వారిని ఆ తల్లి ఒక రక్షణ కవచంగా
కాపాడుతూ ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
దుర్గా అనే నామం రెండే అక్షరాలూ అయినప్పటికీ,
ఆ నామానికిగల శక్తి అంతా ఇంతా కాదు.
సమస్త లోకాలను ఈ రెండు అక్షరాలే రక్షించగలవు.
ఆ తల్లి నామాన్ని అనునిత్యం స్మరించడం వలన,
సమస్త పాపాలు హరించబడతాయి.
ఆపదలో వున్నవారు దుర్గా నామాన్ని స్మరించడం వలన, వాటి నుంచి గట్టెక్కుతారు.
అనారోగ్యాలతోను ..
ఆర్ధికపరమైన సమస్యలతోను
ఇబ్బందులు పడుతున్నవాళ్లు,
ఆ తల్లి నామాన్ని స్మరించడం వలన
వాటి నుంచి విముక్తిని పొందుతారు.
దుర్గా నామాన్ని స్మరించడం వలన
గ్రహసంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయి.
ఈ శ్లోకం చాలా శక్తిమంతమయిన శ్లోకం.
దుర్గాదేవికి సంభందించిన 32 నామాలు
ఇందులో ఉన్నాయి .
ఈ శ్లోకం దుర్గాసప్తసతిలో కనిపిస్తుంది .
ఈ శ్లోకాన్ని ఎవరు రోజూ చదువుతారో
వారు అన్ని భయాలనుంచీ కష్ఠాలనుంచీ విముక్తులవుతారు.
సర్వస్వరూపే సర్వేశి సర్వ శక్తి సమన్వితే
భయే భస్ర్తాహినో దేవి దుర్గేదేవి నమోస్తుతే.!!
శీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలా.💐
దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వి నివారిణీ
దుర్గమచ్ఛేదినీ దుర్గా సాధనీ దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానగా దుర్గదైత్యలోక దవానలా
ఓం దుర్గమాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
ఓం దుర్గ మజ్ఞాన సంస్థానా దుర్గ మధ్యాన భాసినీ
ఓం దుర్గ మోహాదుర్గ మగాదుర్గమార్ధ స్వరూపిణీ
ఓం దుర్గమాసుర సంహంత్రీ దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గ ధారిణీ
నామావళి మిదం యస్తు దుర్గయా మమ మానవః
పటేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశయః.
💐శ్రీ మాత్రే నమః💐