సంతాన నాగేశ్వర మరియు ఆంజనేయ సహిత శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం | కొల్చారం కోలాచలం పుణ్యభూమి మల్లినాథాది సత్పురుషులు నడయాడిన నేల, మదనాందాది యతీంద్రుల పాద స్పర్శచే పునీతమైన నేల. ఎక్కడ తవ్విన ను ఆనాటి చారిత్రిక సాంస్కృతిక ఆనవాళ్ళు లభించే కర్మభూమి.
పూర్వులు ఏనాడో నిర్మించిన శివాలయం శిధిలం అవగా దానిని పునర్నిర్మించాలని సత్సంకల్పం చేసినారు మన పురజనులు. సర్వ శుభంకరుడు ఆ పరమేశ్వరుడి తోపాటు శ్రీశైలం అడవుల్లో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చినా, కనపడని ఆ జగన్మాత పరమేశ్వరి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఇష్టకామేశ్వరి స్వరూపమై ప్రతిష్టించబడినది. వీరితోపాటు శివపంచాయతనం లో భాగంగా గణేశా, సూర్య, విష్ణు భగవాను లు మరియు ఆంజనేయ సంతాన నాగేశ్వరులను భక్తితో నిలుపుకున్నారు.
కరుణాస్ఫురమ్ ఆయన మందహాసమే సకల సకల కల్మషాల్ని కడిగేస్తుంది. ఆయన వచనమే మనలో స్ఫూర్తిని రగిలిస్తోంది. హైందవ ధర్మానికి ఒక కొత్త వెలుగు. మంచిని ధైర్యంగా ఆచరించడమే దైవత్వం అని నిరూపించిన దివ్య మూర్తి. ఆయనే శ్రీ మదనానంద శారదా క్షేత్ర పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మాధవానంద సరస్వతి యతీంద్రుల మహదా ఆశీస్సులతో మెదక్ జిల్లా కొల్చారం గ్రామ ప్రజల సహకారంతో విశ్వకళ్యాణం అర్థమై ఈ ప్రతిష్టాపన జరిగి నది స్వస్తిశ్రీ చాంద్రమాన వికారి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గుణ శుద్ధ నవమి బుధవారం తేదీ 4 3 2020 నుండి ఏకాదశి శుక్రవారం తేదీ 6 3 2020 వరకు కొల్చారం గ్రామంలో నిర్మింపబడిన దేవాలయంలో గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ శ్రీనివాస శర్మ శర్మ గారి పర్యవేక్షణలో. వేదో తమ్ముళ్లు శ్రీ దిగంబర శర్మ గారి ఆధ్వర్యంలో. ఆరు గొండ శ్రీధర్ గుప్తా మరియు 6 గొండ కృష్ణమూర్తి గుప్త గార్లు ముందుండి శ్రీ సంతాన నాగేశ్వర స్వామి శ్రీ ఆంజనేయ సహిత శివ పంచాయతన మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిపినారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కలశస్థాపన గణపతి పూజ గురుపూజ మూలమంత్ర హవనము ఊరేగింపు దేవతారాధనలు జలధి వాసము, ధాన్యాదివాసము పుష్పాది వాసం, శయ్య ఆది వాసం వాసము మూలమంత్ర హవనము మొదలగు కార్యక్రమాలు పాటు నిరంతర అన్నదానము అఖండ భజన జరిగినది.
అతి వైభవంగా, అతి ఘనంగా జరిగిన ఈ పుణ్య కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిస్తున్న మీకందరికీ ఆ ఇష్ట కామేశ్వరీ సమేత పరమేశ్వరుడు సకల శుభాలను కలిగించాలని ఆకాంక్షిస్తూ — మీ పవన్