Yathra

శ్రీ శరభేశ్వరస్వామి ఆలయం,తిరుభువనం,తమిళనాడు


హిరణ్యకశిపుడిని చంపి, ప్రహ్లాదుణ్ణి రక్షించటానికి మహావిష్ణువు నరసింహావతారం ఎత్తినట్లు మనందరికీ తెలిసిన విషయమే. హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత మన కధల ప్రకారం నరసింహుడి ఉగ్ర రూపాన్ని మహాలక్ష్మి శాంతింప చేస్తుంది. కానీ తమిళ నాట ప్రచారములో నున్న కధ ప్రకారం…
హిరణ్యకశిపుడి రక్తం నరసింహస్వామి శరీరంమీద, లోపల వుండి ఆయనని చాలా రౌద్రంగా చేసిందిట. హిరణ్యకశిపుడి రక్తం నేల మీద పడితే అనేక మంది హిరణ్యకశిపులు జన్మిస్తారుట. దానితో వాళ్ళు భయపడ్డారు. దానిని ఆపటానికి ఆయనని చల్లబరచటానికి దేవతలు శివుణ్ణి ప్రార్ధించారుట.శివుడు వింత రూపాన్ని ధరించాడు. సింహ ముఖం, మానవ శరీరం, పక్షి రెక్కలు, 8 కాళ్ళు, 4 చేతులతో ఆయన రూపం ప్రత్యక్షమయింది. ఆయన రెండు రెక్కలలో ఒక రెక్క ప్రత్యంగరాదేవి, రెండవది శూలిని దుర్గ అవతరించారు. ఆయన నరసింహుణ్ణి ఆకాశంలో భూమ్యాకర్షణ శక్తి పని చేయనంత ఎత్తుకు తీసుకెళ్ళాడు. ఆ ప్రదేశంలో శరభేశ్వరుడు నరసింహుడి శరీరాన్ని నొక్కి చెడ్డ రక్తమంతా బయటకి పోయేటట్లు చేశాడు. భూమ్యాకర్షణ శక్తి లేక పోవటంతో ఆ రక్తం కింద పడలేదు. శరీరంలోంచి చెడు రక్తం పోగానే నరసింహుడు శాంతించి శివుణ్ణి పూజించాడుట.శరభేశ్వురుణ్ణి పూజిస్తే నలుగురు దేవతలని పూజించినట్లే. శరభేశ్వరుని ఆకారంలో నలుగురు దేవతా మూర్తులు, శివుడు, కాళి, దుర్గ, విష్ణు వున్నారు. శరభేశ్వరస్వామిని పూజించటంవల్ల ఆరోగ్యం,మనసు చికాకులు,గ్రహదోషాలు తొలగిపోతాయి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *