Yathra

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం – #అంతర్వేది ,

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం – #అంతర్వేది , #సఖినేటిపల్లి మండలం , తూ. గో. జిల్లా

ఈ ఆలయం చాలా పురాతనమైనది స్పష్టంగా వినిపించే సముద్రహోరు, గోదావరి సముద్రంలో కలిసే చోటు కన్నులారా చూడవచ్చు ఇక్కడ. సముద్రపు నీరు, గోదావరి నీరు రెండు విడివిడిగా పారుతు ఇక్కడ కలుస్తాయి. ఆ ప్రదేశాన్నే అన్నా చెల్లెళుల గట్టు అంటారు. పశిష్ఠగోదావరి సంద్రంలో కలిసే సాగరసంగమస్థలం ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాల వేద ఘోష చుట్టూ పచ్చగా తలలూపుతూ కనిపించే కొబ్బరిచెట్ల నడుమ కొలువైన నరసింహ క్షేత్రం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం.

అంతర్వేది క్షేత్రం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. #త్రేతాయుగంలో రావణబ్రహ్మను సంహరించిన #శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి దర్శించుకున్న క్షేత్రం #ద్వాపరయుగంలో అర్జునుడు తీర్థయాత్రకు వెళ్తూ ఆగిన తీర్థం మన అంతర్వేది క్షేత్రం. వశిష్ఠ మహర్షి కోరికపై #శ్రీమహావిష్ణువు ధర్మపత్నీ సమేతంగా వెలసిన పుణ్యస్థలం. ఆలయనిర్మాణం చూస్తే పూర్వం మందపాటి కేశవదాసు అనే పశువుల కాపరి అంతర్వేది ప్రాంతంలో గొడ్లు కాసుకుంటుంటే ఒక ఆవు అక్కడ పుట్టలో పాలధారలు విటవటం చూసి భయపడ్డాడట. ఆ రోజు రాత్రి నరసింహస్వామి అతని కలలో కనిపించే తానుండే ప్రదేశం గురించి చెప్పడంతో అతను గ్రామస్థుల్ని కూడగట్టుకుని పుట్టను తవ్విచూడగా విగ్రహం లభ్యమైందని. అప్పుడు కేశవదాసు స్వామికి చెక్కలు, కర్రలతో మందిరం నిర్మించాడట అనంతర కాలంలో సప్తసాగర యాత్రకు వచ్చిన రెడ్డిరాజులు జాతి దారువుతో ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని బెండమార్లంకకు చెందిన కొపనాతి ఆదినారాయణ కుమారుడు కృష్ణమ్మ క్రీ.శ.1823లో నిర్మించి నట్లు శాసనాలు చెబుతున్నాయి. తొలుత పెద్దాపురం సంస్థా నాధీశుల అధీనంలో ఉన్న ఆలయం తర్వాత మొగల్తూరు రాజుల అజమాయిషీలోకి వచ్చింది. ఏటా మాఘమాసంలో అంతర్వేది నృసింహ స్వామి కల్యాణం అయిన తర్వాతనే స్థానికంగా పెళ్లిళ్లు జరుగు తుంటాయి. మాఘ మాసంలో స్వామివారి కల్యాణానికి ముందు ఎంత మంచి ముహూ ర్తం ఉన్నా పెట్టుకోరు. ఇది అనాదిగా సంప్రదాయంగా వస్తోంది.

స్థానిక పల్లిపాలెం గ్రామంలో అయితే 80 శాతానికిపైగా నృసింహ నామ ధేయులే కనిపించడం విశేషం. స్వామివారి కటాక్షం ఉన్నంతవరకూ ఏ ఉపద్రవాలూ తమ దరిచేరవని స్థానికుల నమ్మకం. ప్రపంచ వాస్తంగా సునామీ బీభత్సం చేసిన సమయంలోనూ ఈ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉండటానికి నరసింహుడి దయే కారణమంటారు.

ఈ క్షేత్రంలో కనిపించే మరో విశేషం. ఏటా మాఘమాసంలో కొద్దిరోజులపాటు సూర్యాస్తమయ సమయంలో కిరణాలు గర్భ గుడిలోని స్వామి వారి పాదాలను తాకుతాయి. ఆ దృశ్యాన్ని చూసి భక్తులు పులకించిపోతారు.

అది ద్వాపరయుగం.
శోభకృతు నామ సంవత్సరం. మాఘశుద్ధ అష్టమి.
ప్రత్యక్ష నారాయణుడు తీక్షణ కిరణాలతో వెలిగి పోతుండగా… ఆ మిట్టమధ్యాహ్నం వేళ అభిజిత్‌లగ్నంలో శ్రీమహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయాడు భీష్ముడు. ఆ పురాణ పురుషుడు మరణించిన రోజే… భీషాష్టమి. మరణించే ముందు కృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం మూడురోజుల తర్వాత వచ్చే ఏకాదశి ఆ కురువృద్ధుని పేరిట భీష్మఏకాదశిగా ప్రసిద్ధి పొందింది.

భారతీయ చరిత్రలో తండ్రి మాటకు తలొగ్గి శ్రీరాముడు రాజ్యాన్ని త్యజించి వనవాసంచేసి ఆదర్శపురుషుడైతే… …..
తండ్రి సుఖం కోరి సింహాసనాన్ని వదులుకుని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు భీష్మాచార్యుడు…..
అంపశయ్యపై నుండే విష్ణుసహస్రనామ కీర్తన చేసి ఆ స్వామికి ఇష్టమైన మాఘశుద్ధ ఏకాదశిని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడు ఆయన.

అంత్యకాలంలో హరినామస్మరణ చేస్తేనే మోక్షం లభిస్తుందని ప్రసిద్ధి. అలాంటిది ఆ వాసుదేవుణ్ణే ఎదురుగా పెట్టుకుని వేయినామాలతో కీర్తించిన అదృష్టవంతుడు భీష్ముడు. అవే అనంతరకాలంలో విష్ణుసహస్రనామాలుగా ప్రసిద్ధికెక్కడంవిశేషం. అందుకే భీష్ముడు మరణించిన మాఘశుద్ధ అష్టమినాడు, తర్వాత వచ్చే ఏకాదశినాడు విష్ణుసహస్రనామం పఠిస్తే సకల శుభాలు చేకూరుతాయని భావిస్తారు భక్తులు.

ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మరుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా తూర్పుగోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలంలో, వశిష్ఠగోదావరి మరియు సముద్రతీరానికి దగ్గరలో ఉన్న ఓ ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది. వశిష్ఠుడు ఇక్కడ యాగము చేసినందు మూలముగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి గాంచింది.

ఒకానొక సమయంలో రక్తావలోచనుడు అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వంతో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారివిశ్వామిత్రుడుకివశిష్ఠుడుకి జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువు ను ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా బీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తిని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా “రక్తకుల్య” అనే నది లోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహ స్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్య లోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధ మును శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.

నరహరి లక్ష్మీనృసింహ స్వామిగా వెలిసిన అంతర్వేదిలో నిర్మించిన
ఆలయం నిర్మాణ శైలి అధ్భుతం. ఆలయం మరియు ప్రాకారము రెండు అంతస్తులుగా నిర్మించబడి యాత్రికులు పైఅంతస్తుకు వెళ్ళి ప్రకృతి అందాలు తికించుటకు వీలుగా నిర్మించారు.ఆలయానికి దూరముగా వశిష్టా నదికి దగ్గరగా విశామైన స్థలమునందు కళ్యాణ మండపం నిర్మించారు. ఈ ఆలయం క్రీ॥శ 300 కు పూర్వమే నిర్మించ బడినదని చెబుతారు.

పూర్వాలయం శిధిలం కాగా ప్రస్తుత ఆలయం పెద్దపురం జమిందారు కుటుంబీకుడైన శ్రీ కొపనాతి కృష్ణమ్మగారి చే పునః నిర్మింపబడింది.

భీష్మ ఏకాదశికి ఇక్కడ అంగరంగ వైభవంగా ఉత్సవాలుజరుపుతారు.

ఈ ఉత్సవాలకు సుమారు 10 లక్షల మంది భక్తులు తరలి రావడం ఆనవాయి. 4 రాత్రి నిర్వహించ నున్న కల్యాణానికి, 5 న నిర్వహించనున్న రథోత్సవానికి, 8 న చక్ర స్నానానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాటు చేశామని , భక్తుల మనోభావాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించామని, ఇప్పటికే చలువ పందిళ్లు, భక్తుల దైవ దర్శనార్థం క్యూలైన్ల కోసం ప్రత్యేకంగా బారికేడ్ల నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నామని , అధికారులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు, ధార్మిక సంస్థల సేవకుల సేవలను సమన్వయంతో స్వామి వారి కళ్యాణ మహోత్సవాలైన కళ్యాణం, తీర్థం, రథోత్సవం, చక్రస్నానం నిర్వహించే రోజులలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతున్నామని ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ పేర్కొన్నారు.

అంతర్వేది దేవాలయానికి కొంచెం దూరంగా సముద్రానికి దగ్గరగా ఈ ఆశ్రమం నిర్మించబడినది.ఈ ఆశ్రమాన్ని వికసించిన కమలం మాదిరిగా 4 అంతస్తులలో నిర్మించారు. చుట్టూ సరోవరం మధ్యలో ఆశ్రమం అద్భుతంగా ఉంటుంది. దీనికి దగ్గరగా ధ్యానమందిరం, పఠనాశాల, యాగశాల, విశ్రాంతి మందిరం మొదగునవి కలవు. యాత్రికుల విశ్రాంతి కోసం పర్ణశాలవంటి అందమైన కట్టడాలు కలవు.

వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఉంటుంది. సర్వే తోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. ప్రయాణ సౌకర్యాల కొరత వలన, బీచ్ వరకూ సరియైన రహదారి లేకుండుట చేత దీనిని పెద్దగా అభివృద్ధి పరచలేదు. తీరం పొడవునా పరిశుభ్రంగానూ, స్వచ్ఛంగానూ ఉండి మనసుకు ఆహ్లాదం కల్పిస్తుంది. తీరంలో వశిష్టాశ్రమం ఉంది. సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
దీపస్తంభం (లైట్ హౌస్), గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్దికొద్ది దూరాలలో ఉంటాయి సముద్రతీరంలో విహరించవచ్చు

నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక (గుర్రాలక్క ) ఆలయం ప్రధాన దేవాలయము నకు ఒక కిలోమీటరు దూరములో ఉంది. మీరు ఓ సారి ఈ ప్రాంతాన్ని సందర్శించండి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *