నేను వెళ్ళే దారిలో….
మలుపులేన్నో….
మాయలెన్నో….
మాసిపొని గాయలెన్నో…..
అనుభవాలు ఆకులులా మారిన మనసులెన్నో….
రాళ్ల రప్పల తాకిడిలెన్నో….
స్వచ్చమైన స్నేహాలు ఎన్నో…
నిత్యమైన సంతోషాలు ఎన్నో….
పూల పిలుపులు ఎన్నో…
మధురమైన జ్ఞాపకాలేన్నో…..
మాటల సూదులతో దాడులెన్నో….
అపనిందలు సంద్రం మోస్తున్న కన్నీళ్లు ఎన్నో….
అవమానం వాకిట అర్త నాదాలు ఎన్నో….
అంగట్లో అంగడి బతుకులు ఎన్నో…..
కుచించిపోతున్న మానవత్వ హృదయాలు ఎన్నో….
సంకుచిత మైన స్వార్థ ఆలోచనలు ఎన్నో….
నక్షత్రాలు దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్న రాత్రులు ఎన్నో…..
వేకువకై చూసే ప్రకృతి అందాలు ఎన్నో….
అయినా ఆగని కాల గమనంలో…
చలించని…
చెదరని…
గుప్పెడు గుండె దైర్యం లో…..
నిట్టూర్పుల నిర్వేదం లో….
నేనొక నిశ్శబ్ద ప్రేరణను…..
Kavitha CT pally
మెదక్