Navagraha YanthraNavagraha Yanthram


        నవగ్రహ యంత్రాలు నవగ్రహ దోషాలు ఉన్నవారు, వాస్తు దోషాలు ఉన్నవారు, వ్యాపారాబివృద్ధి కొరకు, కుటుంభాభివృద్ధి కొరకు, ధనాభివృద్ధి కొరకు పూజా మందిరంలో గాని, తూర్పు, ఉత్తర, ఈశాన్య దిక్కుల యందు ప్రతిష్టించుకొని ధూప దీప నైవేద్యాలతో పూజించు వారికి నవగ్రహ బాధల నుండి విముక్తి కలుగుతుంది.  

సూర్య గ్రహ యంత్రం:- సూర్య గ్రహ యంత్రం పూజించటం వలన సూర్యగ్రహ దోష నివారణతో పాటు, గుండెజబ్బులు, అనారోగ్య, కంటిదోషనివారణకు, అభివృద్ధికి, గౌరవాలకు  తూర్పు దిక్కున గాని పూజా మందిరంలోగాని ప్రతిష్టించుకోవాలి. “ఓం హ్రాం హ్రీం సః సూర్యాయ నమః”అను మంత్రంతో జపం చేసి పూజించాలి.


చంద్ర గ్రహ యంత్రం:- చంద్రగ్రహ యంత్రం పూజించటం వలన చంద్రగ్రహ దోషాలతో పాటు, మానసిక ఆందోళనలు, మాతృ దోషం, ఉదర సంబంద దోషాలు, చంద్ర గ్రహ బాలారిష్ట దోషాలకు, కుటుంబ అభివృద్ధికి, ధనప్రాప్తికి, విజయానికి, సుఖాభివృద్ధి కొరకుఓం ఐం క్లీం సోమాయ నమఃఅను మంత్రంతో పూజాదులు నిర్వహించి పూజామందిరంలో స్ధాపించాలి.


కుజ గ్రహ యంత్రం:- కుజగ్రహ దోష నివారణకు, ఋణ బాధలు, వివాహ సమస్యలు, విద్యలో ఆటంకాలు, శత్రుబాధలు, వాహనప్రమాదాలు, కుజ దోష నివారణకు, సంకల్ప సిద్ధికిఓం ఐం హౌం శ్రీం ద్రాం కాం గ్రహాధి పతయే భౌమాయ స్వాహాఅను మంత్రంతో పూజాదులు చేసి పూజా మందిరంలో స్ధాపించుకోవాలి


బుధ గ్రహ యంత్రం:- బుధగ్రహ దోష నివారణకు, చర్మ సంబంధ సమస్యలు, జీర్ణక్రియలో లోపాలు, బుద్ధి వికాస దోషాలకు, విద్యాభివృద్దికి ,వ్యాపారాభివృద్ధికిఓం హ్రాం క్రోం జం గ్రహణాధాయ బుధాయ స్వాహాఅను మంత్రంతో పూజ చేసి పూజా మందిరంలోను, వ్యాపార స్ధలంలో ఉత్తర దిక్కున స్ధాపించాలి.


గురు గ్రహ యంత్రం:- గురుగ్రహ దోష నివారణకు, ధన సంపాదనకు, సంతాన దోష నివారణకు, కుటుంబ అభివృద్ధికి, గౌరవాభివృద్ధికి, ఉన్నత విద్యాభివృద్ధికిఓం హ్రీం శ్రీం బ్లీమ్ ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే నమఃఅను మూల మంత్రంతో పూజా మందిరంలో ఉంచి పూజ చేయాలి.


శుక్ర గ్రహ యంత్రం:- శుక్ర గ్రహ దోష నివారణకు, వైవాహిక దోష నివారణకు, దాంపత్యంలో అన్యోన్నతకు, గర్భాశయ దోషానికి, లలిత కళలయందు రాణింపు కొరకు, విద్యయందు రాణింపుకుఓం హ్రీం శ్రీం శుక్రాయ నమఃఅనే మంత్రంతో పూజ చేసి పూజా మందిరంలో స్ధాపించుకోవాలి


శని గ్రహ యంత్రం:- శని గ్రహ దోష నివారణకు, అపమృత్యుదోషనివారణకు, భాధలు, కష్టాలనివారణకు, పనులు ఆలస్య నివారణకుఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమఃఅనే మూల మంత్రంతో బ్రాహ్మణోత్తములచే పూజ చేయించుకొని పూజా మందిరంలో స్ధాపించుకోవాలి


రాహు గ్రహ యంత్రం:- రాహుగ్రహ దోషానికి, మానసిక ప్రశాంతతకు, చెడు సావాసాల నివారణకు, నాగ దోష, కాలసర్ప యోగ, బందన యోగ నివారణకు మోసపూరిత సహవాసం నుండి బయటపడటానికిఓం ఐం హ్రీం రాహవే నమఃఅనే మంత్రంతో పూజ చేసి పూజా మందిరంలో స్ధాపించుకోవాలి.


కేతు గ్రహ యంత్రం:- కేతు గ్రహ దోష నివారణకు దైవ చింతనకు, జ్ఞానాభివృద్ధికి, ధనాభివృద్ధికి, “ఓం కేతుం కృణ్వన్నకేతనే పేశో మర్యా ఆపేశసే సముషద్భిరజా యధాఃఅనే మూల మంత్రంతో పూజ చేసి స్ధాపించుకోవాలి.

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *