sriguru.org.in

స్నానపు గదులకు పాటించాల్సిన వాస్తు సూత్రాలు- Bath room vastu

ఇంటిలో పడకగదులనుబట్టి అటాచ్డ్ బాత్రూమ్స్, లెట్రిన్స్ వాస్తు రీత్యా ఏర్పాటు చేసుకోవాల్సివుంది. వాస్తు రీత్యా కాకుండా ఎలా పడితే అలా నిర్మంచుకోవడం వలన చెడు ఫలితాలు ఉంటాయి. ఇంటినంతా వాస్తు రీత్యా నిర్మించి వీటి విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే చెడు ఫలితాలే కలుగుతాయి. నైరుతీ మూలలో పడక గది, దానికి తూర్పువైపున దక్షిణపు గోడకు ఆనుకొని బాత్రూమ్ ఉండేటట్లుగా నిర్మించుకోవాలని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇందులో లెట్రిన్ పాట్‌ను దక్షిణగోడకు ఆనించి కనీసం ఒక అడుగైనా ఎత్తు ఉండేలా నిర్మించాలి. దక్షిణంవైపు గోడకే వెంటిలేటర్‌ను కూడా అమర్చుకోవాలి. బాత్‌రూమ్ తలుపును బాత్రూమ్ పశ్చిమ లేదా వాయువ్యంలో ఉంచాలి. నైరుతీ మూలన రెండు పడకగదులు, వాటికి ఆనుకొని బాత్రూమ్‌లు ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు… నైరుతిలో ఒక పడక గదిని కట్టి, దాని తూర్పు వైపున రెండు బాత్రూమ్స్ నిర్మించుకోవాలి. రెండోవ బాత్రూమ్‌ను ఆనుకొని తూర్పు వైపున మరొక పడకగదిని నిర్మించుకోవచ్చు.


Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *