sriguru.org.in
వాస్తు ప్రకారం గృహములో ద్వారముల నిర్మాణం

వాస్తు ప్రకారం గృహములో ద్వారముల నిర్మాణం

గృహాన్ని నిర్మించే సమయంలో సింహద్వారాన్ని(Maindoor )ఏ విధంగా వాస్తు ప్రకారం నిర్మిస్తామో, అదే విధంగా ఇతర ద్వారాలను కూడా నిర్మించాలి. దీనికి సంబంధించిన కొన్ని సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.
గృహానికి ముందు భాగంలో ఉన్న పశ్చిమనైరుతి గదికి పైభాగంలో ద్వారము కలిగి ఉండుట ద్వారా ఆ ఇంట్లో శుభాలు జరుగుతాయి. క్రింద భాగములో ద్వారములను నిర్మించుట ద్వారా రోగము- మరణములు సంభవించును. గృహములోని ముందుభాగములో దక్షిణ ఆగ్నేయ గదికి ఎగువ భాగములో ద్వారం నిర్మించి ఉన్నట్టయితే ఇంట్లోని పిల్లలకు అశుభం.

గృహానికి బైట ఉండే ఉత్తర వాయువ్య గదికి పైభాగమున ద్వారము నిర్మించినచో ఆ ఇంట్లోని వారు చేసే మంచి పనులతో కీర్తి ప్రతిష్టలు లభించును. గృహమునకు ముందుభాగములో తూర్పు- ఈశాన్య గదికి పైభాగములో ద్వారమును నిర్మిస్తే సద్గుణాలు లభించడమే కాక భోగభాగ్యాలు కూడా కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *