లలితా దేవి మంగళ హారతి (Lalitha Devi Mangala Haratulu)

వెలసితివమ్మ వెండి కొండ లో

ఓం శ్రీమాత్రెనమః
అమ్మవారి హారతి గాన నీరాజనం
వెన్నెల లోనవేడి ఏలనో రాగం
రచన, గానం జోషి విజయలక్ష్మి

చల్లని తల్లీ నీవే దైవము
యుల్లము లోనా నీదే రూపము నీలీల తెలియగ జాలము అది యంతో మాయాజాలము
చల్లని…..
అది యంతో…..
అది….

వెలసితివమ్మ వెండి కొండ లో
నిలువగ రావే నాదు గుండెలో
ఓ…ఓ…ఓ…
వెలిసితి ……
నాదు మొరా వినవేలా వదలని0క మీ పదమీవేళా
చల్లని…..
నీలిల ……

అమ్మ వు నీవై ఆదుకొమ్మనీ
నమ్మితి నమ్మ నీవే శరణ నీ
ఓ….ఓ….ఓ….
అమ్మవునీవై …..

చేకొనవే …హారతి నీ
లోక మాత చండూరు భవానీ
చల్లని…..
నీలీల తెలియగ…..2
అది యంతో…..3
ఆ ఆ ఆ..

శైలే0ద్ర ప్రియా …తనయా

శైలే0ద్ర ప్రియా …తనయా

ఓం శ్రీమాత్రెనమః
పార్వతీ దేవి మంగళ హారతి గాన నీరాజనం
రచన, గజవాడ హనుమంత ఆచార్యులు గారు
సేకరణ, గానం జోషి విజయలక్ష్మి

శైలే0ద్ర ప్రియా …తనయా
జయ మంగళ మిదేగొను
శైలేద్ర …..
బాలే0దు వదనా వినీలకుంతల జల ….2
ఫాలే0దు హిత వనమాలీ సోదరి మణి హిమ
శై లే…….
బాలె0 దు…..
శైల…..
శృ0గార మగు నీదు బంగారు ఛాయామేను
శృంగార మగు…….
నింగి మెరుపులను వంగా జేయు నుగద హిమ
శైలే0ద్ర…….2
ఎల్లా కాలము హరునిల్లాలమము మది…….2
అల్లా దుర్గవాసుల యుల్లామున నిలువుము హిమ
ఎల్లా…..
శైలే0ద్ర…….
శై లే…..
బాలే0దు….2
శైలే0ద్ర…..2

శ్రీ చక్ర వాసినీ శ్రీ త్రిపుర సుందరి

శ్రీ చక్ర వాసినీ శ్రీ త్రిపుర సుందరి

శ్రీ చక్ర వాసినీ శ్రీ త్రిపుర సుందరి
సౌందర్య లహరి శ్రీ జయ మంగళం
మాతృకావర్ణ స్వరూపిణీ మాత్రే మామంబ పురవాసీ జయమంగళం

ఆనంద భైరవ ఆనంద భైరవీ
ఆధార మూలస్థిత జయమంగళం
సమయాంబా శ్రీ సంవర్తక రూప
స్వాధిష్టాన స్థిత జయమంగళం

అమృతేశ్వరి శ్రీ అమృతేశ్వర రూప
మణిపూరాంత స్థిత జయమంగళం
హంసేశ్వరీ శ్రీ హంసేశ్వర రూప
అనాహతాబ్జ స్థిత శుభ మంగళం

వ్యోమకేశ్వరీ శ్రీ వ్యోమకేశ్వర రూప
విశుద్థి చక్ర నిలయ జయమంగళం
చిత్ఫరాంబా పరచిత్ రూపధర
ఆజ్ఞా చక్రాంత స్ధిత జయమంగళం

షట్ చక్రవాసిత శివశక్తాయుత
సహస్రార కమల స్ధిత జయమంగళం
క్షితి హుతా నిల ఉదక వ్యోమస్వరూపథర
పంచభూతాత్మక శుభమంగళం

ఆద్యంత రహిత శ్రీ ఆది శివ శక్యైక
ఆనందరూప శ్రీ జయమంగళం
సర్వజన హితకర సాంబశివ రూపధర
సాధుజన వత్సలే శుభ మంగళం
శ్రీచక్రవాసినీ శ్రీ త్రిపుర సుందరీ

శైల కుమారి హారతి గాన నీరాజనం

ఓం శ్రీమాత్రెనమః
శైల కుమారి హారతి గాన నీరాజనం
ఎవ్వరి కోసం ఈ మందహాసం రాగం, రచన, గానం జోషి విజయలక్ష్మి
🔔🔱🪔🔔🔱🪔🔔🔱🪔
జై వాసవి జై జై వాసవి
టైపింగ్ పొట్టి రెడ్డిజయలక్ష్మి శ్రీకాళహస్తి
🕸️🐍🐘🕸️🐍🐘🕸️🐍🐘

శైల కుమారి నటరాజ రాణి నీకిదె నీరాజనం
భవా…నీ నీకిదె నీరాజనం

కరుణా రూపిణి
జగదేక జనని కావవె కాత్యాయని
శివా….నీ కావవె కాత్యాయని
శైల……

ఆ ఆ తెలియగ లేను నీ దివ్య లీల
ఏలవే దీనుల సౌజన్యశీల
ఆ ఆ పిలిచిన పలికే దైవమ్ము నీ వు
తలచిన మదిలోన కనిపింతువీవు
జాలమదేలా ప్రేమావాల ….2
నన్నేలు కొనుమా కవితా సుమ మాలా
శైల కుమారి…..

ఓ ఓ లీలా రూపిణి ఓ కన్న తల్లి
శ్రీ లలితా దేవి అనురాగవల్లి

ఆ ఆ ఇల లో చండూరులో వెలిసి నావా కొలిచే నీ సుతులనే ఏల రావా
నీ చరణాలే నమ్మితి నమ్మ….2
నీ చల్లని నీడ నన్ను నిలవ నిమ్మ
శైల కుమారి….
కరుణా…..
శైల….

త్రిభువనేశ్వరి.అఖిలాండేశ్వరి

త్రిభువనేశ్వరి,అఖిలాండేశ్వరి,
ఆది పరాశక్తి పాలించవమ్మా,
జగత్కారిణి, జగన్నుత రూపిణి,
జగన్మాత మము కరుణించ వమ్మా….

ఏ పేరున పిలిచినా పలికేవు నీవు,
ఏ రూపమున కొలిచినా కరుణ జూపెవు,
తల్లివి నీవే ఎల్ల జీవరాసులకిల,
నీ చల్లని చూపే మాకిక శరణం…

శ్రావణ మాసాన వరలక్ష్మిగా నిను పూజించేము,
ఆశ్వయుజాన దుర్గగా నిను కొలిచేము,
కార్తీకాన శివ కామేశ్వరిగా వేడుక చేసేము,
నిత్య పూజ లందుకొని నిరతము కాపాడు మమ్ము..

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

విశ్వ జననివే,కారుణ్య జలధి వే,

విశ్వ జననివే,కారుణ్య జలధి వే,
కమనీయ రూపిణి శరణా తరంగిణి…

నిరుపమ గుణ శాలివే సత్య సంధాయినివే,
నిత్య కాంతి ప్రదాయిని, నిగమాగమ సంచారిణి,
వేడుకొన్న చాలు కోరుకున్న వరాలిచ్చు,
కామిత వరదాయిని కాత్యాయని శివకామిని..

అనుపమ శక్తి శాలివే,శివ అంతరంగ నివాసిని,
చింతలన్నీ బాపే చిద్రూపిణి వే,
చింతాక్రాంతమైనచిత్తములకు సాంత్వన కూర్చే,
కాంతార వాసిని శాంతి స్వరూపిణి విశ్వ జనని…

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి.

శివ నారీ..భవభయ హారీ

శివ నారీ..భవభయ హారీ

శివ నారీ.. భవ భయహరీ,
శుభములు కూర్చవే శుభంకరీ..

సృష్టి కి మూలం నీవే తల్లీ,
శక్తి కి మూలం నీవే అన్నిటికీ,
కష్టము సుఖము అన్నీ నీ ఆటలే,
పరిపుష్టత మా బ్రతుకుల కలిగించవమ్మ…

కోరము నిన్ను సిరులు సంపదలు,
కోరుకొందుము శాంతి సౌఖ్య ములు,
నిరతము నిన్నే కొలిచెద మమ్మా,
సతతము మాపై నీకరుణ జూపవే…

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

నా తల్లి లలితా సతీ హారతి

నా తల్లి లలితా సతీ హారతి ….2
మాతా దయా సమేతా శ్రీ భగవతీ
నా తల్లి….

మోహ పిశాచమ్ము పూనుటే దుర్మతి
దేహమే నేన0చు తెలియంగ నైతి
మోహ….
సోహ మిత్యను భూతి శుద్ధాత్మ సద్గతి
సో హ…..
అహ నాకిడ ప్రీతి అవు నీకు విఖ్యాతి
అహ……
నా తల్లి….2

సత్య జ్ఞానానంద సమతా కలితవై
స్తుత్య చుంచనకోట శుద్ధాంత గత వై
సత్య……
ప్రత్యుపకారాది వాంఛా రహితవై
నిత్య మేలుము మమ్ము నిఖిలాత్మ హితవై
ప్రత్యుపకా….
నా తల్లి…..2
మాతా……
నాతల్లి….
అమ్మా……
నాతల్లి……3

లలితా త్రిపుర సుందరి

లలిత లావణ్య రూపిణి వే,
లలితా త్రిపుర సుందరి వే,
శరన్నవరాత్రులలో నీ అలంకారం,
కూర్చును జగత్తుకు శోభాయ మానం..

ఎంతటి సౌకుమార్యమో నీ రూపం,
అంతటి భయానక శక్తి
వంతం నీ తేజం,
నీ సాధన లో తొలగు సకల మాయలు,
నీ సాధన లో దొరకు జ్ఞానము, మోక్షము…

ఉపాసకులకు అత్యంత ప్రియం నీ అవతారం ,
కార్య సిద్ధి కి నీ ఉపాసన ఇచ్చును త్వరిత ఫలం,
నియమ నిష్ఠ ల తో నిన్ను కొలిచిన,
సఫలము కార్యమ్మిక శీ ఘ్రగతిని..

లలితా సహస్ర నామావళి
నిత్య పఠనం
ఒన కూర్చు అధిక ఫలం

హామీ. ఇది నా స్వంత రచన, దేనికి అనుకరణ అనుసరణ కాదు

చెరుకు పల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

నవోన్మేష శాలినీ నవనీత హృదయినీ

నవోన్మేష శాలినీ నవనీత హృదయినీ

రచన
సాయి క్రిష్ణ యాచేంద్ర గారు

సంగీతం
ఎల్ క్రిష్ణన్

గానం
పి సుశీల గారు

నవోన్మేషశాలినీ నవనీత హృదయినీ

నవ దుర్గా రూపిణీ పాలయమాం

నవ శక్తీ కారిణీ పాహిమాం

||నవ నవోన్మే||

చరణం

శైలపుత్రి కాళరాత్రి బ్రహ్మచారిణీ

చంద్రఘంట స్కందమాత కాత్యాయనీ

సిధ్ధిధాత్రి కూష్మాండ మహా గౌరీ

జయ జయ జయ చండాసుర భంజనీ

||నవోన్మేష||

చరణం

భ్రమ్మణీ శ్రీలక్ష్మీ రక్తదంతికా

శ్రీ దుర్గా చాముండీ మహా కాళికా

శోక రహిత శివ దేవీ కార్తికీ

జయజయజయ మహిషాసుర మర్దనీ

||నవోన్మేష||

చరణం

ప్రభా మాయ జయసూక్ష్మ త్రిశుద్ధా

నందిని సుప్రభ విజయా సిద్ధిదా

అనంత నామధారిణీ అఖండ విజయకారిణీ

జయజయజయ నవ శక్తి స్వరూపిణీ

||నవోన్మేష||

శ్రీ చందిర కిరీట

ఓం శ్రీమాత్రెనమః
అమ్మవారి హారతి గాన నీరాజనం
సేకరణ గానం జోషి విజయలక్ష్మి
🔔🔱🪔🔔🔱🪔🔔🔱🪔
టైపింగ్ పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి
🕸️🐍🐘🕸️🐍🐘🕸️🐍🐘

శ్రీ చందిర కిరీట శ్రీ చందిర కిరీట సర్వమంగళ జయశుభమంగళ మే
దినహినాను క0పాదీక్షా విధిలో

నీదేపైచేయి సుమ్మా…..2
శ్రీ చందిర……2

లోకాలన్నీ నీ కారుణ్యము చే మనునోయమ్మ….
లోకా……
దయ తల0చీ ఈదారి తప్పిన
తనయుల మోయమ్మ ….
దయ…..
నీ తనయుల మోయమ్మ
శ్రీ చందిర……2

కొలిచిన వారికి కొండలుగా
తలచిన వారికి తండలు గా
కొలచి……
కొలచి ఇచ్చెదవు కొల్లకొల్లగా కొడుకుల మోయమ్మ
కొలచి ఇచ్చదము …..
నీ కొడుకు ల మోయమ్మ
శ్రీ చెందిర….2

శాస్త్రులాన్వయమ్ము ప్రభాన్వితమ్మై చల్లగ వర్ధిల్లు కొనసాగుట కై
శాస్త్రు…….
విశ్వరూప నిను వేడుకొనియద
విశ్వమెల్ల నీ వేడుకయె కదా
విశ్వరూప…..
శ్రీ చందిర కిరీటా….2
దిన…..
శ్రీ చందర…..2
నీదేపైచేయి సుమ్మా…..3

కర్పూర నీరాజనం సురపాల

ఓం శ్రీమాత్రెనమః
అమ్మవారికి హారతి గాన నీరాజనం
సరిలేరు నీ కెవ్వరూ రాగం
రచన జోషి విజయలక్ష్మి
🪷🪕🔱🪔🪷🪕🔱🪔🪷🪕🔱🪔
జై వాసవి జై జై వాసవి
టైపింగ్ పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి
🕸️🐍🐘🕸️🐍🐘🕸️🐍🐘
కర్పూర నీరాజనం సురపాల మోహిని కర్పూర నీరాజనం
కర్పూర…..
జనని, భవానీ, శివానీ, కళ్యాణీ …..
జనని….
కర్పూర…….

శ్రీ రాజరాజేశ్వరి శ్రీ త్రిపుర సుందరి శ్రీ రాజ రాజేశ్వరి
శ్రీ రాజరాజేశ్వరి…..
గిరి రా కుమారి శంకరునీ దేవేరి…2
శ్రీ రాజరాజేశ్వరి….

జగముల చల్లని చూపుల పాలించి ఆ ఆ ఆ
జగ ముల……
శత్రువు లదరంగ శంఖారవము చేసి
జగముల…..
దుష్టుల శిక్షించి,శిష్టుల రక్షించి…2
సురలను లాలించి పాలించి నావు
కర్పూర……

శ్రీ దేవివైనావు శ్రీ విష్ణు హృదయా న
వాగ్దేవి వైనావు ఆ బ్రహ్మ సుముఖా న ఆ ఆ ఆ
శ్రీ దేవి….
శ్రీ గౌరినీవే శివునర్ధభాగాన …2
ముజ్జగమ్ముల నేలు మూర్తిత్రయా న
శ్రీరాజరాజేశ్వరి…..

సంగీత మందు సాహిత్య మందు అలరించు తల్లి నీవే
ఆ నింగి లోన ఈ నేల యందు నెల కొన్న తల్లి నీవే ……….
సంగీత…..
మణిద్వీప మందు నీవే, అణు వణువు నందు నీవే ….
చండూరు దేవీ నీ అండ జేర్చుకోవే
సర్వ0నీవే సకల0నీవే
కర్పూర…..

త్రిభువన పాలిని నీవే దేవీ

ఓం శ్రీమాత్రెనమః
శ్రీ భువనేశ్వరి దేవి మంగళ హారతి గాన నీరాజనం
త్రిభువన పాలిని నీవే
లలిత కళా రాధనలో రాగం
రచన గానం జోషి విజయలక్ష్మి
🔱🪔🔱🪔🔱🪔🔱🪔🔱🪔
జై వాసవి జై జై వాసవి
టైపింగ్ పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి
🕸🐍🐘🕸🐍🐘🕸🐍🐘

త్రిభువన పాలిని నీవే దేవీ
శ్రీ భువనేశ్వరివే ……
త్రిభు……
హే భవానీ అభయము నీవే….2
శుభ మంగళ హా..రతిగొనవే
త్రిభు…….

మాహేశ్వరి గా మాతంగి గా
మహిషాసుర సంహారిణి గా
మాహేశ్వరి……
మహా కాళివి నీవేగా
మహిమలెన్నియో జూపించగా
మహాకాలళి…..
నీదుచరితమె మహిమా..న్వితం..2
మాకొసంగుము నీ కృపా0..మృత0
త్రిభు……

శ్రీశైలంబున భ్రమరాంబికా కామిత మీడేర్చ గా……..
శ్రీశైల……
వీణా వేణువు నాదమ్ము లతో దేవత లే కొలువగా….
వీణా…….
కన్నుల విందౌ నీ రూపము…..2
గాంచిన వారిదే జన్మ ధన్యము
త్రిభు…….

మణిద్వీపమ్మున మహారాజ్ఞి గా వెలిసీ నీవే యున్నావు గా……
మణి……
కొల్హాపురమున మహాలక్ష్మిగా సిరుల జల్లులే కురిపించగా…..
కొల్హాపూర……
శృంగేరిన శ్రీ శారదా0బికా……2
కవితాఝరులే పొంగిపోయెగా
త్రిభు……
హే……2
త్రిభు…..

**ముగ్గురమ్మల మూలపుట మ్మ **

ముగ్గురమ్మల మూలపుట మ్మవే,
ముజ్జగములేలేటి జగద్ధాత్రి వే,
అమ్మ వై నిలిచితివి అఖిల లోకాలకు,
చెకొమ్మ మా ప్రణామం శుభ శుక్రవారమున..

మున్నీట జనియించిన కమలాసని వే,
గిరిరాజా సుత గిరిజా మాత నీవే,
వీణా పుస్తక ధారిణి శ్రీ వాణి నీవే,
వేద మాత గాయత్రి, యాగ ప్రియ చండి వే…

దుర్గావతారమున మహిషా సురు మట్టు పెట్టితివే,
నరకాసురుని సంహరింప సత్య భామ వైతివి,
సౌశీల్యముతో దశకంఠని
మట్టు పెట్టించితివే,
పేరేదైనా, రూపేదైనా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నీ లక్ష్యం..

చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

Lalitha Devi Mangala Haratulu

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *