sriguru.org.in
భూమి పూజ

భూమి పూజ

గృహ నిర్మాణం సమయంలో ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి భూమి పూజ. దీనిని శంకుస్థాపన అని కూడా అంటారు. మన పంచభూతాల సమన్వయంతో నిర్మించ తలపెట్టిన గృహ నిర్మాణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చిరకాలం ఈ భూమిపై నిలవాలనే ఆకాంక్షతో భూదేవిని ప్రార్థిస్తూ చేసే పూజే భూమి పూజ.

ఈ గృహారంభ పూజా కార్యక్రమం జరపటానికి ముందుగా ఈశాన్యం దిశలో గుంతని త్రవ్వించాలి. శంఖుస్థాపన సమయంలో మనం ఉపయోగించే పూజా ద్రవ్యాలు, నవ ధాన్యాలు వగైరా గృహం లోపలకు వచ్చే విధంగా చూడాలి. అంటే ఆ తీసిన గుంత మధ్యలో లేదా ఇంకొంచెం లోపలకు ఉండే విధంగా పాతి పెట్టాలి.

గృహారంభం ఈశాన్యంలోనే చేయాలని, వేరే చోట్ల చేయకుండా ఉంటే మంచిది

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *